gundu kathalugundu storiesheadshave storiesheadshave stories 2020surprise gundusurprise headshavetelugu gundu kathalutelugu headshave storiestirumala headshave
లాక్ డౌన్ గుండు కథలు - Part 2
ప్రియాంక - మాధురి కి చెల్లిగానే ఇప్పటి వరకు పరిచయం అయినా నేను ఇక నుండి నాగురుంచి నేనే చెప్పుకుంటాను.
బి టెక్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో ఉన్నాను నేను. నాకు నా జడ అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు జడలోనే ఉండే దానిని కానీ లూస్ గా కూడా వేసుకునే దానిని కాను నేను. ఎందుకో అలా ఉండడం ఇష్టం ఉండదు. అలాంటి నేను లూస్ హెయిర్ వేసుకోడం మొదలు పెట్టాను అది ఎవరి వల్లనో మీకే అర్ధం అయ్యి ఉంటది. అవును అంది నా జీవితం లోకి కలలాగా వచ్చిన నా రవి. నాతో పాటు చదువుకున్నాడు తాను కూడా. మొదట్లో మా ఇద్దరికీ అసలు పడేదే కాదు కానీ ఎక్కడ మొదలు అయ్యిందో కానీ మొదలు అయ్యింది మా ఇద్దరి మధ్య తెలియని ఒక చిన్న ప్రేమ కథ.
తనకి నేను అన్న నా జుట్టు అన్న చాలా ఇష్టం. తాను నా జీవితం లోకి వచ్చాకనే నేను రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకోడం మొదలు పెట్టాను. తనకి లైఫ్ ని హ్యాపీ గా లీడ్ చెయ్యాలి అనేదే ఇష్టం మరియు లైఫ్ లో అన్ని చూడాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఒక రోజు మేము ఇద్దరం కలిసి విజయవాడ అమ్మ వారి గుడికి వెళ్ళాము. మాటల్లో తను తలనీలాలు ఇద్దాం అని చెప్పాడు. సరే అని తనతో పాటు నేను లోపలకి వెళ్ళాను.
అయితే అదే లైన్ లో మాతో పాటు ఒక అమ్మాయి ఉంది. నా అంత వయసే ఉంటుంది తనకి కూడా. బాబ్ హెయిర్ కట్ లో ఉంది ఆ అమ్మాయి. మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నది చూస్తూ ఉంది. రవి టికెట్ తీసుకొని లోపలకి వెళ్ళాం. ఆ అమ్మాయి కూడా మాతో పాటే లోపలకి వచ్చింది. రవి కి వచ్చిన మంగలి అతని దెగ్గారనే ఆమె కి కూడా వచ్చింది అనుకుంట. లైన్ లో ముందర ఆమెనే నుంచొని ఉంది కానీ ఎందుకో సడన్ గా మమ్మల్ని ముందరకి వెళ్ళమని చెప్పింది అనమాట. రద్దీగానే ఉంది ఆ ప్రదేశం అంత. మా ముందర బాగానే ఉన్నారు జనాలు. అయితే ఎందుకో రవి కి డౌట్ వచ్చి ఆమెతో మాటలు కలిపాడు. అప్పుడే అర్ధం అయ్యింది ఆమె పేరు లయ అని. తానూ మా కాలేజీ లో చేరిన ఫ్రెషర్ అని.
రవి - "హయ్ లయ. నా పేరు రవి. తిను నా ఫ్రెండ్ ప్రియాంక"
లయ - "హాయ్ రవి అండ్ ప్రియాంక"
రవి లయ ని చూసి ఇలా అడిగాడు "ఏంటి మొక్కు ఉందా ఏంటి?"
లయ - "హా రవి"
రవి - "ఓ అవునా. కత్తెర లే కదా ఎందుకు అంత భయం. ఏమి కాదు" అని చెప్తాడు.
లయ తన బాబ్ జుట్టు ని సరిచేసుకుంటూ "కత్తెరలు అయితే ఎందుకు భయపడతాను చెప్పు. మొత్తం ఇవ్వాలని మొక్కుకున్నాను అందుకే ఆ భయం"
ఆ మాట వినగానే రవి మరియు నేను షాక్ అనమాట. క్యూట్ గా ఉంది ఆ పిల్ల బాబ్ హెయిర్ లో. ఇప్పుడేమో నున్నగా గుండు గొరిగించుకుంటాను అంటుంది. వెంటనే రవి "అవునా. అదేంటి? గుండు? అయినా కాలేజీ లో జాయిన్ అయినా వెంటనే గుండు ఆ?"
లయ - "అదా... అదేమీ లేదు. మాది నెల్లూరు. నేను నా పదవ తరగతి తరువాత ఈ ఊరిలో ఉన్న మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాను. అప్పుడు నాకు మంచి మార్కులు వస్తే తల నీలాలు సమర్పిస్తాను అని మొక్కుకున్నాను. ఆ తర్వాత రావడానికి కుదరలేదు. ఇదిగో ఇప్పుడు మన కాలేజీ లోనే సీట్ వచ్చింది కదా. ఇంకా ఈ మొక్కు తీర్చేస్తే ఒక పని అయిపోతుంది లే అని వచ్చాను".
రవి - ఓ అవునా. పొట్టి జుట్టు ఎహ్ కదా ఎన్ని రోజుల్లో వచ్చేస్తుంది లే. టెన్షన్ పడకు.
లయ - వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి "ఇది పొట్టి జుట్టు ఆ అని లంగా వోణి లో వాలు జడ తో వయ్యారం గా నుంచొని ఉన్న ఒక అందమైన ఉంది. రెండు నిముషాలు చుశాకనే అర్ధం అది లయ నే అని".
రవి నేను షాక్. ఎంత బావుందో అసలు ఆ పిక్ లో. వెంటనే రవి - మరి ఈ బాబ్ కట్ ఏంటి లయ?
నా అదృష్టం ఏంటి అంటే? ఇక్కడ పదవ తరగతి లో మొక్కుకున్నట్టే తిరుమల వెంకాన్ని నా జడ మొత్తం సమర్పిస్తాను మన కాలేజీ లో సీట్ వస్తే అని మొక్కుకున్నాను. ఆయన కరుణించాడు సో అందుకని మొక్కు తీర్చేసి వచ్చాను అక్కడ. కాకపోతే ఆ సమయం లో అసలు గుర్తుకు రాలేదు ఈ మొక్కు. పోయిన వారం లో మా ఎదురింటి ఆంటీ వాళ్ళ పాప కి తల వెంట్రుకలు తీశారు అంటే అప్పుడు గుర్తొచ్చింది ఇక్కడ మొక్కు ఉంది అని. అమ్మమ్మకి చెప్తే తీర్చేసుకుంటే ఒక పని అయిపోతది కదా రా అని అనింది. ఆలోచించుకున్నాను కాలేజీ లో ఇప్పుడు అయితేనే బెటర్ లేకపోతే మళ్ళీ జుట్టు పెరిగాక గుండు చూపించడం అంటే కష్టమే కదా అని ఇంకా ధైర్యం చేసి ఇవ్వాళ వచ్చాను.
రవి - వావ్ సూపర్ లయ. బావుంది నీ గుండు వెనుక ఉన్న కథ. ఈ లోపల మంగలోడి ముందర అందరు అయిపోయారు. నెక్స్ట్ మా టర్న్ వచ్చింది.
వెంటనే లయ నే అనింది "వై డోంట్ వి హావ్ ఏ లాస్ట్ సెల్ఫీ విత్ హెయిర్?" అని. ముగ్గురం విక్టరీ పోజ్ లో పెట్టి ఒక సెల్ఫీ మరియు నార్మల్ గ ఏడుపు మొహం పెట్టి ఒక సెల్ఫీ దిగాము. ఈ లోపు రవి వెళ్లి మంగలోడి ముందర కూర్చున్నాడు. లయ జుట్టు తడుపుకుంటూ ఉంది. తన ఫోన్ నా చేతికి ఇచ్చి "కెన్ యు రికార్డ్ ది హోల్ ప్రాసెస్ అండ్ మై హెడ్ షేవ్ ప్లీజ్?" అని అనింది.
వెంటనే నేను "సరే వై నాట్" అని తన మొబైల్ తీసుకొని తన జుట్టు తడుపుకోడం తీస్తూ ఉన్నాను. ఈ లోపల రవి గుండు గీయడం కూడా అయిపోయింది. మీసం గెడ్డం లేకుండా ఆ బాబు ని చూడడం ఇదే మొదటి సారి. చాలా భయంకరం గా ఉన్నాడు అనుకోండి అది వేరే విషయం.
లయ రవి ని ఒక నవ్వు నవ్వింది బట్ తను కూడా ఇలానే ఉంటుందేమో గుండు లో అనుకుంటూ కూర్చుంది. మంగళోడు వెంటనే తన చేతిలోని మంగలి కత్తిని చేతిలోకి తీసుకొని గొరగడం మొదలు పెట్టాడు. గొరగబోయే ముందర తన ఎడమ చేతి బ్రోటని వేలితో సుడి ఉన్న ప్రదేశాన్ని చూసుకొని మంగలి కత్తి ని అక్కడ పెట్టి చిన్న గా గొరిగాడు. ఒక చిన్న గోలి కాయ అంత తెల్లటి ప్రదేశం ఏర్పడింది. అక్కడ నుండి మొదలు పెట్టి వెనక్కి గొరుగుతూ వెళ్ళాడు. మెత్తగా తెగుతుంది జుట్టు అంతా. మంగళోడు మొదటి సారి గుండు ఆ అని అడిగాడు? దానికి లయ అవును అంకుల్. చిన్నప్పుడు పుట్టు వెంట్రుకలు తప్పితే ఇంత వరకు మళ్ళీ గుండు చేపించలేదు.
మెల్లగా తల పైకి ఎత్తి ముందర భాగం లో గొరగడం మొదలు పెట్టాడు. నేను వీడియో తీస్తున్నాను అని అర్ధం అయినా మంగళోడు ముందర భాగం గొరిగేసి తనని వెనుకకు తిరిగి కూర్చోమని చెప్పాడు. భలే వింతగా అనిపించింది లయ ని చూస్తే. చాణక్య చంద్రగుప్త సినిమా లో చాణక్యుడి లాగా ఉంది తనకి జుట్టు ఇప్పుడు అయితే. ఏదో బట్ట తల వచ్చినట్టు ఉంది. లయ ఏమో సిగ్గుతో కళ్ళు మూసుకొని కూర్చుంది. అలా గొరుగుతూ మొత్తం ఫినిష్ చేసాడు. లయ లేచింది. వెంటనే మంగళోడు నా వంక చూసి "నీకు కూడా గుండు చెయ్యాలా అమ్మ అని అడిగాడు".
నేను వెంటనే "వామ్మో నాకు లేదు అని నా జడ ని నేను తడుముకున్నాను సిగ్గు పడుతూ".
రవి నాతో "కత్తెర్లు అయినా ఇవ్వు" అని అన్నాడు.
నేను భయం గా చూసాను. వెంటనే లయ వచ్చేసి "కత్తెర్లకి ఎం కాదు ప్రియాంక. నేను చూడు గుండు లో కూడా ఎంత ధైర్యం గా ఉన్నానో అని తన తల తల లాడే బోడి గుండు మీద చెయ్యి వేసుకొని రుద్దుతూ చెప్పింది.
నేను మంగలి అతనితో చివర్లు మాత్రమే కత్తెరించండి అని చెప్పి వెనక్కి తిరిగి కూర్చున్నాను. ఆయన కత్తెరతో కచక్ అనిపించదు. అయిపోయింది అమ్మ అని చెప్పాడు. నేను మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే ఆయన చేతిలో నా జుట్టు ఒక ఆరు అంగుళాల వరకు ఉంది. నాకేమి అర్ధం కాలేదు. వెంటనే ఆయనని "అన్న ఏంటి అంతా కత్తెరించారు?" అని అడిగాను.
మంగళోడు - "నువ్వే కదా అమ్మ చివర్ల కత్తెరిస్తే చాలు అన్నావు. అందుకే నువ్వు జడ వేసుకున్నంత వరకు కత్తెరించకుండా మిగిలినది చివరిది అంతా కత్తెరించాను నువ్వు అన్నట్టు గానే".
నేను మనసులో "అబ్బా వీడికి ఇలా అర్ధం అయ్యిందా?" అనుకోని. సరే లే చేసేది ఏమి లేదు కదా అని చెప్పి మెల్లగా అక్కడ నుండి ముగ్గురం బయటకి వచ్చి కృష్ణ నది లో స్నానం చేసి కొన్ని సెల్ఫీ లు దిగి దర్శనానికి వెళ్ళాం.
0 Comments