చెల్లి - "ఒసేయ్ నువ్వే కదా తర్వాత. వాళ్ళని వదిలేశావెంటి?"
నేను - "అబ్బా. ఒక్క అయిదు నిమిషాలు అటు ఇటే కదా ఏమి కాదు లేవే. ప్లీజ్ కాసేపు ఆగు. ఎందుకు తొందర చేస్తున్నావు?"
చెల్లి - "అందుకు కాదే. త్వరగా కానిచ్చేస్తే మనం మల్లి ఆకాశ గంగ అది తిరగాలి కదా".
అమ్మ - "ఒసేయ్ ఏదో ఒకటి చెయ్యండి ఇద్దరు కలిసి. ఇక్కడ గొడవ అయితే చెయ్యకండి. అందరు ఉన్నారు కదా".
నాన్న - "అమ్మాయిలు ఏంది ఇంకా అవ్వలేదా? బయట డ్రైవర్ కాల్ చేస్తున్నాడు. త్వరాగా కానివ్వండి".
చెల్లి - నేను అదే చెప్తున్నాను నాన్న త్వరగా కూర్చో మని. ఇదే ఒక్క అయిదు నిమిషాలు అని అంటుంది.
నేను - చూడు వాళ్ళు కూడా కత్తెర్ల కోసమే లే. అయిపోయింది. కాసేపు ఓపిక పట్టు వెళ్ళిపోదాం.
నేను నా చేతిలో ఉన్న టోకెన్ ని మంగళావిడ చేతిలో పెట్టాను. నా మెడకి ఉన్న స్కార్ఫ్ ని తీసి చెల్లి చేతికి ఇచ్చాను. పోనీటైల్ కి ఉన్న హెయిర్ బ్యాండ్ ని తీసి నా ఎడమ చేతి మణికట్టుకి కట్టుకున్నాను. ఈ లోపల ఆ మంగళావిడ ఆ గచ్చు మీద ఉన్న జుట్టు ని మొత్తం నీట్ గా తుడిచేసింది తన దెగ్గర ఉన్న బ్రష్ తో. నేను నా ఎడమ చేతితో నా జుట్టుని మొత్తం మెల్లగా పైన నుండి వదులుతూ లూస్ చేస్తున్నాను. వెనక నుండి అమ్మ మరియు చెల్లి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు.
అప్పుడే గుండు గొరిగించుకొని మూడు కత్తెర్లు ఇచ్చిన ఫామిలీ వాళ్ళు మెల్లగా అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. నేను నా డ్రెస్ ని సరిచేసుకొని మెల్లగా మంగళావిడ ముందర కూర్చున్నాను బాసా పట్టీలు వేసుకొని.
అసలు ఏంటి ఇది అంతా? ఎవరు నేను అని అనుకుంటున్నారా? అలా అయితే వెనక్కి వెళ్లాల్సిందే.
నా పేరు భ్రమరాంబ. పొడవాటి జడ నాలోని ప్రత్యేకత. మా కుటుంబం లో అమ్మ, నాన్న, నేను మరియు చెల్లి. మా ఇంట్లో ఎప్పుడు నాదే పై చెయ్యి ఉంటది. అమ్మ నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పదు. నేను చదువులోనూ ఇంటి పనులలోను ఎప్పుడు ఉంటూనే ఉంటాను. అందుకే ఇంట్లో అందరికి నేను అంటే బాగా ఇష్టం. వారం లో ఆదివారం మాత్రం మాకు జుట్టుని జాగ్రత్తగా చూసుకోడం లోనే సమయం మొత్తం సరిపోతది. అమ్మ నాకు చెల్లికి మంచిగా అలోవేర తో హెయిర్ మాస్క్ పెట్టి ఆ తర్వాత కుంకుడికాయలతో తల అంటుతోంది. ఒక్కటి అంటే కాదు మా జుట్టు కుదుళ్ళ నుండి మంచిగా ఉండడానికి అన్ని చేస్తుంది అమ్మ.
మా చెల్లికి నేను అంటే ఇష్టమే కానీ అందరు నన్ను చూసుకునే విధానం మాత్రం ఇష్టం ఉండదు. ఏదో నేనే అందరికి ఇష్టం అన్నట్టు ఉంటుంది అని దాని ఫీలింగ్.
నా జుట్టు పిరుదుల మీద వరకు ఉంటుంది కానీ నా చెల్లి జుట్టు మాత్రం భుజాల కింద వరకు ఉంటుంది. కాకపోతే మా అమ్మ జుట్టు ఏ మా ఇద్దరికీ వచ్చింది. కుదుళ్ళ నుండే ఒత్తు అయినా జుట్టు మాది. ఒక రోజు అంతే అమ్మ అలానే ఆయిల్ పెడుతున్న టైం లో మా చెల్లి వచ్చి నా జుట్టు ని లాగింది. కొంచెం కోపం గా దాని వంక చూసాను. అది వెంటనే "ఏంటే... నీ జుట్టు ని లాగ కూడదా ఏంటి?"
ఆ తర్వాత అది అమ్మ చేత ఎండ్స్ లో ఒక రెండు ఇంచెస్ కత్తెరించేసుకుంది. ఆ రోజు సాయంత్రం ఇద్దరం కలిసి రూమ్ లో ఉన్నప్పుడు ఫుల్ బిజీ గా ఎవరితోనో చాట్ చేస్తుంది. నేను అడిగాను ఎవరే అని?
నీకెందుకు అని పొగరు గా సమాధానం చెప్పింది. నాకు కోపం వచ్చి ఒక్కటి ఇచ్చాను చెంప మీద. వెంటనే అది ఏడ్చుకుంటూ అమ్మ దెగ్గరికి వెళ్లి నేను కొట్టాను అని చెప్పింది. నేను కూడా అమ్మ తో చెప్పను "చదవకుండా ఎవరో ఫ్రెండ్ తో తెగ చాట్ చేస్తుంది అని".
అమ్మ వెంటనే దానిని అడిగింది "అది ఎక్సమ్ గురుంచే మాట్లాడుతున్నాను అమ్మ. కావాలంటే చూడు అని దాని మొబైల్ చూపించింది...""
నేనే పొరబడ్డాను అని అర్ధం అయ్యింది. సరే అని కవర్ చేసుకోడానికి అని "అయినా దాని గురుంచి ఇప్పుడు చాట్ చేసేది ఏంటి? చదువుకోకుండా? ఫెయిల్ అయితే కదా నీ పని చెప్పేది?" అని అన్నాను.
వెంటనే దానికి కోపం వచ్చి "సరే నేను కనుక పాస్ అయితే ఏమి చేస్తావు అని అడుగుతుంది?"
వెంటనే నేను "పాస్ అవ్వు నువ్వు ఏది చెప్తే అది చేస్తాను" అని అనేశాను.
ఆ రోజున ఆ మాట ఎందుకు అన్నానో తెలీదు కానీ ఆ మాటనే నా కొంప ముంచింది అని ఆ తర్వాతనే అర్ధం అయ్యింది.
నేను దాని గురుంచి మర్చిపోయాను కూడా. దాని ఎగ్జామ్ రిజల్ట్స్ రావడం అది పాస్ అవ్వడం అన్ని జరిగాయి. మా పందెం గురుంచి అది కూడా ఏమి గుర్తు చేయలేదు. ఇలా ఉండగా ఒక రోజు నాన్న వచ్చి మనం అందరం తిరుమల వెళ్తున్నాం అని చెప్పారు. అది కూడా మన కార్ లోనే అని అన్నారు. మేము అందరం ఎక్సైట్ అయ్యాము. కార్ కొని సంవత్సరం పైననే అవుతుంది కానీ మా ఫామిలీ మొత్తం కలిసి లాంగ్ ట్రిప్ కి ఎప్పుడు వెళ్ళడానికి కుదరలేదు. చెల్లి మరియు నాకు అయితే చాలా బాగా నచ్చింది. ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని ప్రిపేర్ అయ్యాము కూడా.
నేను మంచిగా నా హాట్స్ పెట్టుకున్నాను. దారి మధ్యలో ఆడుకుంటూ ఫుల్ గా పిక్స్ దిగుతూ వెళ్ళాము. నాకు చాలా బాగా నచ్చింది. చెల్లితో కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇలా అందరం కలిసి ట్రిప్ అది కూడా మా సొంత కార్ లో అనగానే అమ్మ కి చాలా ఆనందం అనిపించింది. కొండ పైకి వెళ్లే ఘాట్ రోడ్ లో జింకలు ఉండే ప్రదేశం దెగ్గర మరియు ఆంజనేయ స్వామి విగ్రహం దెగ్గర ఆగుతూ మెల్లగా పైకి ఎక్కాము. ఆంజనేయ స్వామి విగ్రహం దెగ్గర ఫామిలీ అందరం కలిసి మంచిగా ఒక పిక్ కూడా తీపించుకున్నాం. అప్పుడు కొంత మందిని గుండు లలో చూసాము అనమాట.
నేను చెల్లితో నవ్వుతు "చూసావంటే వాళ్ళు నున్నటి బోడి గుండు లలో ఉన్నారు. మన లాగా జుట్టు లేదు అన్నట్టు వెక్కిరించాను... వెక్కిరిస్తూ నా పొడవాటి జడని చేతులలోకి తీసుకొని మెల్లగా తిప్పుకుంటూ వాళ్లకి చూపించాను..."
చెల్లి మరియు అమ్మ ఏమి మాట్లాడలేదు. అలా అనకూడదు భ్రమ ... అది వాళ్ళు మొక్కు తీర్చుకొని ఉంటారు. గుండు కి ముందర వాళ్లకి నీ కంటే పొడవాటి జుట్టు ఉంది ఉండొచ్చేమో కదా. దానికే వాళ్ళని అలా అంటే ఎలా...
నాన్న కాటేజీ లో రూమ్స్ ముందరనే తీసుకున్నారు కాబట్టి వెళ్లిన వెంటనే తీసేసుకొని నేను ముందర స్నానం చేయడానికి వెళ్ళాను. నేను వచ్చాక చెల్లి అమ్మ కూడా స్నానం చేస్తారేమో అనుకున్న కానీ వాళ్ళు మాత్రం కల్యాణకట్ట కి వెళ్లొచ్చాక ఒక్క సరే తల స్నానం చేద్దాం లే అని అంటారు. నేను చెల్లితో "ఏంటే నువ్వు కూడా గుండు చేపిస్తున్నావా ఏంటి వాళ్ళ లాగా నున్నగా?"
చెల్లి కొంచెం కోపం తో "నేను ఎందుకు చేపిస్తాను?"
"ఎగ్జామ్స్ పాస్ అయ్యావు కదా. అందుకే మొక్కు కున్నవేమో అని అనుకున్నాను లేవే. దానికే కోపం ఎందుకు గుండు పిల్ల" అని కొంచెం వెటకారం గా అన్నాను.
(అప్పటి వరకు అసలు దానికి గుర్తుందో లేదో నాకు తెలీదు కానీ. కొరివితో తల గోక్కోవడం అంటే ఇదేనేమో)
సరే అని అందరం కలిసి కళ్యణకట్ట కి బయలుదేరాము. వెళ్లే దారిలో నాన్న అన్నారు "ఇవ్వాలనే మనం చుట్టుపక్కల తిరిగేసి వద్దాం అని". డ్రైవర్ కి కూడా చెప్పారు ఒక్క అరగంట లో వచ్చేస్తాం కల్యాణకట్ట నుండి. రాగానే ఇటు నుండి ఇటే వెళ్ళిపోదాం అని చెప్పాడు. కల్యాణకట్ట లోకి అడుగు పెట్టక అందరం లైన్ లో ఉండగా నాతో చెల్లి ఇలా అడిగింది "అక్కా... నేను పరీక్షలలో పాస్ అయితే నేను ఏది చెప్తే అది చేస్తాను అన్నావు కదా..." మా మాటలు అమ్మ కూడా వింటూ ఉంది.
నేను దానికి - హా అన్నానే అయితే?
చెల్లి - నేను అనుకున్నది ఏంటి అంటే "నేను పాస్ అయితే నీ తల నీలాలు సమర్పిస్తాను అని మొక్కుకున్నాను వెంకన్న కి".
నేను ఒక్క సారిగా షాక్ అయ్యి - "ఏయ్ జోక్ చెయ్యకు. నేనేంటి గుండేంటి" అని నా జడని చేతిలోకి తీసుకొని తడుముకున్నాను".
చెల్లి - "జోక్ ఎందుకు చేస్తాను అక్కా. మొక్కు గురుంచి. నిజం గానే మొక్కుకున్నాను అందుకే ఆ వెంకన్న కరుణించి నన్ను పాస్ చేసాడు. ఎలాగూ పాస్ అయితే ఏది అయినా చేస్తాను అని చెప్పావు కదా. అదే ధైర్యం తో మొక్కుకున్నానే. కావాలంటే అమ్మ ని కూడా అడుగు అని చెప్తుంది""
అమ్మ విని - ట్రిప్ కి ముందరనే చెప్పిందే అది నాతో. కాకపోతే ట్రిప్ కి ముందరనే చెప్తే గొడవ చేసి రాను అంటావని చెప్పలేదు. అందుకే ఇక్కడికి వచ్చేంత వరకు కూడా చెప్పలేదు.
నాన్న ఇది అంత విని - అయినా అదేమీ కోరికని అని చెల్లిని తిట్టాడు. కానీ మళ్ళీ "మొక్కు కదా భ్రమ. తీర్చాల్సిందే అమ్మ" అని అంటాడు.
క్యూ లో టోకెన్ తీసుకునే దెగ్గరికి వెళ్లడం చెల్లి నాకు ఒక్క దానికే గుండు టోకెన్ అని చెప్పి "టోకెన్ మరియు బ్లేడ్" తీసుకొని వచ్చింది. మేము అందరం కలిసి కల్యాణకట్ట లోకి అడుగుపెట్టాము. నాకు ఇచ్చిన మంగళావిడ నెంబర్ వచ్చేసి "నలభయ్ అయిదు".
ఇప్పుడు అర్ధం అయ్యింది అనే అనుకుంటున్నాను నేను ఎవరు, ఎందుకు అక్కడ ఉన్నాను అనేది.
బాస పట్టీలలో కూర్చున్నాను నేను. నా చేతిలో ఉన్న గుండు టోకెన్ తో పాటు సగం విరిచిన బ్లేడ్ ముక్కని కూడా మంగళావిడ కి ఇచ్చాను. ఆవిడ తీసుకున్న టోకెన్ ని పక్కనే ఉన్న జగ్గు లో పడేసి మంగలి కత్తితో నేను ఇచ్చిన సగం విరిచిన బ్లేడ్ ని వేయడానికి చేతిలోకి తీసుకున్నాను. నేను మెల్లగా ఆవిడ వంక చూసి "బ్లేడ్ మార్చకుండా అదే బ్లేడ్ తో చేస్తారా అండి" అని అడిగాను.
ఆవిడ చూసి నవ్వుతు "మీరు ఇచ్చిన బ్లేడ్ ని వెయ్యడానికే దీనిని తీస్తున్న అమ్మ. కంగారు పడకండి. ఏంటి మొదటి సారి ఆ గుండు?"
నేను - నా జుట్టు ని చూసుకుంటూ "ఇంత పొడవు జుట్టు ఉంది అంటే అంతే కదా మరి" అని అన్నాను.
మంగళావిడ నా జుట్టు మొత్తం ముందరికి వేసింది రెండు భాగాలు గా విడదీసి. కుడిపక్క కొంత జుట్టు మరియు ఎడమ పక్క ఇంకొంత జుట్టు ని. తలని బాగా వంచి మెడ దెగ్గర కూడా ఉన్న చిక్కుల్ని విడదీసి మరి జుట్టు ని వేరు చేసింది. నా తల బాగా వంచేసరికి నా జుట్టు మొత్తం వడిలో, కొంత భాగం ఏమో నేలని తాకుతూ ఉంది. మంగళావిడ నా ఎడమ వైపు జుట్టుని మొత్తం పట్టుకొని చేతితో మెలి తిప్పుతూ జుట్టు ని లాగుతూ ఒక మూర వరకు జుట్టుని మడిచి పక్కన ఉన్న రబ్బర్ బ్యాండ్ ని తీసుకొని ముడి లాగా వేసింది. ఒక పక్క చిన్న బంతి ఇంకొక పక్క పొడవాటి జుట్టు.
(నా మనసులో "ఏంటో ఎప్పుడు పార్లర్ లో కూడా జుట్టు మీద కత్తెరనే పెట్టనివ్వని నేను ఏంటి. నా జీవితం లో ఇలాంటి ది చూస్తాను అనే అనుకోలేదు అలాంటిది ఇప్పుడే ఏకం గా నేనే ఈ పరిస్థితిలో ఉన్నానే అనే బాధ మాత్రం అనిపించింది. నాకు తెలీకుండానే కళ్ళలో నుండి నీళ్లు కదలాడుతున్నాయి").
ఇంకొక పక్కన జుట్టు ని కూడా అంతే బంతి లాగా చేసి కట్టింది ఆవిడ. నా కళ్ళ ముందరనే నా జుట్టు అలా వేలాడుతుంటే నాకే కొంచెం ఏదోలా అనిపించింది
వెనుక మా చెల్లి మా అమ్మతో అనే మాటలు వినబడుతూ ఉన్నాయి "అమ్మ భలే ఉంది కదే అక్క అలా రెండు బంతుల లాగా జుట్టు వేసుకొని. ఎప్పుడు జడ లోనే తిరుగుతూ ఉండే భ్రమరాంబ కి ఇప్పుడు జడ కాదు కదా జుట్టు ఏ లేకుండా పోతుందే. పాపం కదా అమ్మ.
అమ్మ - ఒసేయ్ అలా మనకే. మొక్కు కనుకనే అది అయినా తప్పని సరిగా చేయిస్తుంది. లేకపోతే ఎందుకు చేపిస్తది నేను ఎందుకు ఒప్పుకుంటాను.
మంగళావిడ మెల్లగా ఒక చిన్న కప్ లో నుండి నీళ్లు తీసుకొని తడపడం మొదలు పెట్టింది. గోరు వెచ్చని నీళ్లు అనుకుంట కొంచెం వేడిగా అనిపిస్తుంది జుట్టు లో. కుడి చేతితో కప్ తో నీళ్లు పోస్తూ ఎడమ చేత్తో నా జుట్టులోకి వేళ్ళు పోనించి మరి మెల్లగా మస్సాజ్ చేస్తుంది.
నాకు అర్ధం కాక ఆవిడతో "అయినా గుండు తర్వాత జుట్టు ఉండదు గా ఇప్పుడు ఎందుకు ఈ మసాజ్. నాకు అర్ధం కాలేదు".
మంగళావిడ నవ్వుతూ - ఇది జుట్టు పెరగడానికి ఇచ్చే మసాజ్ కాదమ్మా, గొరగడానికి ఇచ్చే మసాజ్ లే ఇది. ఇలా చేస్తే జుట్టు కుదుళ్ళ నుండి బాగా తడిసి ఈ మంగలి కత్తితో గీస్తూ ఉంటె బాగా తెగుతు ఉంటుంది.
వెంటనే నేను కంగారు పడుతూ - "వామ్మో తెగుతుందా? ప్లీజ్ అండి తెగకుండా గీయండి గుండు ప్లీజ్ అని అడిగాను.
మంగళావిడ - "అయ్యో పిచ్చి పిల్ల. తెగడం అంటే. జుట్టు గొరిగేప్పుడు గాట్లు పడకుండా మంచిగా గీయడానికి ఈ మసాజ్ బాగా సహాయ పడుతుంది అని చెప్తున్నాను అని అంటూ రెండొవ చెయ్యి కూడా వేసి మెల్లగా రుద్దుడు స్టార్ట్ చేసింది.
అదేంటో జీవితం లో ఇప్పటి వరకు అమ్మ చేతి మసాజ్ తప్పితే వేరే వాళ్ళ దెగ్గర నుండి తీసుకోలేదు కదా. అందుకేనేమో ఈవిడ చేతి నుండి మసాజ్ మాత్రం స్వర్గం లో ఉన్నట్టే ఉంది. ఎంతో సమ్మగా మరియు కమ్మగా ఉంది. కళ్ళు మూసుకొని ఉంటె చాలు స్వర్గం నా కాళ్ళ కిందరనే ఉందేమో అనే లాగా ఉంది. అందుకే అంటారేమో "గుండు గొరిగే చేతుల్లోనే స్వర్గం చూపించే మసాజ్ పెడతాడు దేవుడు" అని.
నేను కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఈ లోపల మంగళావిడ మెల్లగా మంగలి కత్తిని తీసుకొని నా నడి నెత్తిమీద పెట్టి పాపిట మధ్యలో నుండి మెల్లగా గొరుగుడు మొదలు పెట్టింది. నా ఒత్తు అయినా జుట్టు కనుక నాకు అర్ధం అయ్యింది ఏ ప్రదేశం లో గొరిగింది అనేది. ఎందుకు అంటే ఆ ప్రదేశం లో చక్కిలిగింతలు పుడుతున్నాయి మరియు చల్లటి గాలి ఇంకా చల్లగా తగులుతుంది.
ఆ గాలి తాకుడుకి నా నరాలు జివ్వుమన్నాయి ఒక్క సారిగా. అలా గొరుగుతూ మెల్లగా వెనకకు వెళ్ళింది మన మంగళావిడ. నా తల బాగా కిందకి వంచింది. ముందర నాకు అర్ధం కాలేదు ఎందుకు ఇంత వంచుతుంది ఈవిడ అని. అప్పుడు అర్ధం అయ్యింది ఆవిడకి అనువుగా చూసుకొని వంచుతుంది నా తల ని అని. నేను కూడా చేసేది ఏమి లేదు కనుక కిందకి చూసుకుంటూ ఉన్నాను. కింద చూస్తే అంతక ముందు గొరిగిన పిల్లోడి వెంట్రుకలతో పాటు మూడు కత్తెర్లు ఇచ్చిన జుట్టు కూడా ఉంది. అది చూస్తూ ఉంటె నాకు ఎందుకో ఇది అడగాలి అనిపించింది మంగళావిడని "మీరు ఎప్పుడు ఇంత పొడవు జుట్టు లనే గుండు లు చేస్తూ ఉంటారా?"
ఆవిడ నవ్వుతు - ఇలాంటి పొడవు జుట్టు ఉన్న వాళ్ళు ఉండడమే తక్కువ అయిపోయింది అమ్మ ఈ రోజుల్లో. ఒక వేళ ఉన్న కానీ ఎవరమ్మా నీ లాగా ఎంజాయ్ చేస్తూ మరి గుండు చేపించుకునేది.
నేను మనసులో - నా బొంద ఎంజాయ్మెంట్. ఏదో మొక్కు కనుక చేపించుకుంటున్నాను లేకపోతే కత్తెర్లప్పుడు కూడా కొంచెం జుట్టు నే ఇచ్చేదానిని కానీ. అందుకేనేమో ఆ దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు.
నేను ఆవిడ అన్న దానికి సమాధానం చెప్తూ "అవును లెండి అందరు గొర్రె తోకలలానే ఉంచుకుంటున్నారు లెండి ఇప్పుడు. ఎవ్వరికి ఇంత పొడవు పెంచే ఓపికనే ఉండడం లేదు కదా. మీది కూడా అంతే ఉంది కదా. మీకు కూడా పెంచే ఓపిక లేదా? అని అడిగాను.
మంగళావిడ మనసులో ఇది పిచ్చిదో మంచిదో అనుకుంటూ - "లేదు అమ్మ. నాకు ఇక్కడ ఉద్యోగం వస్తే వెంకన్న కి తల నీలాలు ఇస్తాను అని మొక్కుకున్నాను మా ఫామిలీ తో పాటు మొత్తం వచ్చి".
నేను - ఓ అందుకనే మీ జడ ని ఇచ్చేసారు?
మంగళావిడ - "నాది నీ అంత పొడవు జడ నే కాకపోతే నీ దానికంటే లావు మరియు ఒత్తు అయినా జడ లే. నా కూతురుకి ఇంకా పొడవు జుట్టు. కాకపోతే మొక్కుకోసం అని పోయిన సంవత్సరమే నున్నగా గొరిగించేసాము.
నాకెంతో ఇలాంటి పిచ్చి ప్రశ్నలు బాగానే వాస్తు ఉంటాయి ఇలాంటి సమయం లోనే - మీరే మీ పాపా కి గుండు చేసారా అండి అని అడిగాను? సంవత్సరానికి ఇంత జుట్టు వచ్చేసిందా? అలా అయితే హమ్మయ్య నాకు కూడా ఇంత పెరిగేస్తుంది అనమాట వచ్చే సంవత్సరానికి.
ఆవిడ అలా చెప్పే సమయం లో ఒక్క నిమిషం ఆపింది. నేను వెనక్కి తిరిగి చూస్తే మా అమ్మ మరియు చెల్లి నవ్వుతు ఉన్నారు నన్ను అలా చూసి. నేను వెంటనే నా కుడి చేతితో గొరిగిన ప్రదేశం లో పెట్టాను. ఎప్పుడు తల స్నానం చేసేప్పుడు ఎక్కువ గా చేతులు పెట్టె భాగం అదే. ఆ ప్రదేశం మొత్తం నున్నగా ఉంది. ఏదో బాల్ ని రుద్దినట్టు ఉంది. నేను ఒక్క సారిగా షాక్ అయ్యాను. వెంటనే పక్కకి జరిపాను చేతిని. అక్కడ మాత్రం నా చేతులతో ముద్దాడుకునే కురులు తగిలాయి. కానీ అవి కూడా భలే వింతగా ఉన్నాయి అక్కడ. (అంటే అవి గొరిగిన వెంట్రుకలు అనమాట. అక్కడ వేలాడుతున్నాయి).
మంగళావిడ అంతే ఇంక నా తలని వంచి మెల్లగా గొరుగుతూ వెనక్కి వెళ్లి మెడ మీద ఉన్న నూనూగు వెంట్రుకలని తీస్తూ ఉంటె ఏదో తెలియని ఒక వింత అనుభూతి కలిగింది. బహుశా ఇదేనేమో సినిమాల్లో చూపించేది "హీరోయిన్ మెడ మీద హీరో ముద్దు పెట్టగానే కలిగే అనుభూతి కూడా ఇలానే ఉంటాడేమో" అని అనుకున్నాను మనసులో.
అలా గొరుగుతూ మెల్లగా ముందర భాగానికి కూడా వచ్చేసింది ఆ మంగళావిడ. వెనక గొరిగిన భాగం లో మాత్రం భలే చల్ల గాలి తగులుతూ ఉంటె ఎమన్నా ఉందా అసలు. నా తలని అటు ఇటు తిప్పుతూ చాలా నైపుణ్యం తో గొరుగుతుంది ఆవిడ. నేను ఊరకనే ఉండను మళ్ళీ మెల్లగా "మీరు ఇంత ఫాస్ట్ గా అలానే గాట్లు పడకుండా గుండు లు గొరుగుతున్నారు కదా? ఎప్పటి నుండి మీకు ఈ అనుభవం?"
ఆవిడకి ఎందుకో నేను అడిగిన ప్రశ్న కానీ లేక నేను అడిగే విధానం కానీ బాగా నచ్చినట్టు ఉన్నాయి. అందుకేనేమో నవ్వుతు మరియు మెల్లగా గొరుగుతూ "నాకు చిన్నతనం నుండి అసలు మంగలి పని అంటేనే ఇష్టం లేదు అమ్మ. కాకపోతే పెళ్లి అయ్యాక మా అయ్యనకి వచ్చే జీతం తో పిల్లల చదువులు అంటే కష్టం అయ్యింది. అదే సమయం లో తెల్సిన వాళ్ళు ఇక్కడ పోస్ట్ లు పడొచ్చు అని చెప్పారు. అప్పుడే మొదటి సారి ఈ మంగలి కత్తి పట్టింది. మొదటి గుండు మా ఆయనదే గొరిగాను. ఎన్ని గాట్లు పడ్డాయో కూడా లెక్క తెలియనంత లాగా గొరిగాను అనుకో. ఆ తర్వాత మా పక్క ఇంటి పిల్లలకి గొరిగాను".
అయితే చిన్న పిల్లలు మరియు మీ ఆయన గుండు లేనా గొరిగింది ఇక్కడకి ముందర అని అడిగాను.
"లేదమ్మా. మా అత్తయ్యకి గొరిగాను ఇక్కడకి రాబోయే ముందరనే. ఆ తరువాత మా ఆడపడుచు కి కూడా గొరిగాను. కాకపోతే వాళ్ళది మొక్కు ఏమి కాదు. నాకు గొరగడం వచ్చిందో లేదో అని తెల్సుకుందాం అని మా ఆయననే గొరిగించాడు. కాకపోతే వాళ్ళ జుట్టు ని అమ్మి మా ఆడపడుచు చదువులకి వాడాము. అందుకే తానూ కూడా ఏమి అనలేదు గొరిగేప్పుడు".
నాకు ఆ మాట వినగానే తరువాత ఏమి మాటలు రాలేదు. మెల్లగా కళ్ళు మూసుకొని మంగలి కత్తి తో గొరుగుతున్నప్పుడు వచ్చే శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి నా చెవులకి. ఎంతో వినసొంపు గా ఉన్నాయి ఆ శబ్దాలు మాత్రం "శ్రీక్ శ్రీక్ శ్రీక్" మంటూ.
మెల్లగా నా కుదుళ్ళ నుండి వేరు అవుతున్న జుట్టు నా చేమ్పాలని తాకుతూ కింద బంతి లాగా ఉన్న జుట్టు మీద వాలుతుంది. ఏదో నల్లటి రాళ్లు స్వర్గం నుండి దొర్లుకుంటూ భూమి మీదకి వస్తున్నట్టు ఉంది అది అయితే. నాలోని ప్రతి అణువు అనుభవిస్తూ ఉంటే సడన్ గా నా వొళ్ళో ఏదో పడేసరికి ఉలిక్కి పడ్డాను. ఏంటా అని చూస్తే అప్పుడు అర్ధం అయ్యింది "అప్పటి వరకు వేలాడుతున్న బంతి కాస్త నా ఒడిలో సేద తీరుతుంది. నాకు తెలియకుండానే నా చేతులు ఆ బంతిని తడిమాయి. ఎన్ని ఆదివారాలు కాస్త పడితేనో గాని ఈ జుట్టు ఇంత ఒత్తుగా మరియు బారుగా పెరిగింది. ఇప్పుడేమో నిర్జీవం గా పడి ఉంది అని బాధ ఏసింది. కుడి చేతి పక్క కూడా అలానే చేస్తూ మెల్లగా రెండొవ బంతిని కూడా వడిలో పడేలాగా చేసింది ఆవిడ.
వెనుక నుండి చెల్లి వచ్చి ఆ రెండు బంతులని చేతిలోకి తీసుకొని నవ్వుతుంది. అమ్మ ఏమో నా గొరిగిన గుండు మీద చేతులు చూపిస్తూ ఇక్కడ ఇంక వెంట్రుకలు ఉన్నాయి అమ్మ అంటూ మంగళావిడ కి చూపిస్తుంది. అది అంతా చూసుకుంటూ గొరుగుతుంది. అలానే మెడ భాగం లో కూడా చిన్ని చిన్ని వెంట్రుకలు ఉన్నాయి అనుకుంట అమ్మ చూపించక మళ్ళీ గొరిగేసింది. నేను అమ్మ వంక చూసాను. అమ్మ నా నుదురు భాగం దెగ్గర చూసి అక్కడ ఉన్న చిన్ని చిన్ని వెంట్రుకలని సరిగ్గా గీకలేదు అని చెప్పింది. వెంటనే మంగళావిడ మంగలి కత్తిని తీసుకొని మెల్లగా గొరుగుకుంటూ నా కనుబొమ్మల వరకు గొరిగేసింది. నాకు ఒక్క నిమిషం భయం వేసింది "కొంప తీసి కనుబొమ్మలని కూడా గొరిగేస్తుందేమో" అని.
అలా మొత్తం గొరిగేసింది. నేను మెల్లగా చేతులతో మెడ దెగ్గర ఉన్న వెంట్రుకలని దులుపుకుంటూ పైకి లేచాను. నా పొడవాటి రెండు బంతులు అక్కడ కింద నిర్జీవం గా పడి ఉన్నాయి. చెల్లి ఏమో ఆనందం తో నా గుండు ని చూస్తూ రుద్దుతూ ఉంది రెండు చేతులతో. అమ్మ మళ్ళీ మొత్తం చెక్ చేసుకున్నాక బాగానే ఉన్నావే గుండు లో అని అనింది.
ఈ లోపు నాన్న వచ్చి "నా బంగారం గుండు లో కూడా సూపర్ గానే ఉంది గా... సరే పదండి డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. పోదాం అని అనుకుంటూ వెళ్లడం మొదలు పెట్టారు.
నేను నా ఎర్ర స్కార్ఫ్ ని తీసుకొని గుండు చుట్టూరా కట్టుకోడానికి చూసాను కానీ అది గుండు కి అతుక్కుపోతున్నటు అనిపించింది.
అక్కడ నుండి ఆకాశ గంగ దెగ్గరికి వెళ్లేంత వరకు నేను ఎవరితో మాట్లాడలేదు. ఫోన్ లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని నన్ను నేను చూసుకుంటూ అంతక ముందర దిగిన లాంగ్ హెయిర్ పిక్స్ చూసుకుంటూ ఉన్నాను. చెల్లి చాలా ప్రయత్నించింది కానీ నేనేమి మాట్లాడలేదు. ఆ తిరుమల ట్రిప్ లో మొత్తం నేను అంత ఆక్టివ్ గా లేను. అక్కడక్కడా సెల్ఫీ ఫొటోస్ లో మాత్రమే ఉన్నాను. ఒక రెండు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరికి షాక్ నేను గుండు గొరిగించాను అనే సరికి.
ఇష్టం లేకపోయినా కానీ ఇలా ఆనందం నటిస్తున్నట్లు దిగిన గుండు పిక్ ఇదే అంది.