గుండు చేపించుకున్న బాహుబలి సింగర్ దామిని భట్ల

by - December 14, 2017

బాహుబలి లో "పచ్చ బొట్టేసిన" పాట తో అందరి హృదయాలలో పచ్చ బొట్టేసుకున్న మన తెలుగు గాయని దామిని. ఆ పాట తరువాత తెలుగు వారికి బాగా నోట్లో నానిన పేరు.

 "పాడుతా తీయగా" తో మొదలు అయ్యింది తన పాటల ప్రయాణం. భుజాల దాకా వంకీలు తిరిగిన ఉంగరాల జుట్టు తో ఉండే ఈ బామ్మ తనకి నచ్చిన అన్ని హెయిర్ స్టైల్స్ లో ఉండేది. కొద్ది రోజులు గా తాను బోడి తలతో దర్శనం ఇస్తుంది. అందరి అభిమానులకి షాక్ తగిలినట్టు అయ్యింది. ఎప్పుడు వివిధ రకాల స్టైల్స్ తో కనపడే ఆమె సడన్ గా గుండు అవతారం లో కనపడే సరికి ఆవిడ అభిమానులు షాక్ కి గురి అయ్యారు. తను అంతక ముందర కూడా రక రకాల హెయిర్ స్టైల్స్ లో కనపడింది. 2015 లో షార్ట్ బాబ్ లో అబ్బుర పరిచింది. కానీ ఒక్క సారిగా బోడి గుండు లో చూసే సరికి జనాలకి మతిపోయినంత పని అయ్యింది.

అయితే దీనికి కారణాలు తెల్సు కోవాలనే కుతూహలం నాకే కాదు అందరికి ఉంది. అయితే తన గుండు వెనుక కారణం గురుంచి తాను ఈ మధ్యనే వచ్చిన ఫేస్బుక్ లైవ్ లో క్లారిటీ ఇచ్చేసింది. అదేమిటో తన మాటలలోనే చదవండి.






"నేను తిరుమల వెంకన్న కి మొక్కుకున్నాను. నా కోరికలు తీర్చాడు కాబట్టే నేను కల్యాణకట్ట లో నున్నగా గుండు చేపించి నా మొక్కు చెల్లించుకున్నాను. మొక్కు వెనుక కారణం అనేది నేను చెప్పలేను కానీ నా కోరిక తీరినందుకే నేను ఇష్టపడే మొక్కు చెల్లించాను. బహుశా మీకు అనిపించవచ్చు మీరేంటి సెలబ్రిటీస్ కదా మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా అంటే నా వరకు అయితే నేను నమ్ముతాను. మిమ్మల్ని నమ్మమని చెప్పను అలాగ అని నమ్మొద్దు అని చెప్పను. ఎవరి నమ్మకాలు మరియు ఎవరి ఇష్ట ఇష్టాలు వారివి"

అదే లైవ్ లో ఇంకొకరు అడిగిన దానికి కూడా సమాధానం ఇస్తూ "ఒక వేళ నిజం గా ఒక సినిమా లో నాకు మంచి రోల్ వచ్చి దానికోసం గుండు గొరిగించాల్సి వస్తే తప్పకుండా చేస్తాను అంది"

ఏది ఏమైతేనేమి తన కొత్త లుక్ తో కుర్ర కారు గుండెల్లో పచ్చ బొట్టేసుకుంటుంది ఈ బాయ్ కట్ హెయిర్ స్టైల్ లో ఉన్న బామ్మ.


















You May Also Like

0 Comments