ఇది నా గుండు కథ

by - March 24, 2024

  కరోనా అందరికి ఒక రకం గా ఇబ్బంది పెడితే నాకు మాత్రం ఇంకొక రకం గా ఇబ్బంది పెట్టింది. ఎం ఇబ్బంది అని అనుకుంటున్నారా? అలా అయితే ఈ కథ లోకి వెళ్లాల్సిందే.

నా పేరు ప్రియ. మాది గుంటూరు దెగ్గరలోని ఒక చిన్న పల్లెటూరు. ఉద్యోగం కోసం హైద్రాబాదు లో ఉంటూ గడుపుతున్న నాకు అనుకోకుండా కరోనా ముందర వారమే ఊరికి రావాల్సి రావడం. ఆ కరోనా వలన మా ఊరిలోనే ఇరుక్కొని పోవడం అన్ని జరిగాయి. అప్పుడు జరిగిన ఒక సంఘటన గురుంచి ఇపుడు చెప్తాను. మా ఊరిలో ఒక యాభయ్ ఇల్లు మాత్రమే ఉంటాయి. అందులో అందరు ఒకరికి ఒకరు పరిచయం ఉంటారు. అందులో మా బంధువుల ఇల్లే ఒక ఇరవై వరకు ఉంటాయి. అది ఊరు అనేకంటే మా ఇంటి పేరే ఊరు పేరుగా మార్చుకొని ఉంటున్న ఊరు. ఆ ఊరిలో ఒక్కటే మంగలి కొట్టు ఉండేది. అందులో ఉండే రంగడు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. వాడే మా ఇంటికి వచ్చి మా నాన్న గెడ్డం కానీ లేక క్రాఫ్ కానీ చేసేది. 

చిన్నప్పుడు నాకు బేబీ కటింగ్ చేసింది కూడా వాడే. పెద్ద మనిషి వాడు అంటుంది ఏంటి ఇది అనుకోకండి. అలా అలవాటు అయ్యింది. తప్పుగా అనుకోవద్దు. నేను పిలిచేప్పుడు మాత్రం గౌరవం గా రంగడు అనే పిలుస్తాను. 

నాకు హైదరాబాద్ లో పార్లర్ లు బాగా అలవాటు అవ్వడం వలన ప్రతి మూడు నెలలకి ఏదో ఒక కొత్త హెయిర్ స్టైల్  ట్రై చెయ్యడం అలవాటు గా మారింది. కానీ ఆఫీస్ పని ఎక్కువ అవ్వడం వలన ఇంకా కుదరక ఒక సంవత్సరం నర నుండి జుట్టు పెంచుకుంటూ ఉన్నాను. జుట్టు నడుము కింద పెరిగింది. మా అమ్మ కూడా జుట్టు ని చూసి బాగానే పెంచావే అని అనింది.

ఆ రోజు ఆదివారం గ్రూప్ వీడియో కాల్ లో ఉన్నాను. మా ఫ్రెండ్స్ అందరు మంచిగా పోష్ గా హెయిర్ స్టైల్స్ వేసుకొని కనిపించరు. వెంటనే నా పిచ్చిక గూడు జుట్టు ని చూసుకొని కొంచెం చిరాకు వచ్చేసింది. ఇంక వెంటనే కాల్ అయిపోయాక అమ్మ తో అన్నాను "అమ్మ నాకు హెయిర్ కట్ చేయించుకోవాలని ఉంది. మా ఫ్రెండ్స్ అందరు మంచి హెయిర్ స్టైల్స్ తో కనిపించారే ఇవ్వాళ కాల్ లో".

మన ఊరిలో పార్లర్ లు ఎం లేవే తల్లి నువ్వు హెయిర్ స్టైల్ లు చేయించుకోడానికి. మనకి ఉన్న ఒకే ఒక్క హెయిర్ స్టైలిస్ట్ మన రంగడే. కావాలంటే వాడినే ఇంటికి పిలిపించుకొని చేపించుకో నీకు నచ్చింది అని చెప్పింది. సరే అన్నాను కానీ రంగడి ఎం వచ్చు లే అని చెప్పి ఇంక దానిని వదిలేసాను.

ఆ తర్వాత వారం లో సృజన సూపర్ పోష్ హెయిర్ స్టైల్ తో ఫోటో దిగి రీల్ పెట్టింది. ఇంక నాకు అస్సలు ఆగలేదు. ఇంక ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాను. ఆ రోజు ఆదివారం అవ్వడం వలన మా ఇంటికి వచ్చి పిల్లలకి డిప్ప కటింగ్ లు చేస్తున్నాడు రంగయ్య. 

నేను పెరట్లోకి వెళ్లి చూస్తున్నాను. అందరు డిప్ప కటింగ్ లు అంటే మిలిటరీ కటింగ్ చూపిస్తున్నారు. రంగడిని చూసి చాల సంవత్సరాలు అయ్యింది నేను కూడా. కాళ్ళ జోడు లేకపోతే కనిపించడం లేదు. చూపు మందగించింది, చెవుడు కూడా వచ్చింది అంట. పిల్లలు అందరికి అయిపోయింది. ఇంక సర్దుకో పోతు ఉంటె నేను వెళ్ళాను. రంగడు నన్ను చూసి నవ్వుతు బావున్నావా అమ్మ అని అడిగాడు. బావున్నాను అని చెప్పి పెద్దగా అరిచి చెప్పను. ఎం కావాలి అని అడిగాడు. నేను ఫోన్ ఓపెన్ చేసి ఇంస్టాగ్రామ్ లో నేను అనుకున్న హెయిర్ స్టైల్ ఉన్న రీల్ ఓపెన్ చేసి చూపించాను. కాళ్ళ జోడు సరిచేసుకుంటూ చూసాడు అంతే. 

చేయగలవా అని అడిగాను ఫోన్ పక్కన పెట్టి. 

ఓ ఈజీ నే. అని చెప్పాడు. సరే ఇప్పుడే చేస్తావా అని అడిగాను. హా చేస్తాను అని చెప్పాడు. 

నేను నైట్ డ్రెస్ లో ఉన్నాను. ఇంక ఎలాగూ కటింగ్ తర్వాత స్నానం చెయ్యాలి కదా అని చెప్పి అంతే చెట్టు కింద అరుగు లాగా ఉంటె దాని మీద కూర్చున్నాను. రంగడు నా తలలో ఉన్న క్లిప్ లు తీసి పక్కనే పడేసాడు. కింద జడ కి వేసిన రబ్బర్ బ్యాండ్ ని తీసేసి నా చేతికి ఇచ్చాడు.

నేను మెల్లగా రిలాక్స్ అవుతున్నాను. చిన్నప్పుడు నాకు చేసిన డిప్ప కటింగ్ లు గుర్తొస్తున్నాయి. జడ ని విప్పుతూ జుట్టు ని వదులు చేస్తూ ఉన్నాడు రంగడు. మెల్లగా కింద ఉన్న స్ప్రే బోటిల్ తీసుకొని అందులో ఉన్న నీళ్లతో మెల్లగా స్ప్రే చేసి జుట్టు ని మొత్తం తడుపుతూ ఉన్నాడు. నాకు పార్లర్ లో కూడా ఈ స్ప్రే అంటే చాల ఇష్టం. అది చేసినప్పుడు అల్లా మంచిగా కళ్ళు మూసుకొని ఆ స్ప్రే ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఒక రెండు నిమిషాలు జుట్టు కి తల కి మొత్తం స్ప్రే చేసి మెల్లగా జుట్టు మొత్తానికి చేసేసాడు. ఆ తర్వాత వాడి దెగ్గర ఉన్న దువ్వెన తీసుకొని మధ్య పాపిట తీసి రెండు భాగాలుగా చేసి జుట్టు ని రెండు పాయలు గా వెనక వేసాడు. 

ఆ తర్వాత మెల్లగా వేళ్ళతో మర్దన చెయ్యడం మొదలు పెట్టాడు. ఎన్నో చోట్ల మర్దన చేయించుకున్న కానీ రంగడి చేతి మర్దన మాత్రం ఇంక ఎవరికీ రాదబ్బా అనుకుంటూ కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఉన్నాను. మంచిగా ఒక అయిదు నిమిషాలు చేసి ఆపేసాడు. నేను మాత్రం కళ్ళు మూసుకొని అదే లోకం లో ఉన్నాను.

కటింగ్ మొదలు పెడుతున్నట్టున్నాడు అనుకోని తల కిందకి దించుకొని కూర్చున్నాను. వెనుక నుండి చెయ్యి నా తల మధ్య భాగం లో ఉంది. రెండొవ చెయ్యి మాత్రం మెల్లగా కదులుతూ ఉంది. యెర్రని ఎండ లో నా తల మీద చల్లటి గాలి వస్తుంది ఏంటా అని అనుకుంటూ అంతే కూర్చున్నాను. ఆ చల్లని గాలి నా మెడ భాగం వరకు వస్తుంది. ఎదో తేడా అనిపించి తల పైకి లేపి వెనక్కి తిరిగి చూస్తే రంగడి కాళ్ళ దెగ్గర నా జుట్టు మొత్తం ఒక తుట్టె లాగ పడి ఉంది. ఒక్క నిమిషం నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. రంగడి ని ఆగమని చెప్పి నా ఫోన్ ఓపెన్ చేసి అసలు ఎం చెప్పను వీడేం చేస్తున్నాడు అని ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసాను. అందులో నేను చూపించిన రీల్ పోయి ఒక అమ్మాయి మంగలి కుర్చీలో కూర్చొని గుండు గొరిగించుకుంటున్న "బాల్డ్ బ్యూటీ వరల్డ్" పేజీ లో ధీ కనిపించింది. అంతే నేను షాక్ అయిపోయి ఇంక ఏమి చేయలేను అని అర్ధం అయ్యి మెదల కుండా  కూర్చొని మిగతా జుట్టు అంత కూడా గొరిగించేసుకొని నున్నటి బోడి గుండు లో అక్కడ నుండి లేచి నా జుట్టు ని కూడా నా తో పాటే తీసుకొని వెళ్ళాను. 

జరిగిన విషయం చెప్తే ఇంట్లో వాళ్ళతో పాటు, నా ఫ్రెండ్స్ కూడా పడి పడి మరీ నవ్వేశారు.



You May Also Like

0 Comments