రవి - పూజ ఒక బోడి గుండు కథ - పార్ట్ 4

by - September 25, 2018

అలా ప్రియ అనే సరికి అందరం షాక్ అయ్యాము. అక్క కి ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. వెంటనే సంజన అక్క తో "నాకు ఎలాగు సగం గుండు నున్నగా గొరిగారు కదా. ఈ లోపు నేను కష్టహ రిలాక్స్ అవుతూ ఉంటాను మీరు ఆవిడకి గుండు గొరిగేసి పంపించేయండి. ఆవిడకి పాపం అర్జెంటు అనుకుంటా" అని చెప్పింది.

వెంటనే ప్రియ సంజన వంక చూసి "థాంక్స్" అని చెప్పింది. మెల్లగా ఆ కుర్చీలోనే కూర్చొని ఉంది, సంజన ఏమో ఆ తెల్లటి గుడ్డ లో నుండి తన చేతులని బయటకి తీసుకొని కుడి చేతితో తన తల మీద నున్నగా గొరిగిన ప్రదేశం లో టచ్ చేసింది. తనకి ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. తన మొహం లో అది కనపడుతుంది. మెల్లగా ఆ గుడ్డ మీద ఉన్న తన నల్లటి కురులని చేతిలోకి తీసుకొని సృసిస్తూ ఉంది. తన కళ్ళలో నీళ్లు తిరిగాయి కానీ ఆ నున్నటి అనుభూతి వాటిని రానివ్వ లేదు.

అక్క ఈ లోపు ఇంకొక తెల్లటి గుడ్డ తీసుకొని ప్రియ దెగ్గర కి వచ్చింది. ప్రియ తన తల మీద చెయ్యి వేసుకొని చివరి సారి జుట్టు ని తడుముకుంటూ ఉంది. నేను మెల్లగా సంజన గుండు మీదకి తీసుకొని వెళ్ళాను మొబైల్ ని. వీడియో లో మెల్లగా తన పాపిట నుండి వెనుకకు తీసుకొని వచ్చాను. వీడియో లో కూడా తెల్లటి గుండు మిల మిల మెరిసిపోతుంది అనుకోండి. తన కాళ్ళ ఆ మెరుపు చూస్తే నాకు కూడా ఆమె అర గుండు మీద చెయ్యి వేసి తడమాలని ఉంది కానీ తడమలేని పరిస్థితి.

ఈ లోపు సంజన నా వంక చూసి ఏదో నా మనసు చదివినట్టు 'ఒక్క సారి నా గుండు నున్నగా వచ్చిందో లేదో చూడరా అని అడిగింది'. నాకు షాకింగ్ గా అనిపించింది. ఇదేంటి అబ్బా "కొంప తీసి నా మనసుని చదివిందా ఏంటి?" అనే క్వశ్చన్ మార్క్ మైండ్ లోకి వచ్చింది. కానీ నా మనసు మాత్రం 'హా తొక్క లే. ఇప్పుడు అవి అన్ని ఎందుకు ఆ నున్నటి మరియు మిల మిల మెరిసే గుండు ని' తడిమితే చాలు అని నా చేతితో మెల్లగా ఆ మెత్తటి గుండు ని తాకగానే నాకు ఎక్కడో కొట్టినట్టు అనిపించింది. అప్పుడు అర్ధం అయ్యింది తాను ఎంత మంచి అనుభవవిస్తుందో.

ప్రియ మా ఇద్దరి వంక చూసి 'మీరు మీరు తడుముకుంది చాలు లే కానీ నాకు కూడా కాస్త వీడియో తీసేది ఎమన్నా ఉందా?' అని అడిగింది. సంజన మరియు నేను నవ్వుకున్నాం. వెంటనే ప్రియ వెనుకకి వెళ్ళాను వీడియో తీయడానికి అని.

అక్క ప్రియ మీద చుట్టూరా ఆ గుడ్డ ని కట్టింది. అక్క ప్రియ ని అడగకుండా ప్రియ జడ ని విప్పడానికి వెనుకకి వెళ్ళింది. ప్రియ అంతే చూస్తూ ఉంది. వెనుక తన జడ ని గుడ్డ లో నుండి బయటకి తీసి తన బుల్లి జడ కి ఉన్న బ్యాండ్ తీయబోయింది. వెంటనే ప్రియ 'ఆగండి??? ఏమి చేస్తున్నారు?" అని అరిచింది.

అక్క, నేను మరియు సంజన అందరం ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాము. అక్క అడిగింది "ఏమైంది?" అని. అప్పుడు ప్రియ చెప్పింది సిగ్గుతో తల దించుకొని "నాకు కూడా నాకు నచినట్టే చేయండి".

అక్క కి కొంచెం డౌట్ వచ్చింది అనమాట. తనకి నచ్చినట్టు అంటే సంజన కి చేసినట్టే నెమో అని. ఎలా చేయాలో చెప్తే అలానే చేస్తాను అని అనింది అక్క.

ప్రియ - 'నాకు ఇలానే చేసేయండి. కాకపోతే జుట్టు మొత్తం మెత్తగా తడిపి నున్నగా గొరగండి'.

అక్క మనసులో - అబ్బో పర్లేదే. పెద్ద పని పెట్టకుండా మంచి పని చేసింది ఈ అమ్మాయి.

అక్క మెల్లగా స్ప్రే బాటిల్ తీసుకొని తల ని తడపడం మొదలు పెట్టింది. తల మీద మొత్తం స్ప్రే చేస్తూ ఉంటె ప్రియ కళ్ళు మూసుకొని ఆ తుంపర్ల కి ఏదో చల్లటి అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంది. నేను మెల్లగా కెమెరా ని తన ఫేస్ మీద  ఫోకస్ చేశాను. భలే అనిపించింది అలా తనని చూస్తే. హెయిర్ కట్ అప్పుడు కూడా ఇలానే స్ప్రే చేస్తారు కానీ గుండు లో స్ప్రే చేస్తుంటే అనుభవం వేరు గా ఉంటుందేమో అని. ప్రియ మెల్లగా ఇలా అనింది "హెయిర్ కట్ అప్పుడు ఇలా చేస్తే అంత లాగా అనిపించేది కాదు కానీ గుండు అన గానే ఏదో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది" అని కళ్ళు మూసుకొని చెప్పింది.

ఆ మాట వినగానే నేను ఒక్క సారి షాక్ అయ్యాను. నా మనసులోని మాట ని ఎలా తనకి తెలిసిందా అని. కాకపోతే ఆమె నోటి వింటేనే భలే అనిపించింది

అక్క తన తలని మొత్తం నీటితో బాగా తడిపేసింది స్ప్రే చేస్తూ. స్ప్రే బాటిల్ పక్కన పెట్టి ఇంకొక బ్లేడ్ ముక్క తీసుకొని ఇప్పటి వరకు గొరిగిన మంగలి కత్తి లో ఉన్న బ్లేడ్ ముక్క ని తీసేసి తన చేతిలో ఉన్న కొత్త బ్లేడ్ ముక్క ని వేసింది అక్క. వేయబోయే ముందు స్ప్రే బాటిల్ తో కడిగి కొంచెం డెటాల్ వేసి కాస్త మంచిగా కడిగి అప్పుడే బ్లేడ్ ని వేసింది. ప్రియ తన తలలో నుండి కారుతున్న నీటిని తన చేతులతో తుడుచుకుంది. సంజన కి అలా అక్కడ కూర్చొని అద్దం లో చూడడం బోర్ కొట్టిందేమో ఆ మంగలి చైర్ లో నుండి లేచి ప్రియ దెగ్గరికి వచ్చింది.

అక్క ప్రియ వెనుకకు వచ్చి తన ఎడమ చేతితో ప్రియ నుదురు మీద పెట్టి నీటిని కొంచెం తుడిచి మంగలి కత్తి ని పాపిట దెగ్గర పెట్టి తలని కొంచెం వెనుకకి వంచి మెల్లగా గొరగడం మొదలు పెట్టింది. ప్రియ పాపిట తీయకుండా జడ వేసుకునే సరికి ఆ మంగలి కత్తి నుదురు దెగ్గర మధ్య భాగం నుండి కరెక్ట్ గా తల కి మధ్యలో తెల్లటి దారి లాగా ఏర్పడింది. ఇంకొక మూడు సార్లు అలా మంగలి కత్తి తో లాగే సరికి ప్రియ తల మీద నల్లటి ఎడారి లో తెల్లటి రహదారి లాగా కనపడుతుంది. సంజన దానిని చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది. సంజన ఏముంది లెండి అక్కడ ఉన్న నలుగురం ఆడవాళ్ళం భలే గా ఎంజాయ్ చేస్తున్నాం ఈ గుండు ల ప్రోగ్రాం ని.

ఆ రహదారి ని నడి నెత్తి నుండి  అలా వెనుకకి లాగుదాం అనుకునే సరికి ప్రియ అక్క ని ఆపేసి "అలా వెనుకకు గొరగవద్దు. ముందు ముందర భాగాన్ని నున్నగా గొరిగి ఆ తర్వాత వెనుక భాగం గోరగండి. చివరగా నా జడ నా వడిలో పడాలి" అని అడిగింది.

అక్క మళ్ళీ కత్తి ని నుదురు భాగం నుండే మొదలు పెట్టి మెల్లగా గొరగడం మొదలు పెట్టింది. అలా ఒక అయిదు నిమిషాలలో ప్రియ ముందర భాగం మొత్తం నున్నగా అయిపోయింది. ప్రియ మెల్లగా చేతులు బయటకి తీసి తన గుండు మీద పెట్టుకొని "భలే ఉంది అండి గుండు. బాగా గీస్తున్నారు. నున్నగా కూడా ఉంది".

అక్క - ఇంకొక పది నిమిషాలు ఆగితే నున్నగా మెరిసే గుండు తో ఆడుకోవచ్చు మీరు అని చెప్పి తన గుండు మీద రుద్దినది.

సంజన కి కూడా ప్రియ గుండు ని రుద్దుదాం అనిపించి మెల్లగా తన చేతులతో ఆ నున్నటి మరియు మెరిసేటి సగం గుండు ని రుద్దడం మొదలు పెట్టింది. ప్రియ కళ్ళు మూసుకొని అలా రుద్దు తు ఉంది ఎంజాయ్ చేస్తుంది. అది తన మొహం కొట్టొచ్చినట్టు తెలుస్తుంది.

అక్క ప్రియ తలని కిందకి వంచి వెనుక భాగం గొరగడం మొదలు పెట్టింది. "సర్ సర్ సర్" మనే శబ్దం బాగా వినపడుతుంది అందరికి. అలా మెల్లగా గొరుగుతూ మెడ భాగం దెగ్గరికి వెళ్ళగానే ప్రియ కి చక్కిలి గిలి పుట్టి మెలి తిరుగుతుంది. అక్క వెంటనే "కదలకు పాప.  నువ్వు ఇలా కదిలితే నున్నటి గుండు కి గాట్లు పడతాయి. ఒక్క రెండు నిమిషాలు ఓపిక పట్టు అయిపోతుంది".

ప్రియ - "భలే చక్కిలి గిలి వేస్తుంది అండి నాకు. ఆమ్మో నాకు నున్నటి బోడి గుండు మాత్రమే కావాలి. గాట్లు ఉన్న గుండు వద్దు. నేను అసలు కదలకుండా కూర్చుంటాను అని చెప్పింది".

ఒక్క రెండు నిమిషాలలో అప్పటి వరకు బరువుతో వేలాడుతున్న ప్రియ వొత్తు అయిన జడ కాస్త మెల్లగా తల నుండి వేరు అయ్యి జారుకుంటూ ప్రియ వడిలో పడింది. ప్రియ వెంటనే దానిని తీసుకొని అంతే చూస్తూ ఉండింది. ఈ లోపు అక్క మెల్లగా గుండు ని మొత్తం నున్నగా గొరిగేసింది.

ప్రియ సంజన వంక చూసి - "ఒసేయ్ సంజు. నా జుట్టు ఇంత ఒత్తుగా ఉంది అని ఎప్పుడు అనుకోలేదే. నా జడ ని నా చేతిలో చూసుకున్నాక తెలిసిందే ఎంత మంచి జుట్టు ఓ నాది అని"

సంజన - "ఒసేయ్ నీకు ఎన్ని సార్లు చెప్పనే నేను. నీది కూడా సూపర్ థిక్ జుట్టు అని. నువ్వు ఎప్పుడైనా నా మాట వింటే కదా. అది పక్కన పెడితే నువ్వు భలే ఉన్నావే ఇలా నున్నటి బోడి గుండు లో. సెక్సీ గా ఉన్నావు పాప".

ప్రియ - 'థాంక్స్ బేబీ. నువ్వు కూడా భలే సెక్సీ గా ఉన్నావే అరగుండు లో అని కన్ను కొట్టింది'.

సంజన - 'అక్క నాకు కూడా మిగతాది గొరిగేయండి. ప్రియ ని ఇలా చూస్తూ ఉంటే నేను నా నున్నటి గుండు తో ఎప్పుడు ఆడుకుంటానా మరియు ఎలా ఉంటానా అనేది చూసుకోవాలని ఉంది అని'.

అక్క సరే అని ప్రియ గుండు ని ఆపేసి మంగలి కత్తి లోకి ఇంకొక బ్లేడ్ ముక్క ని పెట్టేసి సంజన ని కూర్చోమని చెప్పింది. వెంటనే సంజన చైర్ లో కూర్చుంది. అక్క మెల్లగా గొరిగేయబోయే సరికి ప్రియ "ఏంటి అలానే గొరిగించుకుంటున్నావా సంజు ".

సంజన వెంటనే - 'హయ్యో న మతి మండ. నాకు మిగతా జుట్టుని ఫుల్ గా వాటర్ తో తడిపి  అలా తడిచిన జుట్టు ని నున్నగా గొరిగేయండి. కాకపోతే ముందర వెనుక భాగాన్ని గొరిగేసి చివరగా ముందర భాగానికి రండి అని చెప్పింది".

అక్క వెంటనే స్ప్రే బాటిల్ తీసుకొని ఆ జుట్టు ని మొత్తం తడిపేసింది. జుట్టు ని మొత్తం రెండు భాగాలుగా చేసింది. దువ్వెన తో నడి నెత్తి మీద నుండి ఒక పార్టిషన్ లాగా చేసి ముందర జుట్టుని ముందుకు వేసింది. వెనుక జుట్టు ని వెనుకనే ఉంచి మంగలి కత్తి ని తీసుకొని వెనుక భాగం గొరగడం మొదలు పెట్టింది. అలా గొరిగిన జుట్టు అక్క కాలి మీద పడుతూ ఉంది. ఒక రెండు నిమిషాలలో వెనుక భాగం కూడా నున్నగా అయిపోయింది. ఇంకా మిగిలింది ముందర భాగం. వెంటనే అక్క ఎడమ పక్క ముందుకి వచ్చి సంజన తల ని ముందరకి వంచి నడి నెత్తి నుండి మొదలు పెట్టి ముందరకి గొరుగుతూ ఉంది. నేను తెలివిగా కెమెరా ని సంజన వడిలో తన మొహం కనిపడే విధం గా పెట్టాను. నాకు వీడియో ఎలా వస్తుంది తెలీదు కానీ అలా జుట్టు కిందకి రాలుతూ ఉంటే మాత్రం భలే అనిపించింది. అలా రెండే రెండు నిమిషాలలో మొత్తం నున్నగా అయిపోయింది సంజన తల కూడా.

అలా మన ఇద్దరు ఫ్రెండ్స్ కి నున్నగా బోడి గుండు అయ్యింది. ఆ తర్వాత ఏమవుతుంది అనేది తరువాయి భాగం వరకు ఆగాల్సిందే. 

You May Also Like

0 Comments