నా కన్నీటి గుండు కథ

by - October 31, 2019

వైజాగ్ లో ఒక కాన్వెంట్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న నేను అందరి పిల్లల లాగానే ఆతాలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ పెరిగాను. కాకపోతే మా క్లాస్ లో అందరి అమ్మాయిల కంటే స్పెషల్ గా ఉండేది నా శ్రావ్య. పొడవాటి కురులు ఆమె అందానికి పెద్ద ఆకర్షణ. ఎంత మందిలో ఉన్న కూడా తన జుట్టు ని చూసి యిట్టె పసిగట్ట కలిగినంత అందమైన మేను తనది. గుండ్రటి మోహము, ఎందకంటే గుండ్రటి బాతు గుడ్ల లాంటి కళ్ళతో నా చూపులని మరల్చకుండా ఉండేది ఆమె అందం. ఎప్పుడు రెండు జాడలు వేసుకొని వాస్తు ఉండే శ్రావ్య శనివారం రోజున మాత్రం ఒక్క జడ తో వచ్చేది. ఎప్పుడన్నా లూస్ హెయిర్ తో వచ్చేది. అలా వచ్చిన నా కళ్ళు మొత్తం ఆమె జుట్టు వంకనే ఉండేవి. గాలి రావాలని ఎంత కోరుకుంటానో నాకు మాత్రమే తెల్సు. ఎందుకంటే గాలికి ఊగే ఆమె కురులంటే నాకు ఇంకా ఇష్టం.
దసరా సెలవలకి తాతయ్య వాళ్ళ ఊరికి వెల్లేసి వచ్చాను. సెలవుల తరువాత స్కూల్ తెరిచిన రోజున
శ్రావ్య కోసం నా కళ్ళు ఎంత వెతికాయో నాకే తెలుసు. ఆ రోజు రాలేదు. ఆ తరువాతి రోజు కూడా లేదు. మూడో రోజున నేను ఎప్పటి కంటే కొంచెం లేట్ గా వెళ్ళాను స్కూల్ కి. ఫస్ట్ బెంచ్ లో ఎవరో కొత్తగా వచ్చినట్టు అనిపించింది. ఎవరో అమ్మాయి తలకి కాప్ పెట్టుకొని ఉంది. నేనెవరో న్యూ జాయిన్ అనుకున్నాను. కానీ దెగ్గరికి వెళ్ళాక చూసి షాక్ అయ్యాను. శ్రావ్య ఏంటి బోడి గుండు లో ఏంటి? నా వెనకాలనే మేడం కూడా అడుగుపెట్టారు. నా కళ్ళ ముందరనే శ్రావ్య తన తలకి పెట్టిన టోపీ తీసేసింది. ఎప్పుడు నల్లటి మేఘం లా ఉండే తన తల ఇప్పుడు బోసి పోయింది. మెరిసిపోతూ ఉంది. నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను.
నా మనసు మనసులో లేదు ఆ రోజు మొత్తం. అసలు ఏమయ్యిందో తెలుసుకోవాలనే కుతూహలం ఇంకా పెరిగింది నాలో. ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క నరకం లాగా అనిపించింది. కాకపోతే నా కళ్ళలో మాత్రం శ్రావ్య గుండు మాత్రమే మెరిసిపోతూ కనపడుతుంది. ఇంటర్వెల్ బ్రేక్ లో ఎమన్నా తెలుస్తుందేమో అని చూసాను కానీ ఆ అదృష్టం అసలు కలగలేదు. చివరకి అన్నం తినే టైం లో మా క్లాస్ లో అందరం ఒకే దెగ్గర కలిసి కూర్చొని తినే వాళ్ళము. ఆ సమయం లో తాను అందరికి తిరుపతి ప్రసాదం పెట్టింది అప్పుడు నా ఫ్రెండ్ మధు గాడు అడిగాడు "ఏంటి శ్రావ్య రెండు పిలకలు నుండి నున్నటి బోడి గుండు లోకి మారవు అని".
తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాకపోతే ఏమి మాట్లాడలేక పోయింది. నాకు మధు గాడికి కూడా నున్నగా గీకేద్దాం అన్నంత కోపం వచ్చింది కానీ ఏమి చేయలేము అన్నట్టు మెదలకుండా ఉన్నాను. ఇంకేమి మాట్లాడకుండా ప్రసాదం అందరికి పెట్టి త్వరగా తినేసి వెళ్ళిపోయింది. అప్పటి వరకు క్లాస్ లో అందరి అమ్మాయిలకి ఈర్ష్య కలిగించే జుట్టు లేకపోవడం తో గొర్రె తోక ఉన్న ప్రతి ఒక్కతి వచ్చి శ్రావ్య ముందు పోజ్ లు కొట్టడమే. నాకు అయితే అందరికి పర పర మని గొరిగేద్దాం అనేంత కోపం వచ్చింది వాళ్ళ వేషాలకి. కాకపోతే జుట్టు ఉన్నప్పుడు శ్రావ్య కొట్టిన పోజ్ ల వల్లనే వాళ్ళు కూడా అలా చేస్తున్నారు అనేది నిజం. జుట్టు ఉన్న టైం లో అయితే వాళ్ళ పిలకలని పైకి ఎత్తి "దీనిని జుట్టు అని కూడా అంటారా?" అని వెక్కిరించేది. అలాంటి శ్రావ్య కి అసలు తల మీద ఒక్క వెంట్రుక కూడా లేనట్టే నున్నగా గొరిగేసి ఉంది.
అసలు ఏమై ఉంటదా అని అనుకుంటూ ఆ రోజు మొత్తం ఆలోచనలే. శ్రావ్య ఇంటికి వెళ్ళింది. వెళ్ళాక ఏమి జరిగింది అనేది శ్రావ్య వెర్షన్ లో చెప్తాను ఇక్కడ నుండి.
"చ.. దీనమ్మ జీవితం. ఈ గుండు ఏమో కానీ ఇవ్వాళ మొత్తం సిగ్గుతో తల దించుకునే ఉండాల్సి వచ్చింది. ఆ మధు గాడు ఒకడు నా పరువు మొత్తం తీసేసాడు అనుకో. ఆ గొర్రె బెత్త జుట్టు ఉన్న ప్రేమ ని అయితే చంపేద్దాం అన్నంత కోపం వచ్చింది అనుకో. ఇంటికెళ్ళగానే అమ్మ తన జడ ని వేసుకుంటూ ఉంది. నేను ఇంట్లో అడుగు పెట్టగానే "రావే గుండు" అని సరదాకి పిలిచింది. అంతే ఇంకా నా టెంపర్ ఆగలేదు. "నీకు కూడా నేను గుండు నేనా? నీ వల్లనే కదా నాకు గుండు అయ్యింది అసలు. నువ్వేమో ఇప్పుడు జుట్టుతో కులుకుతున్నావు నాకేమో ఇలా బోడి గుండు... ఛ అని అరిచాను... అమ్మకి ఏమి అర్ధం కాలేదు ఒక్క నిమిషం పాటు.
"ఒసేయ్ నేనేం అన్నానే ఇప్పుడు. నా మీద ఎందుకు అరుస్తున్నావే?"
"అరవడమా. నాకు ఉన్న కోపానికి నీకు ఇప్పుడే నున్నగా గొరిగెయ్యాలి అనిపిస్తుంది".
మెల్లగా అమ్మ వచ్చి నా పక్కన కూర్చొని "అసలు ఏమైంది రా? ఎందుకు అలా ఉన్నావు అని మెల్లగా అడిగింది.
"ఏమి లేదు లే. స్కూల్ లో అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు. ఆఖరికి ఆ పిలక ప్రేమ కూడా నా ముందుకి వచ్చి మరి జుట్టు ని సరి చేసుకుంటూ ఉంది. నీ వల్లనే నాకు ఈ గతి పట్టింది లేకపోతే ఈ పాటికి హాయిగా నేనేమో జుట్టు దువ్వుకుంటూ ఉండే దానిని నువ్వేమో బోడి గుండు లో ఉండే దానివి".
అదేంటి ఎందుకు అలా అయ్యింది అని అనుకుంటున్నారా. అలా అయితే మీకు అసలు జరిగిన కథ చెప్పాల్సిందే. దసరా సెలవలకి ఊరికి వెళ్లిన మేము అటు నుండి అటు తిరుమల ప్రయాణం పెట్టింది అమ్మ. ఇప్పుడు ఎందుకు తిరుమల అంటే "నార్మల్ గానే వెంకన్న దర్శనం చేసుకుందాం అని చెప్పింది. సరే అని కార్ లోనే బయలుదేరి నాన్న, నేను అమ్మ ముగ్గురము వెళ్ళాము. అక్కడికి చేరే సరికి రాత్రి పదకొండు అయ్యింది. ఆ సమయం లో కొండ పైకి ఎందుకు లే అని తిరుపతి లోనే ఒక రూమ్ తీసుకొని ఉన్నాము. ఆ రాత్రి సమయం లో అమ్మ కి తల నొప్పి గా ఉంది అని తలకి నూనె పెట్టుకుంటూ ఉండే సమయం లో నేను కూడా పెట్టమని అడిగాను. సరే అని చెప్పి కింద కూర్చోమని చెప్పి జుట్టు మొత్తం జడ విప్పేసి బాగా తలకి ఆయిల్ పెట్టింది. ఆ తర్వాత అంతే నిద్రపోయాను. ముందు రోజు ప్రయాణానికి బాగా అలసిపోయే సరికి అందరం బాగా నిద్రపోయాము. నేను అయితే పొద్దునే పది తర్వాత లేచాను. నాన్న తొందరగానే లేచారు కానీ నన్ను నిద్ర లేపడం ఎందుకు లే అని లేపలేదు అంట.
నేను లేచే సరికి అమ్మ లేచేసి బ్రష్ చేస్తూ ఉంది. నాన్న ఏమో నాకు అమ్మ కి టిఫిన్ తీసుకొని వచ్చి పెట్టాడు. నన్ను లేపి తినేస్తే కొండపైకి బయలుదేరదాం అని చెప్పాడు. సరే అని లేచి బ్రష్ చేసి వచ్చి తినేసాం అమ్మ నేను. తల స్నానం చేస్తాను అంటే "ఎందుకే ఇప్పుడు? కొండ పైకి వెళ్ళగానే అక్కడే స్నానం చేసి దర్శనానికి వెళ్ళేసి వద్దాం కదా. సరే అని చెప్పి అక్కడ నుండి బయలుదేరాము. నేనేమో నైట్ ప్యాంటు మరియు పైన టీ-షర్ట్ వేసుకొని ఉన్నాను. ఒక్క గంటన్నర లో కొండ పైకి వెళ్లడం, రూమ్ తీసుకోడం అంత అయిపోయింది.
"ఒసేయ్ స్నానం చేసి వస్తావా. కళ్యాణకట్ట కి వెళ్లి మూడు కత్తెర్లు ఇచ్చేసి వద్దాము".
నేనే ఓవర్ ఆక్షన్ చేసుకుంటూ "అబ్బా. ఇప్పుడు అక్కడ వరకు వెళ్లాలా ఏంటి? పోయిన సరి నా ఫ్రెండ్ సారిక వాళ్ళు వచ్చినప్పుడు మంగళిని కాటేజీ కి పిలిపించుకొని మూడు కత్తెర్లు ఇచ్చారు అంట తెలుసా. మనం కూడా అలానే చేద్దాం అమ్మ. నాకు కళ్యాణకట్ట కి రావడం ఇష్టం లేదు. అక్కడ అందరూ గుండు లు చేపించుకుంటూ ఉంటారు. అప్పుడు కానీ నా జుట్టు ని చూస్తే దిష్టి పెట్టేస్తారు. అందుకే వద్దు.
"ఓసిని... నీకేం పోయే కాలం వచ్చింది. కొంచెం దూరం ఎహ్ కదా నడిచేది. వెళ్ళేసి వస్తే అయిపోతుంది కదా".
"చూడండి నాన్న. మంగళిని ఇక్కడికే పిలుద్దాం ప్లీజ్".
నాన్న - ఒసేయ్ అమ్మాయి చెప్పింది చెయ్యి. ప్రతి సరి కళ్యాణకట్ట కె వెళ్తున్నాం కదా. ఈ సారికి ఇలానే కానిచ్చేద్దాం.
అమ్మ - "సరిపోయింది మీరు మీ సంబడం. ఇద్దరు ఇద్దరే. సరే లే మీ ఇష్టం".
నాన్న - "సరే నా నాన్న?"
"మా మంచి నాన్న. చూసావా అమ్మ. నాన్న నా పార్టీ" అని నాన్న కి కిస్ ఇచ్చాను బుగ్గ మీద.
"సరే నే నేను వెళ్లి మంగళిని పంపిస్తాను ఈ లోపు రెడీ గా ఉండండి. నేను అటు నుండి అటు సుబ్బా రావు గాడిని కలిసేసి వస్తాను. సరే నా" అని చెప్పి నాన్న వెళ్ళిపోయాడు.
"అమ్మ నేను స్నానానికి వెళ్ళేసి వస్తాను" అని చెప్పి లోపలకి వెళ్లి సన్ సిల్క్ షాంపూ తో తల స్నానం చేసి వచ్చాను. వచ్చి డ్రెస్ వేసుకొని తల ఆరబెట్టుకుందాం అనే లోపు అమ్మ ఇలా అనింది "ఒసేయ్ తడిగానే ఉండనివ్వవే.. అలా ఉన్నపుడు దేవుడికి కత్తెర్లు ఇస్తేనే పుణ్యం అంట. మొన్న టీ.వి లో కూడా చెప్పారు. ఇటు తిరుగు అని చెప్పి మెడ దెగ్గర రబ్బర్ బ్యాండ్ తీసుకొని వేస్తూ ఉండే లోపు తలుపు తట్టినట్టు ఉంది. ఎవరా అని చూస్తే మంగలి అతను ఉన్నాడు. తెల్లటి పంచె తెల్ల చొక్కా వేసుకొని నీట్ గా కనపడుతున్నాడు. వచ్చి వేరండా లో కూర్చోండి అని అమ్మ చెప్పింది.
మా వారు అంత చెప్పారు కదా? అని అడిగింది అమ్మ.
మంగలి - హా అమ్మ. అంత చెప్పారు. మీకేం భయం లేదు. డబ్బులు కూడా ఆయనే ఇచ్చేసారు. ఇక్కడ పని పూర్తి చేసుకొని వెళ్లడమే.
అమ్మ - "ఒసేయ్ నేను త్వరగా నేను వెళ్ళేసి స్నానం చేసి వస్తాను ఈ లోపు నువ్వు వెళ్లి చేపించుకో అని చెప్పింది. నేను సరే అన్నాను. మంగలి అది విని నా వంక చూసి నవ్వాడు. నేను కూడా నవ్వాను.
మంగలి దెగ్గరికి వెళ్ళాను ఆయన సామాన్లు అన్ని తీసి పెట్టుకున్నాడు. నేను అడిగాను "కుర్చునేనా?"
"హా అమ్మ కూర్చో..."
నాన్న గారు అంత చెప్పారు కదా?
మంగలి - "అంత చెప్పారు అమ్మ. జాగ్రత్తగానే చేస్తాను. మీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పాడు.
నేను నా వీపు ఆయన వంక చూపిస్తూ కూర్చున్నాను. వెంటనే ఆయన "అమ్మ అటు కాదు నా వైపు తిరిగి కూర్చోండి అని చెప్పాడు.
నేను సరే అని ఆయన వంక తిరిగి కూర్చున్నాను. జుట్టు బాగానే తడిగానే ఉంది అమ్మ.
"హా అవును అండి. ఇప్పుడే తల స్నానం చేసి వచ్చాను. అమ్మ చెప్పింది ఇలా ఇస్తేనే పుణ్యం అని. అందుకే రబ్బర్ బ్యాండ్ పెట్టింది అమ్మ. ఇంకా సరిగ్గా ఆరనే లేదు. మీకు పర్లేదు కదా ఇలా ఉంటే?"
"హా సరిపోతుంది అమ్మ ఇలా" అని చెప్పి నా తల ని బాగా కిందకి వంచి తన చేతితో నది నెత్తి దెగ్గర పెట్టి కొంచెం అటు ఇటు సర్దాడు జుట్టుని.
కత్తెర్లు అంటే మొదళ్ళ నుండి తీస్తారు కొంత మంది మంగలి అని సారిక చెప్పింది. పెట్టిన స్పాట్ లో కత్తెరించిన కూడా పెద్దగా తేడా తెలీదు అని "హమ్మయ్య అని అనుకున్నాను".
"అమ్మ మొదలు పెడుతున్న అని చెప్పాడు ఆయన".
హా మొదలు పెట్టండి అని కళ్ళు మూసుకున్నాను. ఎప్పుడు నా జుట్టు ని అంత కత్తెరించలేదు. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంత పొడవాటి జుట్టు ని కట్టెరిస్తాడు అంటే. కాకపోతే కొంచమే కదా అది కూడా దేవుడికి కదా అలా అనకూడదు అని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను.
"మెల్లగా శ్రీక్ శ్రీక్ అని శబ్దం వచ్చింది. వచ్చి ఆగింది." హమ్మయ్య అయిపోయింది అనుకోని కళ్ళు తెరిచి లేగుద్దాం అనుకునే లోపు మల్లి శబ్దం వచ్చింది "శ్రీక్ శ్రీక్" అని. ఈ సారి కొంచెం ఎక్కువగా వినపడింది. తలలో కత్తెరించిన చోట చాలా చల్లగా అనిపించింది. "అయినా అదేంటి అంత చల్లగా అనిపించింది కత్తెరించిన చోట? అని వెంటనే నా వేలు తీసి అక్కడ పెట్టాను.
అంతే నాకు నోట్లో మాట రాలేదు. నా వెలికి నున్నగా తగిలింది. కొంచెం గరుగుగా ఉన్న ప్రదేశం లాగా అనిపించింది. ఈయనేంటి అంత నున్నగా కత్తెరించాడు అని తల లేపాను "వెంటనే ఆయన అలా లేపితే తెగుతుంది అమ్మ. జాగ్రత్త" అని చెప్పాడు. నాకు ఒక్క నిమిషం ఏమి అర్ధం కాలేదు.
నిశ్శబ్దం లో స్లో మోషన్ లో మంగలోడి చేతిలో మంగలి కత్తి కనపడింది. అప్పుడు అర్ధం అయ్యింది నాకు చేసింది మూడు కత్తెర్లు కాదు గుండు మొదలు పెట్టాడు అని... పెద్దగా అరిచాను "ఏమి చేసారు అసలు? మిమ్మల్ని అడిగింది మూడు కత్తెర్లు అయితే గుండు ఎందుకు చేస్తున్నారు అసలు?"
"ఏంటమ్మా అలా అంటారు. ఆయన వచ్చి చెప్పింది అదే కదా. పాప కి గుండు అని..."
"వాట్... ఏమి మాట్లాడుతున్నారు అసలు. మా నాన్న ఎందుకు నాకు గుండు అని చెప్తాడు".
ఈ లోపు పైన ఉన్న అతను బయట నుండి వస్తూ "పైకి వెళ్లి చేసి వచ్చారా" అని అడిగాడు. అంతే అప్పుడు మేటర్ అర్ధం అయ్యింది మంగళోడు కన్ఫయూజ్ అయ్యాడు అని.
"హయ్యో అమ్మ సారీ అమ్మ. నేను కింద గుండులు పైన ఏమో మూడు కత్తెర్లు అనుకోని వచ్చాను. మీరు అయినా ఒక సరి చెప్పాల్సింది కదా. దానికి తగ్గట్టు తడి జుట్టుతో ఉండే సరికి మీరు రెడీ గానే ఉన్నారేమో అనుకున్నాను"...
నాకు పిచ్చి కోపం వచ్చి "అయినా తప్పు మీరు చేసి నేను చెప్పాలి అని ఎందుకు అంటున్నారు" అని అన్నాను. నా అరుపులకి అమ్మ లోపల నుండి హడావిడి గా బయటకి వచ్చింది. "ఏమయ్యింది ఎందుకు అలా అరుస్తున్నావు?" అని అనింది.
నేను లేచి "ఇటు చూడు అని చెప్పి" నా నడి నెత్తి మీద గొరిగిన ప్రదేశం చూపించాను.
"హయ్యో అదేంటే!!! గుండు ఎందుకు మొదలు పెట్టించుకున్నావు?"
"ఒసేయ్ మెంటల్ దాన. నేనెందుకు నా అందాన్ని వదులుకోవాలని అనుకుంటాను"
మెల్లగా మంగలి అంత అర్ధం అయ్యే లాగా చెప్పాడు. సరే అని నేను అమ్మ ని అడిగాను "అమ్మ జుట్టు తో కవర్ చేయొచ్చా?"
"ఒసేయ్ పాపిట తీసే దానిలో గొరిగాడే. రెండు జడలు వెయ్యడం కష్టం. ఒక వేళ లేదు అన్న కానీ అది కనపడిపోతుంది. ఇంకా చెయ్యకలిగింది ఏమి లేదే. మొత్తం తీయించేయాల్సిందేనే.
"నా కళ్ళ వెంట నీళ్లు బొట బొట కారిపోయాయి. ఒసేయ్ ఏమంటు అన్నావో ఇప్పుడు చూడు నా పరిస్థితి అని అమ్మ మీద అరిచాను.
అమ్మ - "ఒసేయ్ ఇప్పుడు నా మీద ఎందుకు అరుస్తున్నావు. పైన వాళ్ళు కూడా చూస్తున్నారు. అరవకుండా మిగతా అంత గొరిగించేసెయ్యి. లేకపోతే బాగోదు" అని ఉచిత సలహా ఇచ్చింది.
ఇంకా చేసేది ఏమి లేదు అని అర్ధం అయ్యి "ఇంకేం చేస్తాము లే అని మంగలి ముందర కూర్చొని. గొరిగేసెయ్యండి అని చెప్పను నా నోటితోనే"
మంగళోడు మెల్లగా గొరగడం మొదలు పెట్టాడు. నాకు ఏడుపు ఆగకుండా వస్తూనే ఉంది. ఎన్నో సంవత్సరాలు నా తల మీద ముద్దుగా ఉన్న నా నల్లటి కురులు ఇక నుండి ఉండవు అని అనుకోగానే ఇంకా ఏడుపు పెరిగిపోయింది. స్కూల్ లో అందరిని ఎలా ఫేస్ చేయాలో అందరూ అడిగే వాటికి ఏమి చెప్పాలో అని ఎన్నో ఆలోచనలు బుర్ర లో తిరుగుతున్నాయి. అసలు ఇప్పటి వరకు రాజకుమారి లాగా ఉండే నేను ఇక నుండి బొచ్చు పీకిన కోడిలాగా తయారు అవుతాను అని ఊహించుకుంటేనే చాలా భయం వేస్తూ ఉంది. ఇన్ని ఆలోచనల మధ్య నున్నగా గొరిగేసాడు మంగళోడు.
మంగలి - "అమ్మ అయిపోయింది ఇంకా లేవోచ్చు అని చెప్పాడు. మెల్లగా లేచాను. అంతే నా పొడవాటి వెంట్రుకలు కాస్త కింద నిర్జీవం లాగా పడి ఉన్నాయి".
నాకు ఏడుపు ఇంకా అసలు ఆగలేదు. అంతే బాత్రూం లోకి వెళ్లి ఒక ఇరవై నిమిషాలు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అద్దం లో నన్ను నేను చూసుకుంటే భయం వేసింది చాలా. నా మొహం నాకే వింతగా ఉంది. ఇంకా ఏడుపు వచ్చింది. నాన్న వచ్చాక జరిగింది అంతా విని ఇంకా బాధ పడ్డారు. నాన్నకి నా జుట్టు అంటే చాలా ఇష్టం. నాతో పాటు నాన్న కూడా కాసేపు బాధ పడ్డారు.
ఇది అండి నా కన్నీటి గుండు కథ.

You May Also Like

2 Comments

  1. Chaala baagundi mi story...... Superb...

    ReplyDelete
  2. Second part rayandi Malli esari gundu cheyisty ela untdi ani

    ReplyDelete