లాక్ డౌన్ గుండు కథలు - Part 1

by - July 21, 2020

లాక్ డౌన్ ఎవరికీ ఎలా ఉపయోగ పడిందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాగా కలిసి వచ్చింది. జీవితం లో నేను ఎప్పుడు చెయ్యనేలేను అనుకున్న ఎన్నో పనులను చేయడానికి ఆస్కారం ఇచ్చింది అయితే ఈ లాక్ డౌన్ సమయమే. చెయ్యలేను అనుకున్న పనులేంటి అసలు నా కధ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ కథలోకి వెళ్లాల్సిందే. 

నా పేరు ప్రియ. ఇరవై ఏడు సంవత్సరాల సాఫ్ట్వేర్ ఉద్యోగిని. జీవితం లో ఎవ్వరికి తెలియని నేను అంటూ ఎమన్నా ఉన్నాను అంటే అది హెయిర్ ఫిటిషర్ లోనే. అది నా జీవితం లో ఎప్పుడు ఎలా మొదలు అయ్యిందో తెలీదు కానీ నాతో పాటే పెరిగింది అది కూడా. నా పదవ తరగతి తిరుమలలో గొరిగించిన గుండు తర్వాత నుండి గుండు మీద పెరిగిన మక్కువ ఎంత అనేది మాటలలో చెప్పలేను. ఆ తర్వాత ఎన్నో సార్లు మంగలి కత్తి ని తల మీద ఆడించాలనే కోరిక కలిగిన ఆడించే అవకాశం మాత్రం కలగలేదు.

నేను హైదరాబాద్ లోని ఒక మంచి ఏరియా లో ఉండే గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్రెండ్స్ తో రూమ్ లో ఉంటున్నాను. ఈ సంవత్సరం లో నాకోసం నేను ఏదన్న కొత్తగా నేర్చుకుందాం అనుకోని డిసైడ్ అయ్యా. అందులో భాగం గానే హెయిర్ కటింగ్ కోర్స్ జాయిన్ అయ్యి మార్చి వరకు పూర్తి చేసేసాను. నేర్చుకోడం అయితే నేర్చుకున్నాను కానీ చేసే ఛాన్స్ మనకి ఎక్కడ వస్తుంది లే అని అనుకొనే రోజుల్లోనే కరోనా అనేది రావడం అందరం లొక్డౌన్ లోకి వెళ్లడం అయ్యింది. కరోనా లాక్ డౌన్ కి నా హెయిర్ కటింగ్ కోర్స్ కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? 

కరోనా పెరుగుతున్న నేపథ్యం లో మోడీ గారు ప్రజలకి లాక్ డౌన్ ప్రకటన జరిగిన సమయం లో నా రూమ్ లో ఫ్రెండ్స్ అందరు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు. నాకేమో ఆఫీస్ పని ఉండడం వలన ఊరికి వెళ్ళడానికి వీలు కాలేదు. అప్పుడే లాక్ డౌన్ మొదలు అయ్యి మూడు వారాలు అయిపోయింది. నేనేమో ఆఫీస్ వర్క్ ఉన్నంత వరకు సమయం తెలీకుండానే గడిచిపోతుంది కానీ శని మరియు ఆదివారాలలో అయితే సమయాన్ని ఎలా కిల్ చేయాలో అర్ధం కాలేదు మొదటి రెండు వారాలు. ఆ తర్వాత మెల్లగా నేను నేర్చుకున్న హెయిర్ కటింగ్ కోర్స్ ని డమ్మి హెడ్ మీద ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను. ఆ రోజు కూడా అలా చేస్తూ ఉన్న సమయం లో డోర్ బెల్ ఎవరో కొట్టిన్నట్టు అనిపించింది. వెళ్లి చూస్తే పక్కన ఇంట్లో ఉండే మాధురి అక్క. లోపలకి పిలిచాను. వచ్చాక నా హెయిర్ కటింగ్ ది చూసింది. ఆశ్చర్యం గా అడిగింది "ఏంటి ప్రియ... ఇది ఎప్పుడు నేర్చుకోడం మొదలు పెట్టావు?"
 
"అదా అక్క. ఈ సంవత్సరం ఎలా అయినా నేర్చుకుందాం అని డిసైడ్ అయ్యి లాక్ డౌన్ కి ముందరనే కోర్స్ కంప్లీట్ చేసేసాను అక్క".

"ఓ అవునా" అని లేచి డమ్మి హెడ్ ని దెగ్గరికి వచ్చి చూసి "ఇదేమి హెయిర్ స్టైల్ ప్రియ? ఒక సైడ్ మొత్తం జుట్టు లేదు" అని అడిగింది.

ఇదా? సైడ్ షేవ్ అని అడ్వాన్స్డ్ హెయిర్ స్టైల్ అక్క. ఇప్పుడే ఇదే ట్రెండ్ నడుస్తుంది లే. 

ఓ అవునా. పెళ్లి అయినా కొత్తల్లో ట్రెండ్ ని ఫాలో అయ్యే దానిని కానీ నా కూతురు పుట్టాక అసలు బయట విషయాలని తెలుసుకోడానికి సమయమే సరిపోడం లేదే. 

అయ్యో అవునా అక్క. నీకు ఎమన్నా హెయిర్ కట్ కావలి అంటే చెప్పు అక్క. చేసి పెడతాను ఫ్రీ గానే లే. 

మాధురి అక్క నవ్వి "హహహ. సరే రా. ప్రస్తుతానికి అయితే ఏమి వద్దు. అవసరం అయితే అడుగుతాను లే. సరే నా?"

ఈ లోపల అక్క ని వాళ్ళ అత్తయ్య గారు పిలిచారు. సో వెళ్ళిపోయింది. నేనేమో మెల్లగా నా హెయిర్ కట్ ని కంటిన్యూ చేసుకున్నాను.  

తర్వాత రోజు ఆదివారం. ఆ రోజున ఉదయాన్నే వాకింగ్ కి అని నేను కిందకి వెళ్ళాను. అదే సమయం లో మాధురి అక్క కూడా వచ్చింది. మేము నడుస్తూ ఉండగా ఇంకొక ఇద్దరు అక్క లు కూడా జాయిన్ అయ్యారు. ఒక్కరేమో రాణి వాళ్ళ ఆయన అమెరికా లో ఇరుక్కుపోయాడు లాక్ డౌన్ వలన ఇంకొకరేమో షాలిని అక్క. తనకి ఇద్దరు పిల్లలు - ఇద్దరు ఆడ పిల్లలే. ఒక పాప పదవ తరగతి చేరాలి ఇంకొక పాప ఎనిమిదవ తరగతి అయిపోవచ్చింది. కాసేపు అలా నడుస్తూ కరోనా గురుంచి కొన్ని జోక్స్ వేసుకుంటూ తిరిగి పార్క్ లో బెంచ్ మీద కూర్చున్నాము. 

మాటల మధ్యలో నా హెయిర్ కటింగ్ కోర్స్ గురుంచి మాటలు వచ్చాయి. మాధురి అక్క అందరికి చెప్పింది. నాకు కొంచెం సిగ్గు గ అనిపించింది కానీ అందరు భలే మంచి పని చేసావే. జాబ్ చేస్తూ కొత్తగా ఏదో ఒకటి కొత్తది అయితే నేర్చుకున్నావు.  కాసేపు ముచ్చటించుకున్నాక అందరం ఎవరి ప్లేసెస్ కి వాళ్ళం వెళ్ళిపోయాము. ఆ తర్వాత వారం కూడా అయిపోయింది. ఆ తర్వాతి రోజు శనివారం మాధురి అక్క కాల్ చేసి ఇంటికి పిలిచింది రమ్మని. 

నేను వెళ్ళాను. మాధురి అక్క వాళ్ళ ఇంట్లో తాను, బుజ్జిది, వాళ్ళ ఆయన, ఆయన చెల్లి రాధిక  మరియు మాధురి అక్క వాళ్ళ చెల్లెల్లు ప్రియాంక (బి టెక్ చదవడం అయిపోయి ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తుంది) మరియు రమ్య మరియు అక్క వాళ్ళ అత్తయ్య మామయ్య లు. ఇంటికి వెళ్ళగానే అందరు ఒకే చోట కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఉన్నారు. నేను వెళ్లి డోర్ బెల్ కొట్టగానే మాధురి అక్క నే వచ్చి డోర్ తెరిచింది. కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చింది. అందరు నా వంకనే చూస్తూ ఉన్నారు. ఈ లోపు వాళ్ళ అత్తయ్య గారు నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. 

"అమ్మ ప్రియ. అసలు అయితే ఈ పాటికి ఈ బుజ్జిదానికి తిరుమల లో పుట్టు వెంట్రుకలు తీయించాలి కాకపోతే ఈ లాక్ డౌన్ వాళ్ళ అది ఇప్పుడే అప్పుడే అయ్యే లాగా లేదు అమ్మ. అందుకనే నిన్ను పిలవమని చెప్పను మాధురి కి".

నాకు ఒక్క నిమిషం అర్ధం కాలేదు. నేను అంతే వింటూ ఉన్నాను. నువ్వు హెయిర్ కటింగ్ కోర్స్ నేర్చుకున్నావు అని మా మాధురి చెప్పింది. మా ఇంట్లో అందరం ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి నిన్ను పిలిపించాము అమ్మ. ఈ లోపు మాధురి అక్క "ప్రియ మా బుద్దడానికి పుట్టువెంట్రుకలు నువ్వే తియ్యలే" అని చెప్పింది. నాకు ఒక పక్క ఆనందం గా ఉన్న మొదటి గుండు గొరగబోతున్నాను అని ఇంకొక పక్క భయం గా ఉంది. మంగలి కత్తి ని నేను నాకు ఏమి తెలియని రోజుల్లో ఏదో చూసాను కానీ ఎప్పుడు దానిని అంత బాగా వాడలేదు. కోర్స్ సమయం లో కొంచెం ప్రాక్టీస్ చేశాను కానీ ఎప్పుడు దానిని వాడలేదు. అందుకే ఆ భయం. 

మాధురి - ఎప్పుడు చేస్తావో చెప్తే నేను అప్పటికి దానిని రెడీ చేస్తాను రా

ఈ లోపు వాళ్ళ అత్తయ్య గారు "ఇప్పుడు అయినా మాకు ఓకే అమ్మ. నువ్వు వెళ్లి నీ సామాన్లు తెచ్చుకో అని చెప్పారు.

పెద్ద వాళ్ళతో ఇదేనేమో. మనం చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళే అన్ని అనేసుకుంటారు. నేనేమి మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయి నా సమన్లు మొత్తం తెచ్చుకున్నాను. తెచ్చుకునే సరికి ఇంట్లోనే ఒక చిన్న స్టూల్ వేసి నేను కూర్చోడానికి రెడీ గా పెట్టారు. ఎదురుగ కింద కూర్చోడానికి కూడా ఉంది. ఒక తెల్లటి గుడ్డ వేసి నీట్ గా మొత్తం రెడీ గా ఉంది. నేను వెళ్లి మాధురి అక్క వంక చూడగానే నవ్వి కూర్చో అన్నట్టు సైగ చేసింది. 

నాకు అర్ధం అయ్యింది నాది ప్రేక్షక పాత్రనే కానీ ఏమి లేదు ఇందులో అని. అందుకే మెదలకుండా అంతే కూర్చున్నాను. బుజ్జిదానికి ఆల్రెడీ తల స్నానం చేపించి రెడీ గా ఉంచినట్టు ఉన్నారు. అదేమో కొంచెం ఏడుపు మొదలు పెట్టింది. నేను మాధురి అక్క ని దెగ్గరికి పిలిచి చెవిలో మెల్లగా చెప్పాను "అక్క మంగలి కత్తి తో మొదటి అనుభవం నాకు ఇదే. సో మెల్లగా చేస్తాను సరే నా" అని. నేను బాగ్ లో నుండి మంగలి కత్తిని తీసుకొని బ్లేడ్ వేస్తూ ఉండే లోగ నా ఎదురుగా మాధురి అక్క వాళ్ళ చెల్లి ప్రియాంక కూర్చుంది. 

నేను కత్తెర్లు అనుకోని మంగలి కత్తి ని పక్కకి పెట్టి కత్తెర పట్టుకున్నాను. తన పొడవాటి జడ ని ముందుకు వేసుకుంది. నేను మెల్లగా కత్తెర తో మూడు కత్తెర్లు ఇచ్చాను. ఆ జుట్టుని చిన్న చుట్టలాగా చుట్టి పక్కన పెట్టాను. నెక్స్ట్ ఎవరా అన్నట్టు చూసాను అందరి వంక. ఈ లోపు ప్రియాంక నా వంక చూసి "ప్రియాంక నాకు కత్తెర్లు కాదు. నాకు నున్నగా గుండు గోరగాలి".

అంతే నాకు షాక్ కొట్టిన్నట్టు అనిపించింది. ఇదేంటి బుజ్జిదానికే గుండు అన్నారు ఇప్పుడేమో ప్రియాంక కి గుండు. ఏది ఏమైతేనేమి నా మొదటి గుండు అనుభవం ఒక మంచి జుట్టు మీదనే అని చాలా ఆనందం వేసింది. 

నేను వెంటనే మంగలి కత్తి తీసుకున్నాను కానీ ఎక్కడ నుండి మరియు ఎలా మొదలు పెట్టాలో అర్ధం కాలేదు. అప్పుడే నేను ఎన్నో సార్లు చూసిన పొడవు జుట్టు సుందరి దిషా గుండు వీడియో ని మనసులోకి తెచ్చుకున్నాను. తన అంతటి పొడవైన కురులు లేవేమో కానీ ప్రియాంక జుట్టు కూడా చాలా ఒత్తుగా ఉంది. నేను మెల్లగా తన అందమైన జడ ని విప్పేసాను. ఆ తరువాత జుట్టు ని రెండు భాగాలు గ విడదీసాను. విడదీసిన జుట్టు ని రెండు వైపులకి వేసి రెండు ముడులుగా వేసాను. రెండు టెన్నిస్ బంతులు వేలాడుతున్నట్టు ఉన్నాయి రెండు పక్కలన. నా దెగ్గర స్ప్రే బాటిల్ తీసుకొని మెల్లగా తన తల మీద స్ప్రే చేయడం మొదలు పెట్టాను. ఒక మూడు నిమిషాలలో తల మొత్తం మంచిగా తడిసింది కాకపోతే కుదుళ్ళ భాగం వరకే తడిచింది మిగతా బంతులు మాత్రం పొడి గానే ఉన్నాయి.

ఒక్క సారి కళ్ళుమూసుకొని ఆ వీడియో లో ఎలా గొరిగిందో మనసులో గుర్తుకు తెచ్చుకొని కళ్ళు తెరిచి మంగలి కత్తిని చేతిలోకి తీసుకొని తన తల భాగం లో నడి నెత్తి మీద పెట్టి సర్రున వెనక్కి లాగాను. కొంచెం తెగినట్టు అనిపించింది. ప్రియాంక వెంటనే "అమ్మ" అని అరిచింది.    

"సారీ ప్రియాంక అని మెల్లగా చెప్పాను... ఈ లోపు వాళ్ళ అత్తయ్య అదేం ఉంది లేమ్మా మంగళోడు గొరిగిన గాట్లు పడకుండా ఏమి గొరకడు లేమ్మా.

అంత అందమైన జుట్టు ఉన్న ప్రియాంక ఎందుకు గుండు గొరిగించుంటుంది అనే డౌట్ ఎంత మందికి వచ్చింది? డౌట్ వస్తే సరిపోదు గా దాని వెనుక కారణం కూడా తెల్సుకోవాలి కదా. మరి కారణం తెలుసుకోడానికి వెల్దామా ప్రియాంక మాటలలోనే. 

You May Also Like

2 Comments

  1. Nice story akka please countie chayi akka

    ReplyDelete
  2. What a makeup service!!!!!! The best bridal makeup services at the budget-friendly. , unisex hair and style salon in alon in Tirupathi .

    ReplyDelete