haircut storiesheadshave storiesheadshave stories 2019rapunzel disha headshave storytelugu gundu kathalutelugu headshave stories
జుట్టు సుందరి నుండి బోడి గుండు భామ - పార్ట్ 1
హలో ఫ్రెండ్స్,
ఈ జుట్టు ప్రపంచం లో మన భారతీయులకి బాగా తెలిసిన పొడవాటి కురులు ఉన్న అమ్మాయిలలో నేను ఒక్క దానినే. నా పేరు దిష. కేశ సుందరి అని కూడా పిలుస్తూ ఉంటారు. నేను ఇన్స్టా లో చాలా యాక్టీవ్ గా ఉంటాను. చాలా మందికి నా జుట్టు తోనే సుపరిచితురాలిని నేను. చిన్నప్పటి నుండి అమ్మ నే నాకు జడలు వేస్తూ ఉండేది. నా జుట్టు అంటే నాకంటే అమ్మకే చాలా చాలా ఇష్టం. వారానికి మూడు సార్లు కేరళ నుండి తెప్పించిన కొబ్బరి నూనె తో నాకు మర్దన చేస్తూ నా కురులని చాలా జాగ్రత్త గా కాపాడుతూ ఉంటుంది. కాలేజీ లో కూడా నా జుట్టు కి ఫాన్స్ ఎక్కువే అండోయ్... అబ్బాయిలు అందరూ నా జుట్టు ని చూసి నాతో మాట్లాడడానికి తెగ కుతూహలం చూపిస్తూ ఉండే వారు.
నా జుట్టు తో నాకు ఉన్న జ్ఞాపకాలు మరియు అనుభవాలు అన్ని ఇన్ని కాదు అనుకోండి. నా జుట్టుని కొప్పుగా పెట్టుకొని ఉన్న రోజులు నుండి లూస్ గా వదిలేసి "బన్ డ్రాప్" వీడియోలు మరియు స్లో మోషన్ వీడియో లు ఎన్నో ఉన్నాయి అనుకోండి. ఇంస్టాగ్రామ్ లో ఎంతో మంది నా జుట్టు గురుంచి నాకు మెసేజ్ లు పెట్టి నా జుట్టు ని పొగుడుతూ ఉండే వారు. నేను ఇంస్టా లైవ్ లోకి వస్తే నా జుట్టు గురించే మాటలు అన్ని...అన్నిటికంటే నాకు బాగా నచ్చింది అంటే "చీర కట్టుకొని లూస్ గా వదిలేసిన జుట్టు తో తల లో మల్లెపూలు పెట్టుకోవడం". నాకు నేను చాలా అందము గాను మరియు అద్భుతం గాను అనిపించే గెట్ అప్ అదే నాకు.
ఇది ఇలా ఉండగా ఒక రోజు అమ్మ నాతో ఇలా తిరుమల ప్రయాణం గురుంచి చెప్పింది. నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది వినగానే. చిన్నప్పటి నుండి తిరుమల తిరుపతి గురుంచి చాలా విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. మొదటి సారి తిరుమల ప్రయాణం మరియు అక్కడ నేను ఎక్కువ గా విన్న వాటిలో "ఆడవాళ్ళ గుండు గురుంచే ఇంకా ఎక్కువ విన్నాను". నేను స్కూల్ లో ఉన్నపుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడికి వెళ్లి నున్నటి బోడి గుండు లో వచ్చింది. జీవితం లో మొదటి సారి బోడి గుండు ని చూడడం అదే మరియు దాని బోడి గుండు మీద అలా చేతితో రుద్దితే కొంచెం గరుకుగా తగిలిన క్షణం నా వెన్నులో ఒక తెలియని వణుకు పుట్టింది. అది ఎక్కువ రోజులు గుర్తు లేదు లే కానీ అమ్మ తిరుమల అని చెప్పిన వెంటనే ఆ వణుకు మల్లి పుట్టింది.
చూస్తూ ఉండగానే మేము తిరుమల ప్రయాణం చేసే రోజు దెగ్గరికి వచ్చింది. నేను అమ్మ మరియు తమ్ముడు ముగ్గురం కలిసి తిరుమల ప్రయాణం మొదలు పెట్టాం. తిరుమల చేరుకున్నాక రైల్వే స్టేషన్ లో దిగగానే ఎదురుగా ఒక కాలేజీ కి వెళ్లే వయసు ఉన్న అమ్మాయి జీన్స్ మరియు టీ షర్ట్ లో ఉంది. తల కి స్కార్ఫ్ కట్టుకొని నుంచొని ఉంది. నాకు అర్ధం కాలేదు అదేంటి అలా స్కార్ఫ్ ఎందుకు కట్టుకుందా అని. ఒక రెండు నిమిషాలు అంతే గమినిస్తూ ఉన్నాను. ఈ లోపు నన్ను మరియు తమ్ముడిని అక్కడే ఉండమని చెప్పి అమ్మ టాయిలెట్ కి వెళ్ళింది. నన్ను కూడా అడిగింది కానీ నేను వెళ్ళలేదు. నేను ఆ అమ్మాయి వంక అంతే చూస్తున్నాను స్కార్ఫ్ లో ఎందుకు ఉందా అని ఆలోచిస్తూ. ఈ లోపు ఆ అమ్మాయి వెనుక నుండి ఒక గుండు లో ఉన్న అతను వచ్చి ఆ అమ్మాయి స్కార్ఫ్ ని లాగేసుకున్నాడు. అంత తెల్లగా మిల మిల లాడే గుండు కనపడింది. కానీ ఆ అమ్మాయి మొహం మాత్రం చాలా అందము గా ఉంది గుండు లో కూడా. చక్కటి చంద్ర బింబం లాంటి మొహం ఆ గుండు అమ్మాయిది.
ఈ లోపు అమ్మ రావడం మేము అక్కడ నుండి వెళ్లడం జరిగాయి. అక్కడ నుండి కొండ పైకి బస్సు లో వెళ్ళాము. కాసేపు రెస్ట్ తీసుకొని బయటకి తినడానికి అని వెళ్ళాము. వెళ్లే దారిలో చాలా మంది ఆడవాళ్ళని గుండు లో చూసి ఆశ్చర్య పోయాను. నేను ఉండే ప్లేస్ లో అయితే అసలు ఆడవాళ్లు గుండు లోనే పెద్దగా కనపడరు అలాంటిది ఇక్కడేమో చాలా మంది కనపడుతూ ఉన్నారు. ఒక్క వయసు వారు అని ఎం లేదు. అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు గుండు లలో. తినేసి వెనుకకు బయలుదేరేప్పుడు అమ్మ అనింది "వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకున్నాక మనం అందరం కళ్యాణకట్ట కి వెళ్లి తమ్ముడికి వెంట్రులకు తీయించి మనం కత్తెర్లు ఇచ్చేసి వద్దాం అని". నాకు ముందు కళ్యాణకట్ట అంటే అర్ధం కాలేదు కానీ అక్కడ ఉన్న బోర్డు ల మీద చూసాక అర్ధం అయ్యింది "గుండు లు గొరిగే ప్రదేశం" పేరు అదే అని.
నేను ఆనందం తో సరే అన్నాను. రూమ్ లోకి వెళ్ళాము. అమ్మ మరియు తమ్ముడు కాసేపు నిద్ర వేస్తున్నారు. నాకేమో నిద్రపట్టడం లేదు. సరే అని ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫీడ్ లో అలా వెళ్తూ ఉంటె సడన్ గా "బాల్డ్ బ్యూటీ వరల్డ్" అని ఒక అకౌంట్ తారస పడింది. ఇదేంటి అబ్బా "బాల్డ్" అని ఉంది అని ఓపెన్ చేసి చూస్తే అందరు అమ్మాయిలే పైగా అందరు గుండు ల లోనే ఉన్నారు. నేను ఒక్క సారిగా షాక్ అయ్యాను. ఎంతో మంది ఉన్నారు. అందులో కొందరు మంగలి షాప్ లో గుండు గోరింగించి ఉంటె మరి కొందరు బ్యూటీ పార్లర్ లో గొరిగించుకున్నారు మరి కొందరేమో తిరుమల లో మొక్కు గా సమర్పించారు, ఇంకొందరు హెయిర్ ని డొనేట్ చేసారు, ఇంకొందరేమో గుండు లో వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారు చూసుకుందాం అని చేసారు. నాకు అన్నిటికి కంటే చివరి ఆలోచన కొత్తగా అనిపించింది. "అరె అవును కదా!!! మనం కూడా గుండు లో ఎలా ఉంటామో ఒక్క సారి చూసుకుంటే ఎలా ఉంటది అని"
వెంటనే ఒక ఆలోచన వచ్చింది. లేచి బాత్రూం లోకి వెళ్లి టవల్ తీసుకొని తల చుట్టూరా చుట్టుకొని చూసుకున్నాను జుట్టు లేకుండా ఎలా ఉంటానా అని. కానీ నా అదృష్టం నాకు అర్ధం కాలేదు. ఈ లోపు మా అమ్మ లేచేసింది. నా దెగ్గరికి వచ్చింది. నేను అలా టవల్ చుట్టుకోవడం చూసి అడిగింది "ఏంటే అప్పుడే తల స్నానం చేసావా? మరి బట్టలు మార్చుకోలేదేంటి" అని అడిగింది.
"హయ్యో అమ్మ. నేనేం తల స్నానం చేయలేదు. ఊరికినే అలా చుట్టుకున్నాను. అంతే"
"ఓహ్ అవునా. సరే లే అలా అయితే" అని వెళ్ళబోతూ ఉంటె నేను పిలిచాను. "అమ్మ మరి మరి మరి!!!"
"మరి లేదు ఎం లేదు. ఏంటో సరిగ్గా నాన్చకుండా చెప్పవే"
"ఎం లేదు అమ్మ. నాకు నన్ను నున్నటి బోడి గుండు లో చూసుకోవాలని ఉందే? నువ్వు ఏమంటావు?"
"అదేం కోరికని నీకు"
"ఏమో అమ్మ. ఎప్పుడు అనిపించలేదు అలా. ఎందుకో మొదటి సారి అనిపించింది. ఇన్ని రోజులు "కేశ సుందరి" లాగానే ఉన్నాను కదా. కొన్ని రోజులు "గుండు సుందరి" లాగ కూడా నన్ను నేను చూసుకోవాలని ఉంది మా. ప్లీజ్ మమ్మీ. ఈ ఒక్క సారికి ఒప్పుకో"
నా మాటకి ఎప్పుడు అమ్మ ఎదురు చెప్పాడు. "సరే నే నీ ఇష్టం మరి. సరే మరి అలా అయితే వెళ్దామా కల్యాణ కట్ట ని. తమ్ముడిని లేపు పో వెళ్లి. నేను ఈ లోపు పేస్ వాష్ చేసుకొని వస్తాను" అని చెప్పి అమ్మ బాత్రూం లోకి వెళ్ళింది. నేనేమో వెళ్లి తమ్ముడిని నిద్ర లేపాను.
అమ్మ వచ్చాక నా జుట్టు ని చివరి సారిగా దువ్వెన తో చిక్కీలు తీసి మంచిగా దువ్వింది. నాకు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంది లోపల అంత. ఎలా ఉంటానో గుండు లో మరియు గుండు ఎలా చేస్తారా అని. ఒక మూర మల్లె పూలు తీసుకొని అమ్మ నా తల లో పెట్టి "అంటుంది. చివరి సారి చూసుకోవే నీ నల్లటి కురులలలో ఇలా మల్లె పూలని. ఇంకొక రెండు సంవత్సరాల వరకు నీకు ఆ అవకాశం రాదూ మరి. చూసుకో అని చెప్పింది. అలా మల్లె పూలతో చివరి సారిగా ఒక పిక్ దిగి నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాను.
నేను, తమ్ముడు అమ్మ ముగ్గురం కలిసి కల్యాణకట్ట కి బయలుదేరాము. నాకు ఏదో తెలియని ఒక చిన్న భయం తో కూడిన ఎక్సైట్ మెంట్ మొదలు అయ్యింది. కానీ ఎందుకో ఈ గుండు ని నా ఇంస్టాగ్రామ్ లో ఫాలోయర్స్ అందరికి తెలియాలి అని అనిపించింది. వెంటనే ఇంస్టాగ్రామ్ లైవ్ ఓపెన్ చేసి సిద్ధం గా ఉన్నాను. అంతగా రద్దీ లేకపోయే సరికి మేము మాధవ నిలయం లోని కల్యాణకట్ట కి వెళ్ళాము. అక్కడ ఒక చిన్న క్యూ లో ముగ్గురము నుంచున్నాము.ముందర నేను నా వెనుక తమ్ముడు చివరిలో అమ్మ ఉంది.
తమ్ముడు ఏమో లూస్ గా ఉన్న నా జుట్టుని పట్టుకొని లాగుతూ మరియు వేలితో మెలి తిప్పుతూ ఉన్నాడు. వాడు విన్నాడు నేను అమ్మ మాట్లాడుకుంది నా గుండు గురుంచి. వాడు నా వంక చూసి "అక్క గుండు ఎలా చేస్తారు అక్క?"
వాడు అడిగిన ప్రశ్న కి నిజంగానే నా దెగ్గర సమాధానం లేదు. నేను ఎప్పుడు చూడలేదు కనుక నాకు దాని గురుంచి పెద్ద ఐడియా లేదు. నేను ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ తో "నాకు తెలీదు రా అన్నాను". అమ్మ ఏదో చెపుదాం అనుకునే లోపు మేము ఒక చిన్న గేట్ దెగ్గరికి వచ్చాము. అక్కడ చిన్న కౌంటర్ లాగా ఉండి ఒకతను ఏవో ఇస్తున్నాడు నా ముందర ఉన్న వాళ్ళకి. నేను వాడి ముందర అంత నుంచున్నాను. ఏమి మాట్లాడకుండా. "గుండా లేక కత్తెరలా" అని అడిగాడు. నేను మెల్లగా సిగ్గు పడుతూ తల దించుకొని "గుండు రెండు టోకెన్ లు ఇవ్వండి" అని చెప్పాను. రెండు టోకెన్లు మరియు రెండు సగం తుంచి బ్లేడ్ ముక్కలని నా చేతిలో పెట్టాడు. నేను అవి చేతిలోకి తీసుకొని మెల్లగా ముందరకి బయలుదేరాను. అప్పుడు పక్కన నుండి నాకు ఆ టోకెన్ లు ఇచ్చే వాళ్ళ మాటలు వినపడ్డాయి. "అన్న ఏంది అన్న అంత పొడవు ఉంది జుట్టు. ఆమె ఇప్పుడు నున్నగా గుండు గొరిగించుకోబోతుందా?"
నేను, తమ్ముడు అమ్మ ముగ్గురం కలిసి కల్యాణకట్ట కి బయలుదేరాము. నాకు ఏదో తెలియని ఒక చిన్న భయం తో కూడిన ఎక్సైట్ మెంట్ మొదలు అయ్యింది. కానీ ఎందుకో ఈ గుండు ని నా ఇంస్టాగ్రామ్ లో ఫాలోయర్స్ అందరికి తెలియాలి అని అనిపించింది. వెంటనే ఇంస్టాగ్రామ్ లైవ్ ఓపెన్ చేసి సిద్ధం గా ఉన్నాను. అంతగా రద్దీ లేకపోయే సరికి మేము మాధవ నిలయం లోని కల్యాణకట్ట కి వెళ్ళాము. అక్కడ ఒక చిన్న క్యూ లో ముగ్గురము నుంచున్నాము.ముందర నేను నా వెనుక తమ్ముడు చివరిలో అమ్మ ఉంది.
తమ్ముడు ఏమో లూస్ గా ఉన్న నా జుట్టుని పట్టుకొని లాగుతూ మరియు వేలితో మెలి తిప్పుతూ ఉన్నాడు. వాడు విన్నాడు నేను అమ్మ మాట్లాడుకుంది నా గుండు గురుంచి. వాడు నా వంక చూసి "అక్క గుండు ఎలా చేస్తారు అక్క?"
వాడు అడిగిన ప్రశ్న కి నిజంగానే నా దెగ్గర సమాధానం లేదు. నేను ఎప్పుడు చూడలేదు కనుక నాకు దాని గురుంచి పెద్ద ఐడియా లేదు. నేను ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ తో "నాకు తెలీదు రా అన్నాను". అమ్మ ఏదో చెపుదాం అనుకునే లోపు మేము ఒక చిన్న గేట్ దెగ్గరికి వచ్చాము. అక్కడ చిన్న కౌంటర్ లాగా ఉండి ఒకతను ఏవో ఇస్తున్నాడు నా ముందర ఉన్న వాళ్ళకి. నేను వాడి ముందర అంత నుంచున్నాను. ఏమి మాట్లాడకుండా. "గుండా లేక కత్తెరలా" అని అడిగాడు. నేను మెల్లగా సిగ్గు పడుతూ తల దించుకొని "గుండు రెండు టోకెన్ లు ఇవ్వండి" అని చెప్పాను. రెండు టోకెన్లు మరియు రెండు సగం తుంచి బ్లేడ్ ముక్కలని నా చేతిలో పెట్టాడు. నేను అవి చేతిలోకి తీసుకొని మెల్లగా ముందరకి బయలుదేరాను. అప్పుడు పక్కన నుండి నాకు ఆ టోకెన్ లు ఇచ్చే వాళ్ళ మాటలు వినపడ్డాయి. "అన్న ఏంది అన్న అంత పొడవు ఉంది జుట్టు. ఆమె ఇప్పుడు నున్నగా గుండు గొరిగించుకోబోతుందా?"
ను మెల్లగా సిగ్గుపడుతూ వెనకకు తిరిగి వాళ్ళకి ఒక చిన్న చిరునవ్వుతో సమాధానం ఇచ్చాను. నేను నా చేతులో ఉన్న టోకెన్ ల మీద ఉన్న నెంబర్ ని చూసాను. మెల్లగా నడుచుకుంటూ లోపలకి వెళ్ళాం . పెద్ద హాల్. మొత్తం తెల్లటి మార్బల్ తో ఫ్లోరింగ్ మరియు గోడలు కూడా ఉన్నాయి. గోడకి అనుకోని చుట్టూరా ఎత్తు గా కట్టి ఉంది. దాని ముందరనే ఒక చిన్న కాలువ లాగా ఉంది. దానికి ముందు కొంచెం ఎత్తు తక్కువ గా ఉండి ఉంది. అడుగు అడుగు దూరం లో మంగలి వాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళ తల మీద ఒక బోర్డు నెంబర్ రాసి ఉంది. అప్పుడు అర్ధం అయ్యింది నాకు. ఆ టోకెన్ మీద ఉంది మంగలోడి నెంబర్. భలే అనిపించింది. వెంటనే నాకు తెలియకుండానే నా కళ్ళు మంగలోడి కోసం అని వెతికాయి. కాకపోతే నాకు అక్కడ కనిపించ లేదు. మెల్లగా వెతుక్కుంటూ అంతే ముందరకి వెళ్ళాం. నాలుగు పక్కల ఉన్న మంగలోళ్ళలో ఒక పక్క గోడ కి మొత్తం ఆడ మంగలి వాళ్ళకే వదిలేసారు. నేను ఆలా ఆడ మంగలోళ్ళని చూసి షాక్ అయ్యాను. అరేయ్ భలే ఉందే ఇక్కడ వీళ్ళు ఉండడం అనుకోని చూస్తే మాకు ఇచ్చిన మంగలి ఆవిడ నెంబర్ కనిపించింది.
వెంటనే ఆవిడ దెగ్గరికి వెళ్ళాం. అమ్మ మరియు తమ్ముడు నేను చేసే పిచ్చి చేష్టలు చూసి నవ్వుతున్నారు. ఆ మంగలి ఆవిడ దెగ్గరికి వెళ్లి నిలబడ్డాను. కాకపోతే ఆవిడ ముందర ఒక చిన్న పాప కూర్చొని మెదలకుండా గుండు గొరిగించుకుంటుంది. నేను అమ్మ కి చెప్పి వాష్రూమ్ కి వెళదాం అని అక్కడ బోర్డు కనిపిస్తే వెళ్ళాను. లోపల చూస్తే అక్కడ అందరు ఆడవాళ్లు కొంత మంది లూస్ జుట్టుతో స్నానాలు చేస్తూ ఉన్నారు. కొంత మంది పెద్ద వయసు ఉన్న ఆంటీ లు ఏమో నున్నటి బోడి గుండు లో టాప్ కింద తల పెట్టి మెడ ఉన్న వెంట్రుకలని రుద్దు కుంటూ ఉన్నారు. సరే అని నేను పక్కనే ఉన్న స్నానం గదిలోకి వెళ్లి పని కానిచ్చి డోర్ తీసి చూస్తే ఎదురుగా నా వయసు ఉన్న ఒక అమ్మాయి నుంచొని ఉంది. తెల్లటి మేని ఛాయ ఉన్న అమ్మాయి అప్పుడే గొరిగిన నున్నటి బోడి గుండు లో మెరిసిపోతుంది. తనని చూసి నేను షాక్ అయ్యాను. కానీ చాలా అందము గా ఉంది. పక్కన నుండి వాళ్ళ ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు ఈ లోపు ఆ అమ్మాయి సిగ్గుతో లోపలకి వెళ్లి గడి పెట్టేసుకుంది.
మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లు అయితే దయ చేసి షేర్ చేయండి మరియు కామెంట్స్ లో తెలుపండి. తరువాతి భాగం కోసం వెయిట్ చేయండి.
1 Comments
Superb continue
ReplyDelete