జుట్టు సుందరి దిషా నున్నటి బోడి గుండు

by - August 06, 2018

దిషా - మన ప్రపంచానికి బాగా తెలిసిన పేరు. తన పొడవాటి కురులతో ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది  యువతీ యువకులకు మతి పోగొట్టిన ముద్దుగుమ్మ. తను చాలా హెయిర్ స్టైల్స్ తో దిగిన పిక్స్ మాత్రం అద్భుతం. అలా ఉండగా ఒక రోజు సడన్ గా నున్నటి బోడి గుండు లో ఒక పిక్ పోస్ట్ చేసింది. నేను అయితే అదేదో ప్రాంక్ అనుకోని అనుకున్నాను. కానీ తన ముందర పిక్స్ చూస్తే వాళ్ళ అమ్మ గారితో తిరుమల లో తాను దిగిన పిక్స్ ఉన్నాయి. ఇంకొక పిక్ లో అయితే కింద రాసింది కూడా "చివరి సారి పూలతో" అని.

అది చూసాక కంఫర్మ్ అయ్యాను తను నిజం గానే గుండు చేపించింది అని. ఆ రోజు ఫేస్బుక్ లో చూస్తే ట్రెండింగ్ లో మొత్తం తానే. బహుశా బాహుబలి రిలీజ్ అయినా కొత్తలో అది ఎంత ట్రెండింగ్ లో ఉంది అలాగా ఈ పాప గుండు పిక్స్ మరియు వీడియోస్ కూడా అదే రేంజ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి అనుకోండి. అందరూ ఊహకి కూడా అందకుండా అలా పిరుదుల వరకు ఉండే పొడవాటి కురులను నున్నటి గుండు లా చేసేసింది.


కొంప తీసి మొక్కు ఉందేమో అందుకే ఇంకా తప్పక గుండు చేపించిందేమో అని అనుకుంటే ఇంకా షాకింగ్ గా అనిపించినా ఇంకొక విషయం ఏంటి అంటే "ఏదో సరదాకి గుండు గొరిగించేసింది అంట". తన గుండు వీడియో ని ఇన్స్టా లైవ్  లో కూడా పెట్టింది. అంత పొడవాటి జుట్టు ఎలా వస్తుంది అని ఆ మంగళావిడ కూడా దిషా వాళ్ళ అమ్మ గారిని అడగడం అనేది కేక అసలు.

గుండు గొరిగేముందు తన జుట్టు తో వేసిన జడ ముడులను చూస్తే రెండు వైపులా రెండు క్రికెట్ బాల్స్ లాగా వేలాడుతున్నాయి. పూర్తి వీడియో అనేది ఎక్కడ దొరకలేదు కానీ ఒక నాలుగు నిమిషాల విడిది మాత్రం ఈ క్రింద వీడియో లో ఉన్నదీ. ఇప్పటికే చాలా మంది దీనిని చూసే ఉంటారు. కాకపోతే మరి ఒకసారి ఈ జుట్టు సుందరి కాస్త బోడి గుండు సున్దరి గా మారడం చూసి తరించండి.


You May Also Like

0 Comments