సురేఖ వాణి గుండు మొక్కు

by - October 09, 2018

తెలుగు సినీప్రేక్షకులకి బాగా సుపరిచితమయిన పేరు "సురేఖ వాణి". సినిమా లో నడి వయస్కురాలి పాత్రలలో మన అందరిని తన నటనతో మెప్పించిన నటి ఆవిడ. తన అభినయం తో పాటు తన అందాన్ని కూడా పెంచుకుంటూ వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదయిన స్థానాన్ని సంపాదించుకొని తెలుగు ప్రెకషకులని నవ్వుల ప్రపంచం లో ముంచుతూ ఉంది. "బాద్ షా" చిత్రం లో బ్రహ్మానందానికి భార్య పాత్ర మన అందరికి గుర్తుంది పోయేది.

అందరూ ఆవిడ అందాలని ఆస్వాదిస్తారు అయితే మనలాంటి "జుట్టు ప్రేమికులు" మాత్రం ఆవిడ జుట్టు ని చూస్తూ ఆనంద పడతారు. ఆవిడ కురులు ఆవిడకి ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఆవిడ జుట్టు మారి బారుగా ఉండకపోయినా మాంచి స్మూత్ అండ్ సిల్కీ గా ఉంటది. అయితే మధ్యలో కొన్ని రోజులు ఆవిడ సినిమాలలో ఆక్ట్ చేయలేదు. అయితే అందరూ బహుశా ఆవిడకి అవకాశాలు లేక ఆలా జరిగిందేమో అని అనుకున్నారు కానీ అసలు విషయాన్నీ ఒక ఇంటర్వ్యూ లో బయట పెట్టింది.

ఆవిడ మాటలలోనే విందాము (కొంచెం కైపు గా ఉండడానికి ఆవిడ మాటలని మనకి నచ్చిన విధము గా మార్చి రాస్తున్నాను తప్పుగా అనుకోకండి).


"నాది మా వారిది లవ్ మ్యారేజ్ అండి.  మా పెళ్లి అంత బాగా జరిగితే నేను వెంకన్న సన్నిధికి వచ్చి గుండు చేపించుకుంటాను అని మొక్కుకున్నాను. అయితే మొదటి రెండు మూడు సంవత్సరాలలో నాకు అంత గా కుదరలేదు ఆ మొక్కు తీర్చుకోడానికి. అంటే జనాలు రావడం మరియు అదే టైం లో సినిమాలలో వేషాలు పెరగడం. అన్నిటి కారణం గా కుదరలేదు. కాకపోతే ఇంకా ఆ మొక్కుని ఆపడం నాకు ఇష్టం లేక భద్ర రిలీజ్  అయిన టైం లో వెంటనే తిరుమలకి వెళ్లి నున్నగా బోడి గుండు గొరిగించుకొని వచ్చాను. ఒక వేళ నేను కానీ అప్పుడు ఆ గుండు చేపించుకోకుండా ఉన్నట్టు అయితే ఇప్పటికి కూడా అది జరిగేది కాదేమో. అందుకే మీరు చూసినట్టు అయితే స్టాలిన్ సినిమా లో నాది పొట్టి జుట్టు ఉంటది. అందరికి నేనేదో జుట్టు కత్తెరించుకున్నానేమో అని అనుకున్నారు కానీ అసలు విషయం ఇదే అండి".

You May Also Like

0 Comments