• Home
  • About
  • Contact
    • Category
    • Category
    • Category
  • Shop
  • Advertise
facebook twitter instagram pinterest bloglovin Email

Stories Only in Telugu

telugu gundu stories, telugu headshave stories, gundu kathalu, heroine headshave news

నాకు అది అంత చూస్తూ ఉంటే చాలా కొత్తగా అనిపించింది. నేను అక్కడ నుండి వెళుతూ ఉంటే వెనుక వాళ్ళు అందరు ఆ అమ్మాయిని "ఒసేయ్ గుండు" తలుపు తియ్యవే అనే అరుపులు వినపడుతున్నాయి. అక్కడ నుండి బయటకి వచ్చాక మంగలి ఆవిడ దెగ్గరికి వెళ్లే ముందర ఎందుకో మొత్తం ఒక రౌండ్ వేద్దాం అనిపించింది. వెంటనే అలా చూసుకుంటూ తిరుగుతున్నాను. సగం గుండు లో సగం మీసం మరియు గెడ్డం తో ఉన్న మగవాళ్ళు, గావు కేకలు పెట్టుకుంటూ గుండు గొరిగించుకుంటున్న చిన్న పిల్లలు, ఆ పిల్లలకి అయిపోయాక ఆ నున్నటి బుడ్డి గుండోడిని వడిలోనే కూర్చో పెట్టుకొని గుండు చేపించుకుంటున్న పిల్ల తల్లులు అలా ఎందరో ఆ కల్యాణకట్ట లో జుట్టు ని సమర్పించుకుంటున్నారు.

అప్పటి వరకు సరిగ్గా గమనించలేదు కానీ. ఆ గది మధ్యలోనే ఒక పెద్ద హుండీ లు ఒక రెండు ఉన్నాయి. ఈ కాలువ లాంటి దానిలో పడుతూ ఉంది గొరిగిన జుట్టు మొత్తం. దానిని మొత్తం చేట లతో ఎత్తి ఆ హుండీ లో వేస్తున్నారు అక్కడ పని చేసే వాళ్ళు. అలా చూసుకుంటూ తమ్ముడు మరియు అమ్మ వాళ్ళ దెగ్గరికి వెళ్ళాను. ఈ లోపు తమ్ముడు తలా తడుపుకుంటూ ఉన్నాడు. అమ్మనే నీళ్లు పోసి తడుపుతూ ఉంది. వెంటనే అమ్మ చేతిలోని మగ్ ని తీసుకొని నేను పోస్తూ ఉంటే అమ్మ తడుపుతూ ఉంది వాడి జుట్టు. వాడు మంగలి ఆవిడ ముందర కూర్చోవడం, రెండు అంటే రెండే నిమిషాలలో నున్నగా బోడి గుండు గొరిగేయడం అయ్యాయి.

మల్లి నీళ్లు పోసి ఇంకొక సారి గొరుగుతూ ఉంది ఆ మంగలి ఆవిడ. నేనేదో అమ్మ తో మాట్లాడుతూ తమ్ముడి గుండు అయిపోయింది అనే సంగతి కూడా తెలియలేదు. వాడు లేచాడు. అమ్మ మంగళావిడ ముందర కూర్చోబోతుంటే "అమ్మ జుట్టు తడుపుకొని కూర్చోండి". గుండు అంటే జుట్టు తడుపుంటే మంచిగా వస్తుంది. లేకపోతే తెగి గాట్లు పడతాయి అని చెప్పింది. వెంటనే అమ్మ పెద్దగా నవ్వి 'హయ్యో గుండు నాకు కాదు అమ్మ. ఇదిగో ఇక్కడ నుంచుంది కదా దీనికి" అని నా వంక చూపించింది. ఒక్క ఇరవై సెకన్ల పాటు ఆవిడ అంతే చూస్తూ ఉంది పోయింది నా జుట్టు ని. అమ్మ మాటలకి ఈ లోకం లోకి వచ్చిన ఆవిడ నా వంక చూసి నవ్వుతు "అమ్మ ఆ మగ్ తో బాగా తదుకుపొమ్మ. అసలకే చాలా పొడవాటి జుట్టు. కొంచెం టైం పడుతుంది అనుకుంట అది అంత పూర్తి గా తడిచేసరికి.

నేను మెల్లగా నా తలలో పూలు తీస్తూ ఉన్నాను. ఈ లోపు అమ్మకి మూడు కత్తెర్లు తీసేసింది ఆవిడ. జుట్టు లో నుండి అక్కడ అక్కడ మూడు చోట్ల కత్తెరతో కత్తెరించింది. మనసులో "ఇంతేనా మూడు కత్తెర్లు అని అనుకున్నాను". కానీ నేను షాక్ అయ్యే లాగ అమ్మ లేవకుండా ఆవిడతో అలా అనింది. భుజం పైన వరకు మొత్తం కత్తెరించాలి అమ్మ అని అనింది. నేను వెంటనే అమ్మ వంక చూసి "అదేంటి అమ్మ. నీకేమైంది మొత్తం బాబ్ కట్ లాగ చేయించుకుంటున్నావు?"

అమ్మ దానికి "అబ్బో నువ్వైతే తల మీద  వెంట్రుకలే ఉంచుకోడం లేదు లే కానీ నేను మాత్రం బాబ్ కట్ చేయించుకోకూడదా? అని నన్ను అనింది. మల్లి మెల్లగా లేచి నా దెగ్గరికి వచ్చి "నాకెందుకో పొట్టి జుట్టు మైంటైన్ చేద్దాం కొన్ని రోజులు అని ఉంది మనసులో అది కాక ఈ ఎండాకాలం లో కాస్త అయినా ప్రశాంతం గా ఉంటాను కదే అని అనింది. నాకు కూడా నిజమే అనిపించింది. సరే అని చెప్పి నేను పక్క పిన్నులు తీసి నా జీన్స్ పాకెట్ లో పెట్టేసాను.

తమ్ముడు నేను ఇద్దరం అమ్మ కి దెగ్గర వెళ్ళాము. అమ్మ మంగళకి తన వెనుక చూపిస్తూ  కూర్చుంది.  జుట్టు మొత్తం అమ్మ వీపు మీద పరచుకొని ఉంది. అమ్మ ది మంచి జుట్టు కాకపోతే నా అంత పొడవు ఉండదు కానీ మాంచి ఒత్తు అయిన జుట్టు. తనది నడుము కిందకి ఉంటుంది. నేనేమో అమ్మ కి ఎడమ పక్క నుంచొని ఉన్నాను. తమ్ముడు ఏమో కుడి పక్కన నుంచున్నాడు. ఆ మంగలి అమ్మ జుట్టు ని మొత్తం మెడ కొంచెం కిందకి గుప్పిటిలో పట్టుకొని కత్తెర తీసుకొని తన చెయ్యి పైనకి ఒక రబ్బర్ బ్యాండ్ కత్తెరించడం మొదలు పెట్టింది. అర నిమిషం లో అమ్మ కి బాబ్ కట్ లాగ జుట్టు వచ్చేసింది. ఈ లుక్ లో అమ్మ భలే అనిపించింది. అమ్మ లేస్తూ ఉంటె పక్క నుండి జుట్టు ముందుకి పడింది. నేను నా చేతిలో ఉన్న రబ్బర్ బ్యాండ్ తీసుకొని అమ్మ కి పిలక వేసేసాను. అమ్మ కి మొదట కొంచెం కోపం అనిపించింది కానీ వెంటనే ఎం అనకుండా తన పిలకని పట్టుకొని నవ్వుకుంటూ ఉంది.

ఈ లోపు మంగళావిడ మెల్లగా నన్ను పిలిచింది "పాప" అని. వెంటనే అందరం ఆవిడ వంక చూసి అర్ధం అయ్యింది ఆవిడ మాకోసమే ఎదురు చూస్తుంది అని. సరే అని ఇంకా నేను నా వెనుక వేలాడుతున్న జుట్టు ని ముందరకి వేసుకొని తమ్ముడు దెగ్గరికి నుండి మొబైల్ తీసుకొని ఇంస్టాగ్రామ్ లైవ్ ఆన్ చేశాను. ముందర అందరికి హాయ్ చెప్తూ నా జుట్టుని ఎక్కువ చూపించాను. ఒక్క సారి నాకు నేనే నా జుట్టుని చూసుకున్నాను ఆ లైవ్ లోనే. ఇంకా ఆ మొబైల్ తమ్ముడికి ఇచ్చాను. వాడు ఇంకా నన్నే తీస్తూ ఉన్నాడు. అమ్మ ఏమో నా జుట్టు ని చిక్కులు తీద్దాం అని దువ్వెన తీసుకొని దువ్వుతుంది. మంగళావిడ నవ్వుకుంటూ ఇంకొక పది నిమిషాలలో ఆ దువ్వెన అవసరం ఉండదు లేమ్మా ఆ జుట్టు లో పెట్టడానికి. అయిన చిక్కులు ఎం తీయాల్సిన అవసరం లేదమ్మా. నేను ముడులు వేసే చేస్తాను అప్పుడు ఎలాగూ చిక్కు పడుతుంది అని చెప్పింది.

అమ్మ నేను నవ్వుకున్నాం అలా అనేసరికి. సరే అని నుంచోనే తల వెనుకకు వంచి అలా  నుంచున్నాను. అమ్మ మగ్ లో నుండి నీళ్లు తీసుకొని నా నుదురు మీద నుండి మెల్లగా పోస్తూ ఉంది. భలే చల్ల గా అనిపించింది అలా నీళ్లు నా తలలో నుండి వెళుతూ ఉంటె. కొంచెం కొంచమే పోస్తుంది అమ్మ. ఆ నీళ్లు అలా నా జుట్టు లో నుండి పోతు ఉంటె ఏదో జెర్రీ పాకి నట్టు అనిపించింది. ఒంట్లో ఒక్క సారిగా జలదరింపు వచ్చింది. అలా కాదు అని చెప్పి నేను అమ్మ చేతిలో నుండి మగ్ తీసుకొని తలని ఎడమ పక్కకి వంచి జుట్టు లోకి నీళ్ళని కుమ్మరించేసాను. మాములు అమ్మాయిలకి అయితే ఎక్కువ నీళ్లు మొత్తం కిందనే కారేయి ఏమో. కానీ నాకు ఉన్న జుట్టు కి నీరు అసలు ఎక్కువ కింద పడలేదు. అమ్మ మెల్లగా వేళ్ళతో నా తలలో మసాజ్ లాగా చేసింది.

ఈ లోపు మంగళావిడ ముందరకి ఎవరో ఒక పెద్ద వయసు ఉన్నఆవిడ వచ్చి మూడు కత్తెర్లు ఇచ్చింది. జుట్టు మొత్తం తడిసింది అని ఫిక్స్ అయ్యాక చివరి సారి నా పొడవాటి కురులని ఇంస్టా లైవ్ లో చూసే ఫాలోయర్స్ కి మరియు నాకు నేను చూసుకున్నాను. అనుకోకుండా నా చెయ్యి టచ్ అయ్యి బ్యాక్ కెమెరా ఆన్ అయ్యింది. అలా చూస్తూ ఉంటే నా కాళ్ళు మరియు నా తడిచిన పొడవాటి కురులు మాత్రమే కనపడుతున్నాయి. ఒక్కొక్క బొట్టు కింద కారుతూ ఉంది. సరే అని అమ్మ కి ఇచ్చేసి మొబైల్ నేను వెళ్లి అక్కడ నుంచున్నాను.

ఈ లోపు మూడు కత్తెర్ల కోసం కూర్చున్న ఆంటీ పైకి లేచింది. లేస్తూ నా వంక చూసి ఒక్క చిన్నపాటి ఆశ్చర్యం తో కూడిన ఒక చిన్న చిరునవ్వు ఇచ్చి వెళ్ళిపోయింది. నేను మెల్లగా కెమెరా వంక చూసి "బాయ్" అన్నట్టు చెప్పి ఆ మంగలి ముందు ఉన్న ఎత్తు అయిన ప్రదేశం మీద నుంచున్నాను. అలా కాదు అని చెప్పి మల్లి వెనక్కి దిగి మోకాళ్ళ మీద చేతులు కింద పెట్టి అంతే మోకాళ్ళ దండ వేసినట్టు వేసి కూర్చున్నాను. అలా కుర్చుంటుంన్న సమయం లో నా జుట్టు మొత్తం అక్కడ నేల మీద పరచుకొని ఉంది. తెల్లటి మార్బల్ ఫ్లోర్ మీద నల్లటి నా జుట్టు భలే వింతగా అనిపించింది. ఇంకొంచెం ముందరకి వంగే సరికి ఆ కాలువ లాంటి దానిలోకి కూడా వెళ్లి ఫ్లోర్ ని క్లీన్ చేసింది నా జుట్టు.

అప్పటి వరకు చూడలేదు కానీ ఆ కాలువ మొత్తం నల్లగా వెంట్రుకలతో నిండి పోయి ఉంది. అక్కడే కింద పది ఉన్న అమ్మ జుట్టు కి నా జుట్టు టచ్ అయ్యింది. బహుశా జుట్టు కి కూడా ప్రాణం ఉంటే అవి రెండు ముద్దు పెట్టుకున్నాయేమో అని అనిపించే లాగా ఉంది ఆ సీన్. "ఛ... ఒసేయ్ ఏంటే ఈ క్రియేటివిటీ" అని నాకు నేను అనుకోని నవ్వుకున్నాను. నా ముందర మొత్తం నా జుట్టు ఎహ్ వేలాడుతూ ఉండే సరికి నాకు కింద  తప్పితే ముందర ఏముందో అసలు కనిపియ్యడం లేదు. ఎప్పుడు అంతగా గమనించలేదు కానీ నా జుట్టు ఒక నల్లటి గోడ లాగా అడ్డు ఉన్నట్టు అనిపించింది.

ఈ లోపు ఏదో చెయ్యి వచ్చి ఆ తెరను తొలిగిస్తున్నటు మంగళావిడ చేతితో నా జుట్టు ని రెండు భాగాలు గా చేసింది. నేను అప్పుడు తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాను. వెంటనే ఆవిడ "చాలా అంటే చాలా పొడవు ఉన్న జుట్టు అమ్మ నీది. చాలా ఒత్తుగా కూడా ఉంది" అనుకుంటూ నా కుడి వైపు ఉన్న జుట్టు ని మొత్తం తన ఎడమ చేతికి చుట్టుకొని కుడి చేత్తో ముడి లాగా వేసింది. ఆ మూడు కూడా ఒక జడ లాగా వేలాడుతూ ఉంది. ఎడమ వైపు ఉన్న జుట్టు ని కూడా తీసుకొని తన వేళ్ళతో చిక్కులు తీస్తున్నట్టు తీసి తన కుడి చేతికి జుట్టుని చుట్టుకొని ఎడమ చేతితో ముడి వేసింది.

మెల్లగా మంగలి తన చేతికి ఉన్న తడిని తన వొడిలో ఉన్న కండువా తో తుడుచుకుంటూ నేను ఇచ్చిన టోకెన్ ని తీసుకొని చించేసి పక్కన ఉన్న చిన్న మగ్ లో పడేసింది. అక్కడే ఉన్న బ్లేడ్ ముక్క ని తీసుకొని దానికి చుట్టి ఉన్న పేపర్ ని తీసేస్తూ అమ్మ వంక చూసి "ఇంత పొడవు జుట్టు రావడానికి ఏమి చేసారు అమ్మ?" అని తనకి ఉన్న గొర్రె తోక లాంటి జడని ఎడమ చేత్తో తన కుడి వైపుకి వేసుకుంది.

నేను అమ్మ వంక చూసి ఒక చిన్నపాటి చిరునవ్వు ఇచ్చాను. అమ్మ కి అయితే చాలా నచ్చింది ఆవిడ అలా అడుగుతూ ఉంటె. ఏముంది అమ్మ. మంచి కొబ్బరి నూనె వాడతాను. మరియు వారం లో రెండు నుండి మూడు సార్లు మంచిగా ఆయిల్ పెట్టి తల స్నానం చూపిస్తాను. షాంపూ ఏమో ఆయుర్వేదిక్ ధీ వాడుతాము అని తన తల మీద చెయ్యి వేసుకొని గర్వం  తో చెప్పింది. నాకు కూడా మనసులో చాలా గర్వం ఫీల్ అయినా క్షణం అది. ఒక మంగలి దెగ్గర నుండి అది కూడా గుండె గొరిగే సమయం లో ఇలాంటివి వింటే వచ్చే ఆనందమే వేరు అనుకోండి.

నా జుట్టు ముడుల లో నుండి నీటి బిందువులు నా తొడల మీద పడుతూ ఉంటె భలే అనిపించింది. మంగలి తన చేతిలో ఉన్న బ్లేడ్ ముక్కని తన దెగ్గర ఉన్న మంగలి కత్తి లో పెట్టి బయటకు వచ్చిన బ్లేడ్ ని లోపాలకి పోయేలాగా కింద ఒక్క సారి గట్టిగా నొక్కింది. అంతే ఆ బ్లేడ్ సరిసమానం గా అందులో నిలిచింది. తాను మొదలు పెడదాము అని తన ఎడమ చేతితో నా తలని కొంచెం కింద వంచి నా నడి నెత్తి మీద పెట్టి మెల్లగా ముందుకు లాగే బోయేసరికి వెనుక నుండి ఎవరో పెద్దగా "గోవిందా గోవిందా..." అని అరిచారు. నేను కూడా మెల్లగా మనసులో అనుకున్నాను. ఇది అంత నా ఇంస్టా లైవ్ లో వాస్తు ఉండింది. నేనేమో ఇంకా నా చేతులు కాళ్ళ దెగ్గరికి తీసుకొని కళ్ళు మూసుకున్నాను.

మంగళావిడ మెల్లగా అలా ముందుకి లాగింది. అంత మొదటి సారి మంగలి కత్తి నా తల మీద ఆడిన ఆ మధుర క్షణం నేను ఎప్పటికి మరిచిపోలేను. ఒక చల్లటి చిరుగాలి నాకు గొరిగిన ప్రదేశం లో ముద్దాడి అక్కడ నుండి నా చెంపలకి తాకింది. ఎమన్నా నా అసలు. అంతే మెల్లగా ఆవిడ ముందుకి లాక్కుంటూ పోయింది. నా చెవులలో ఆ పర పర మని లాగే శబ్దమే మారుమ్రోగుతుంది. దానితో పాటు నా తల నుండి వేరు అయినా నల్లటి కురులు మొత్తం మెల్లగా కిందకి జారువాలుతూ ఉన్నాయి. అరా నిమిషం లోనే నా తల నడి నెత్తి మీద నుండి ఒక బెత్తెడు వెడల్పు లో నున్నగా అయ్యింది. నా తలని ఇంకా కిందకి వంచి అదే వరుసని వెనుక భాగం లో కూడా గొరిగేసింది. ఎమన్నా చాకిచక్యం గా గోరుకుతుందా తాను. భలే అనుభవజ్ఞురాలి లాగా అనిపించింది.

ఇంకా నా తలని ఎడమ పక్కకి తిప్పి నన్ను కెమెరా కి ఫేస్ చేసే లాగా పెట్టిన నా kudi వైపు జుట్టుని గొరుగుతుంది. నా జుట్టు అంత అలా వేలాడుతూ ఉంటె నాకు బరువు పెరుగుతుంది. ఎప్పుడు మొత్తం కలిసి ఉండే సరికి నా తల మీద ఉండే బరువు అర్ధం కాలేదు కానీ ఇప్పుడు ఒక పక్క ఉన్న జుట్టు బరువే చాలా అనిపిస్తుంది. అలా వెంట్రుకలు మొత్తం తల నుండి వేరు అయ్యి మెల్లగా నా ముడి దెగ్గరికి చేరుతున్నాయి. అలా గీకుతూ చెంప మీదకి తీసుకొని వచ్చి గొరిగింది అది అయితే అసలు చెప్పలేని అనుభవం. భలే చక్కిలి గిలి అనిపించి ఒక్క సారిగా కొంచెం ముడుచుకున్నటు చేశాను. వెంటనే మంగలి అలా కదిలితే గాట్లు పడతాయి అమ్మ.. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పింది.

నేను ఖాళి గా ఉండడం ఎందుకు లే అని నా కుడి చేతితో ఆ జుట్టు ముడితో ఆడుకుంటూ ఉన్నాను.  ఆవిడ ఏమో పర పర మని గీకేస్తూ ఉంది. అలా ఉండగా సడన్ గా నా చేతిలో బరువు పెరిగే సరికి ఉలిక్కి పడ్డాను. ఎంత అని చూస్తే ఆ జుట్టు ముడి మొత్తం వచ్చి నా చేతిలో పడింది. మనసులో "వామ్మో ఎంత ఉందొ నా జుట్టు... ఎంత లావుగా ఉంది ఈ ఒక్క ముందే. కొప్పు పెట్టుకున్నప్పుడు కూడా ఇంత లాగా అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం బాగా అర్ధం అవుతుంది".

నేను దానిని దెగ్గరగా చూస్తూ ఉన్నపుడు సడన్ గా మంగళావిడ నా తలని మరీ ముందుకి వంచింది. నా ప్రమేయం లేకుండానే నా ముడికి నేను ముద్దు ఇచ్చాను మరియు ఆ జుట్టు లో నుండి నేను వాడే ఆయుర్వేదిక్ షాంపూ సువాసన వెదజల్లుతూ ఉంది. (ఇది మన అందరి మధ్యనే ఉంచండి అండోయ్... బహుశా అందుకేనేమో మగాళ్లు ఆడవాళ్ళ జుట్టు నుండి వెలువడే సువాసానికి ముగ్ధులు అవుతారని ఊరికినే చెప్పలేదు...) ఇంకా ఆ ముడిని అంతే రెండు చేతులతో పట్టుకొని ఉన్నాను. నా తలని పైకి లేపి నా నుదురు భాగం దెగ్గర మెల్లగా గొరుగుతూ ఉంది. ఆవిడ అలా గొరుగుతూ నా కనుబొమ్మల వరకు గొరిగింది.

"అయితే నేను ఒక్క సారిగా ఉలిక్కిపడ్డాను. నా కనుబొమ్మల మీద వెంట్రుకలు వేలాడుతూ ఉన్నాయి. కొంప తీసి ఈవిడ నా కనుబొమ్మలని లేపేసిందేమో అనుకోని మనసులో ఏడుపు మొదలు అయ్యింది. దీనికేం పోయేకాలం వచ్చింది అని నాకు గుండు తో పాటు కుడి పక్క కనుబొమ్మ గొరిగేసింది అని".

నేను మనసులో తిట్టుకున్నా తిట్లు వినిపించాయేమో తెలీదు కానీ తన చేతితో ఆ వెంట్రుకలని తుడిచేసింది. అప్పుడు అర్ధం అయ్యింది నాకు ఆవిడ నా కనుబొమ్మలని గొరగలేదు ఆ వెంట్రుకలు ఏవి అయితే ఉన్నాయో అవి నా నుదురు భాగం లో మిగిలిన చిన్న చిన్నవి అని."హమ్మయ్య పోనీ లే బ్రతికించింది అని అనుకున్నాను. ఈ లోపు నా తల లో ఎడమ భాగం లో ఉన్న జుట్టు ని కూడా గొరుగుతూ ఉంది. అయితే ఈ సారి ఏమనుకుందో ఏమో కానీ ఆవిడ నా రెండొవ ముడుని వెనుకకు వేసింది. ఇప్పుడు ఆ ముడి నా వీపు కి ముద్దాడుతోంది. ఇప్పటికే ముప్పావు వంతు గుండు పూర్తి అయ్యింది అని అర్ధం అయ్యింది.

గుండు మొదలు పెట్టిన సమయం లో చల్లటి ప్రదేశం లో గాలి వెళ్తూ ఉంటె భలే అనిపించింది. అదేంటో అలవాటు అయ్యే సరికి ఇప్పుడు అది కాకుండా జుట్టు ఉన్న ప్రదేశం లో వెచ్చగా ఉంది కదా అది బాగా అనిపించింది. బహుశా ఇదేనేమో లేనపుడు దాని విలువ తెలీదు అని. అయినా మనకి వేదాంతాలు సూట్ కావు లే కానీ ఈ అనుభవం మాత్రం ఎప్పటికి మర్చిపోలేను.

అలా అరా నిమిషం లో నా వెనుక బరువుగా వేలాడుతూ ఉన్న ముడి అసలు బరువే లేకుండా పోయింది. అప్పుడు అర్ధం అయ్యింది నా తల మీద ఇన్ని రోజులు ప్రేమతో పెంచుకున్న నా జుట్టు మొత్తం మంగలి కత్తి కి బలి అయ్యింది అని. కానీ చివర్లో మాత్రం ఒక చిన్న అనుభూతి కూడా నేను మర్చిపోలేను. నా తల నుండి వేరు అయినా రెండొవ ముడి మెల్లగా (ఊహలో స్లో మోషన్ లో ఊహించుకోండి) వీపుని ముద్దాడుతూ "డబ్" మని శబ్దం చేసుకుంటూ పడింది. ఎన్నో సంవత్సరాలు నా వీపుతో సావాసం చేసిన ఆ సౌందర్యం చివరి కన్నీటి వీడ్కోలు పలికేసింది (ఇక్కడ కన్నీరు అంటే జుట్టు నుండి కారుతున్న నీరు అని నా అర్ధం). ఎంతో ప్రేమతో చూసుకున్న నా జుట్టు ఒక ముడి నా చేతులలో మరొక ముడి నా వెనుక అనుకునే లోపలనే తమ్ముడు వచ్చి నా గుండు మీద పెట్టాడు ఆ ముడిని.

అక్కడ అందరు అది చుడి నవ్వడం మొదలు పెట్టారు. మా అమ్మ, తమ్ముడు మరియు మంగళావిడ. ఆ తడి ముడి నా తల మీద పెట్టె సరికి నరాలు అన్ని జివ్వుమన్నాయి. ఏదో కరెంటు షాక్ కొట్టినంత పని అయ్యింది. అలా అయ్యే సరికి మెల్లగా తల అటు ఇటు ఆడించాను. అంతే ఆ ముడి కూడా మెల్లగా నా ఒడిలో వచ్చి వాలింది. మొత్తం నున్నగా గొరిగేసింది ఆ మంగలి ఆవిడ. మొత్తం గొరిగేసాక "అయ్యింది అమ్మ ఇంక లేవోచ్చు" అని చెప్పింది. నేను రెండు ముడులని చేతులతో పట్టుకొని మొబైల్ వంక చూపించి ఆ ముడులని అక్కడే ఉన్న కాలువలో పడేసాను. లేస్తూనే మొదట చేసిన పని ఏంటి అంటే "నా రెండు చేతులు నా గుండు మీదకే వెళ్లాయి". అమ్మ ఇంక ఇంస్టా లైవ్ ని ఆపేసింది. అమ్మ కూడా నా తల ని ఒక సరి మొత్తం తడిమి నున్నగా వచ్చిందో లేదో అని చూసింది. నేను ఒక్క సారి బాత్రూం కి వెళ్లి నీటితో మెడ మీద ఉన్న వెంట్రుకలని కడిగేద్దాం అని వెళ్ళాను. అమ్మ మరియు తమ్ముడు అక్కడే ఉండిపోయారు. నేను బాత్రూం లోపలకి వెళుతూ ఉంటె నాకు ఒక ఇరవై ఏడూ సంవత్సరాల అమ్మాయి ఎదురు అయ్యింది. నన్ను గుండు లో చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది. నేను కూడా తన చిరునవ్వుకు నా చిరునవ్వుతో సమాధానం చెప్తూ అంతే లోపలకి వెళ్ళాను. ఈ లోపు వెనుక నుండి "దిషా" అని ఎవరో పిలిచినట్టు ఉంటె వెనక్కి చూసాను.

ఇప్పుడు నాకు ఎదురు అయినా అమ్మాయే నన్ను పేరు పెట్టి పిలిచింది. నేను షాక్ అయ్యాను ఎవరబ్బా ఈమె అని.  "తన పేరు ప్రజ్ఞ. నా ఇంస్టాగ్రామ్ లో నా ఫాలోవెర్ అంట".

"మీరేంటి దిషా జుట్టు సుందరి లాగా ఉండే మీరు ఇలా బోడి గుండు భామ లాగా తయారు అయ్యారు అని అడిగింది".

అలా తనకి నా కథ చెప్పుకుంటూ నేను కళ్యణకట్ట నుండి బయటకి ఎలా వచ్చానో అలానే ఇప్పుడు ఈ కథ లో నుండి కూడా బయట వచ్చేసాను.

ఇట్లు...
మీ ప్రజ్ఞ.

Inspired from this video

Share
Tweet
Pin
Share
No Comments
హలో ఫ్రెండ్స్, ఈ జుట్టు ప్రపంచం లో మన భారతీయులకి బాగా తెలిసిన పొడవాటి కురులు ఉన్న అమ్మాయిలలో నేను ఒక్క దానినే. నా పేరు దిష. కేశ సుందరి అని కూడా పిలుస్తూ ఉంటారు. నేను ఇన్స్టా లో చాలా యాక్టీవ్ గా ఉంటాను. చాలా మందికి నా జుట్టు తోనే సుపరిచితురాలిని నేను. చిన్నప్పటి నుండి అమ్మ నే నాకు జడలు వేస్తూ ఉండేది. నా జుట్టు అంటే నాకంటే అమ్మకే చాలా చాలా ఇష్టం. వారానికి మూడు సార్లు కేరళ నుండి తెప్పించిన కొబ్బరి నూనె తో నాకు మర్దన చేస్తూ నా కురులని చాలా జాగ్రత్త గా కాపాడుతూ ఉంటుంది. కాలేజీ లో కూడా నా జుట్టు కి ఫాన్స్ ఎక్కువే అండోయ్... అబ్బాయిలు అందరూ నా జుట్టు ని చూసి నాతో మాట్లాడడానికి తెగ కుతూహలం చూపిస్తూ ఉండే వారు. నా జుట్టు తో నాకు ఉన్న జ్ఞాపకాలు మరియు అనుభవాలు అన్ని ఇన్ని కాదు అనుకోండి. నా జుట్టుని కొప్పుగా పెట్టుకొని ఉన్న రోజులు నుండి లూస్ గా వదిలేసి "బన్ డ్రాప్" వీడియోలు మరియు స్లో మోషన్ వీడియో లు ఎన్నో ఉన్నాయి అనుకోండి. ఇంస్టాగ్రామ్ లో ఎంతో మంది నా జుట్టు గురుంచి నాకు మెసేజ్ లు పెట్టి నా జుట్టు ని పొగుడుతూ ఉండే వారు. నేను ఇంస్టా లైవ్ లోకి వస్తే నా జుట్టు గురించే మాటలు అన్ని...అన్నిటికంటే నాకు బాగా నచ్చింది అంటే "చీర కట్టుకొని లూస్ గా వదిలేసిన జుట్టు తో తల లో మల్లెపూలు పెట్టుకోవడం". నాకు నేను చాలా అందము గాను మరియు అద్భుతం గాను అనిపించే గెట్ అప్ అదే నాకు. ఇది ఇలా ఉండగా ఒక రోజు అమ్మ నాతో ఇలా తిరుమల ప్రయాణం గురుంచి చెప్పింది. నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది వినగానే. చిన్నప్పటి నుండి తిరుమల తిరుపతి గురుంచి చాలా విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. మొదటి సారి తిరుమల ప్రయాణం మరియు అక్కడ నేను ఎక్కువ గా విన్న వాటిలో "ఆడవాళ్ళ గుండు గురుంచే ఇంకా ఎక్కువ విన్నాను". నేను స్కూల్ లో ఉన్నపుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడికి వెళ్లి నున్నటి బోడి గుండు లో వచ్చింది. జీవితం లో మొదటి సారి బోడి గుండు ని చూడడం అదే మరియు దాని బోడి గుండు మీద అలా చేతితో రుద్దితే కొంచెం గరుకుగా తగిలిన క్షణం నా వెన్నులో ఒక తెలియని వణుకు పుట్టింది. అది ఎక్కువ రోజులు గుర్తు లేదు లే కానీ అమ్మ తిరుమల అని చెప్పిన వెంటనే ఆ వణుకు మల్లి పుట్టింది. చూస్తూ ఉండగానే మేము తిరుమల ప్రయాణం చేసే రోజు దెగ్గరికి వచ్చింది. నేను అమ్మ మరియు తమ్ముడు ముగ్గురం కలిసి తిరుమల ప్రయాణం మొదలు పెట్టాం. తిరుమల చేరుకున్నాక రైల్వే స్టేషన్ లో దిగగానే ఎదురుగా ఒక కాలేజీ కి వెళ్లే వయసు ఉన్న అమ్మాయి జీన్స్ మరియు టీ షర్ట్ లో ఉంది. తల కి స్కార్ఫ్ కట్టుకొని నుంచొని ఉంది. నాకు అర్ధం కాలేదు అదేంటి అలా స్కార్ఫ్ ఎందుకు కట్టుకుందా అని. ఒక రెండు నిమిషాలు అంతే గమినిస్తూ ఉన్నాను. ఈ లోపు నన్ను మరియు తమ్ముడిని అక్కడే ఉండమని చెప్పి అమ్మ టాయిలెట్ కి వెళ్ళింది. నన్ను కూడా అడిగింది కానీ నేను వెళ్ళలేదు. నేను ఆ అమ్మాయి వంక అంతే చూస్తున్నాను స్కార్ఫ్ లో ఎందుకు ఉందా అని ఆలోచిస్తూ. ఈ లోపు ఆ అమ్మాయి వెనుక నుండి ఒక గుండు లో ఉన్న అతను వచ్చి ఆ అమ్మాయి స్కార్ఫ్ ని లాగేసుకున్నాడు. అంత తెల్లగా మిల మిల లాడే గుండు కనపడింది. కానీ ఆ అమ్మాయి మొహం మాత్రం చాలా అందము గా ఉంది గుండు లో కూడా. చక్కటి చంద్ర బింబం లాంటి మొహం ఆ గుండు అమ్మాయిది. ఈ లోపు అమ్మ రావడం మేము అక్కడ నుండి వెళ్లడం జరిగాయి. అక్కడ నుండి కొండ పైకి బస్సు లో వెళ్ళాము. కాసేపు రెస్ట్ తీసుకొని బయటకి తినడానికి అని వెళ్ళాము. వెళ్లే దారిలో చాలా మంది ఆడవాళ్ళని గుండు లో చూసి ఆశ్చర్య పోయాను. నేను ఉండే ప్లేస్ లో అయితే అసలు ఆడవాళ్లు గుండు లోనే పెద్దగా కనపడరు అలాంటిది ఇక్కడేమో చాలా మంది కనపడుతూ ఉన్నారు. ఒక్క వయసు వారు అని ఎం లేదు. అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు గుండు లలో. తినేసి వెనుకకు బయలుదేరేప్పుడు అమ్మ అనింది "వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకున్నాక మనం అందరం కళ్యాణకట్ట కి వెళ్లి తమ్ముడికి వెంట్రులకు తీయించి మనం కత్తెర్లు ఇచ్చేసి వద్దాం అని". నాకు ముందు కళ్యాణకట్ట అంటే అర్ధం కాలేదు కానీ అక్కడ ఉన్న బోర్డు ల మీద చూసాక అర్ధం అయ్యింది "గుండు లు గొరిగే ప్రదేశం" పేరు అదే అని. నేను ఆనందం తో సరే అన్నాను. రూమ్ లోకి వెళ్ళాము. అమ్మ మరియు తమ్ముడు కాసేపు నిద్ర వేస్తున్నారు. నాకేమో నిద్రపట్టడం లేదు. సరే అని ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫీడ్ లో అలా వెళ్తూ ఉంటె సడన్ గా "బాల్డ్ బ్యూటీ వరల్డ్" అని ఒక అకౌంట్ తారస పడింది. ఇదేంటి అబ్బా "బాల్డ్" అని ఉంది అని ఓపెన్ చేసి చూస్తే అందరు అమ్మాయిలే పైగా అందరు గుండు ల లోనే ఉన్నారు. నేను ఒక్క సారిగా షాక్ అయ్యాను. ఎంతో మంది ఉన్నారు. అందులో కొందరు మంగలి షాప్ లో గుండు గోరింగించి ఉంటె మరి కొందరు బ్యూటీ పార్లర్ లో గొరిగించుకున్నారు మరి కొందరేమో తిరుమల లో మొక్కు గా సమర్పించారు, ఇంకొందరు హెయిర్ ని డొనేట్ చేసారు, ఇంకొందరేమో గుండు లో వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారు చూసుకుందాం అని చేసారు. నాకు అన్నిటికి కంటే చివరి ఆలోచన కొత్తగా అనిపించింది. "అరె అవును కదా!!! మనం కూడా గుండు లో ఎలా ఉంటామో ఒక్క సారి చూసుకుంటే ఎలా ఉంటది అని" వెంటనే ఒక ఆలోచన వచ్చింది. లేచి బాత్రూం లోకి వెళ్లి టవల్ తీసుకొని తల చుట్టూరా చుట్టుకొని చూసుకున్నాను జుట్టు లేకుండా ఎలా ఉంటానా అని. కానీ నా అదృష్టం నాకు అర్ధం కాలేదు. ఈ లోపు మా అమ్మ లేచేసింది. నా దెగ్గరికి వచ్చింది. నేను అలా టవల్ చుట్టుకోవడం చూసి అడిగింది "ఏంటే అప్పుడే తల స్నానం చేసావా? మరి బట్టలు మార్చుకోలేదేంటి" అని అడిగింది. "హయ్యో అమ్మ. నేనేం తల స్నానం చేయలేదు. ఊరికినే అలా చుట్టుకున్నాను. అంతే" "ఓహ్ అవునా. సరే లే అలా అయితే" అని వెళ్ళబోతూ ఉంటె నేను పిలిచాను. "అమ్మ మరి మరి మరి!!!" "మరి లేదు ఎం లేదు. ఏంటో సరిగ్గా నాన్చకుండా చెప్పవే" "ఎం లేదు అమ్మ. నాకు నన్ను నున్నటి బోడి గుండు లో చూసుకోవాలని ఉందే? నువ్వు ఏమంటావు?" "అదేం కోరికని నీకు" "ఏమో అమ్మ. ఎప్పుడు అనిపించలేదు అలా. ఎందుకో మొదటి సారి అనిపించింది. ఇన్ని రోజులు "కేశ సుందరి" లాగానే ఉన్నాను కదా. కొన్ని రోజులు "గుండు సుందరి" లాగ కూడా నన్ను నేను చూసుకోవాలని ఉంది మా. ప్లీజ్ మమ్మీ. ఈ ఒక్క సారికి ఒప్పుకో" నా మాటకి ఎప్పుడు అమ్మ ఎదురు చెప్పాడు. "సరే నే నీ ఇష్టం మరి. సరే మరి అలా అయితే వెళ్దామా కల్యాణ కట్ట ని. తమ్ముడిని లేపు పో వెళ్లి. నేను ఈ లోపు పేస్ వాష్ చేసుకొని వస్తాను" అని చెప్పి అమ్మ బాత్రూం లోకి వెళ్ళింది. నేనేమో వెళ్లి తమ్ముడిని నిద్ర లేపాను. అమ్మ వచ్చాక నా జుట్టు ని చివరి సారిగా దువ్వెన తో చిక్కీలు తీసి మంచిగా దువ్వింది. నాకు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంది లోపల అంత. ఎలా ఉంటానో గుండు లో మరియు గుండు ఎలా చేస్తారా అని. ఒక మూర మల్లె పూలు తీసుకొని అమ్మ నా తల లో పెట్టి "అంటుంది. చివరి సారి చూసుకోవే నీ నల్లటి కురులలలో ఇలా మల్లె పూలని. ఇంకొక రెండు సంవత్సరాల వరకు నీకు ఆ అవకాశం రాదూ మరి. చూసుకో అని చెప్పింది. అలా మల్లె పూలతో చివరి సారిగా ఒక పిక్ దిగి నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాను.

నేను, తమ్ముడు అమ్మ ముగ్గురం కలిసి కల్యాణకట్ట కి బయలుదేరాము. నాకు ఏదో తెలియని ఒక చిన్న భయం తో కూడిన ఎక్సైట్ మెంట్ మొదలు అయ్యింది. కానీ ఎందుకో ఈ గుండు ని నా ఇంస్టాగ్రామ్ లో ఫాలోయర్స్ అందరికి తెలియాలి అని అనిపించింది. వెంటనే ఇంస్టాగ్రామ్ లైవ్ ఓపెన్ చేసి సిద్ధం గా ఉన్నాను. అంతగా రద్దీ లేకపోయే సరికి మేము మాధవ నిలయం లోని కల్యాణకట్ట కి వెళ్ళాము. అక్కడ ఒక చిన్న క్యూ లో ముగ్గురము నుంచున్నాము.ముందర నేను నా వెనుక తమ్ముడు చివరిలో అమ్మ ఉంది.

తమ్ముడు ఏమో లూస్ గా ఉన్న నా జుట్టుని పట్టుకొని లాగుతూ మరియు వేలితో మెలి తిప్పుతూ ఉన్నాడు. వాడు విన్నాడు నేను అమ్మ మాట్లాడుకుంది నా గుండు గురుంచి. వాడు నా వంక చూసి "అక్క గుండు ఎలా చేస్తారు అక్క?"
వాడు అడిగిన ప్రశ్న కి నిజంగానే నా దెగ్గర సమాధానం లేదు. నేను ఎప్పుడు చూడలేదు కనుక నాకు దాని గురుంచి పెద్ద ఐడియా లేదు. నేను ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ తో "నాకు తెలీదు రా అన్నాను". అమ్మ ఏదో చెపుదాం అనుకునే లోపు మేము ఒక చిన్న గేట్ దెగ్గరికి వచ్చాము. అక్కడ చిన్న కౌంటర్ లాగా ఉండి ఒకతను ఏవో ఇస్తున్నాడు నా ముందర ఉన్న వాళ్ళకి. నేను వాడి ముందర అంత నుంచున్నాను. ఏమి మాట్లాడకుండా. "గుండా లేక కత్తెరలా" అని అడిగాడు. నేను మెల్లగా సిగ్గు పడుతూ తల దించుకొని "గుండు రెండు టోకెన్ లు ఇవ్వండి" అని చెప్పాను. రెండు టోకెన్లు మరియు రెండు సగం తుంచి బ్లేడ్ ముక్కలని నా చేతిలో పెట్టాడు. నేను అవి చేతిలోకి తీసుకొని మెల్లగా ముందరకి బయలుదేరాను. అప్పుడు పక్కన నుండి నాకు ఆ టోకెన్ లు ఇచ్చే వాళ్ళ మాటలు వినపడ్డాయి. "అన్న ఏంది అన్న అంత పొడవు ఉంది జుట్టు. ఆమె ఇప్పుడు నున్నగా గుండు గొరిగించుకోబోతుందా?"

ను మెల్లగా సిగ్గుపడుతూ వెనకకు తిరిగి వాళ్ళకి ఒక చిన్న చిరునవ్వుతో సమాధానం ఇచ్చాను. నేను నా చేతులో ఉన్న టోకెన్ ల మీద ఉన్న నెంబర్ ని చూసాను. మెల్లగా నడుచుకుంటూ లోపలకి వెళ్ళాం . పెద్ద హాల్. మొత్తం తెల్లటి మార్బల్ తో ఫ్లోరింగ్ మరియు గోడలు కూడా ఉన్నాయి. గోడకి అనుకోని చుట్టూరా ఎత్తు గా కట్టి ఉంది. దాని ముందరనే ఒక చిన్న కాలువ లాగా ఉంది. దానికి ముందు కొంచెం ఎత్తు తక్కువ గా ఉండి ఉంది. అడుగు అడుగు దూరం లో మంగలి వాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళ తల మీద ఒక బోర్డు నెంబర్ రాసి ఉంది. అప్పుడు అర్ధం అయ్యింది నాకు. ఆ టోకెన్ మీద ఉంది మంగలోడి నెంబర్. భలే అనిపించింది. వెంటనే నాకు తెలియకుండానే నా కళ్ళు మంగలోడి కోసం అని వెతికాయి. కాకపోతే నాకు అక్కడ కనిపించ లేదు. మెల్లగా వెతుక్కుంటూ అంతే ముందరకి వెళ్ళాం. నాలుగు పక్కల ఉన్న మంగలోళ్ళలో ఒక పక్క గోడ కి మొత్తం ఆడ మంగలి వాళ్ళకే వదిలేసారు. నేను ఆలా ఆడ మంగలోళ్ళని చూసి షాక్ అయ్యాను. అరేయ్ భలే ఉందే ఇక్కడ వీళ్ళు ఉండడం అనుకోని చూస్తే మాకు ఇచ్చిన మంగలి ఆవిడ నెంబర్ కనిపించింది. వెంటనే ఆవిడ దెగ్గరికి వెళ్ళాం. అమ్మ మరియు తమ్ముడు నేను చేసే పిచ్చి చేష్టలు చూసి నవ్వుతున్నారు. ఆ మంగలి ఆవిడ దెగ్గరికి వెళ్లి నిలబడ్డాను. కాకపోతే ఆవిడ ముందర ఒక చిన్న పాప కూర్చొని మెదలకుండా గుండు గొరిగించుకుంటుంది. నేను అమ్మ కి చెప్పి వాష్రూమ్ కి వెళదాం అని అక్కడ బోర్డు కనిపిస్తే వెళ్ళాను. లోపల చూస్తే అక్కడ అందరు ఆడవాళ్లు కొంత మంది లూస్ జుట్టుతో స్నానాలు చేస్తూ ఉన్నారు. కొంత మంది పెద్ద వయసు ఉన్న ఆంటీ లు ఏమో నున్నటి బోడి గుండు లో టాప్ కింద తల పెట్టి మెడ ఉన్న వెంట్రుకలని రుద్దు కుంటూ ఉన్నారు. సరే అని నేను పక్కనే ఉన్న స్నానం గదిలోకి వెళ్లి పని కానిచ్చి డోర్ తీసి చూస్తే ఎదురుగా నా వయసు ఉన్న ఒక అమ్మాయి నుంచొని ఉంది. తెల్లటి మేని ఛాయ ఉన్న అమ్మాయి అప్పుడే గొరిగిన నున్నటి బోడి గుండు లో మెరిసిపోతుంది. తనని చూసి నేను షాక్ అయ్యాను. కానీ చాలా అందము గా ఉంది. పక్కన నుండి వాళ్ళ ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు ఈ లోపు ఆ అమ్మాయి సిగ్గుతో లోపలకి వెళ్లి గడి పెట్టేసుకుంది.

మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లు అయితే దయ చేసి షేర్ చేయండి మరియు కామెంట్స్ లో తెలుపండి. తరువాతి భాగం కోసం వెయిట్ చేయండి.

Share
Tweet
Pin
Share
1 Comments
Newer Posts
Older Posts

Follow Us

  • facebook
  • twitter
  • instagram
  • Google+
  • pinterest
  • youtube

recent posts

Blog Archive

  • January 2025 (1)
  • March 2024 (1)
  • July 2023 (2)
  • May 2023 (3)
  • December 2022 (2)
  • November 2022 (2)
  • October 2020 (1)
  • September 2020 (4)
  • August 2020 (2)
  • July 2020 (2)
  • June 2020 (1)
  • May 2020 (4)
  • April 2020 (2)
  • January 2020 (1)
  • December 2019 (6)
  • November 2019 (1)
  • October 2019 (1)
  • August 2019 (1)
  • April 2019 (2)
  • March 2019 (6)
  • October 2018 (5)
  • September 2018 (6)
  • August 2018 (1)
  • July 2018 (3)
  • December 2017 (17)

Created with by ThemeXpose | Distributed by Blogger Templates