మొదటి గుండు by Pragna

by - December 18, 2019

నా పేరు వెంకీ. మంగలి కుటుంబం లో పుట్టాను అనే కానీ మంగలి పని మాత్రం నేర్చుకోకుండా మంచిగా చదువుకుంటూ ఊరిలో అమ్మ వాళ్ళతోనే పెరిగాను. మంచి మార్కులతో నా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బ్రతుకు తెరువుకోసం అని హైదరాబాద్ లో అడుగుపెట్టాను. నా అదృష్టమో ఏంటో తెలీదు కానీ సాఫ్ట్వేర్ లో రెసెషన్ వచ్చి కొత్త ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలనే తీసేసే రోజులు అవి. ఇంట్లో వాళ్ళకేమో ఇక్కడ పరిస్థితి చెప్పి బాధ పెట్టలేను అలా అని ఖాళీగా కూర్చొని డబ్బులు పంపించమని అడగలేను. ఏదో ఒకటి చేయాలి అనే దానితో మనసులో దృఢం గ ఉండే. ఇలా ఉండగా ఒక రోజు పొద్దునే లేచి టిఫిన్ చేసాక గెడ్డం చేపించుకుందాం అని దెగ్గరలో ఉన్న మంగలి షాప్ కి వెళ్ళుండే. అక్కడ ఫుల్ రష్ ఉంది. ఒక్కడే మంగలోడు ఉన్నాడు.  ఒక నలభయ్ నిమిషాలు పట్టింది నా వంతు వచ్చే సరికి. కొంచెం రద్దీ తగ్గింది నా తర్వాత. నాకు గెడ్డం చేసేప్పుడు మాటలలో మధ్యలో అడిగాను "ఏంది అన్న ఇంత రష్ ఉంది పైగా ఒక్కడివే ఉన్నావు? మీ వాళ్ళు లేరా?"

ఎండాకాలం కదా కొద్దిగా రష్ ఎక్కువగానే ఉంటది. ఇక మా వాళ్ళు అంటావా వాడికి ఒక చిన్న ఆపరేషన్ అయ్యింది. వాడు రావడానికి ఒక రెండు నెలలు పడుతుంది. నేను ఒక్కడినే చూసుకుంటున్నాను ఇప్పటికి అయితే. వేరే వాళ్ళని వెతుకోవాలి అని అన్నాడు. సడన్ గా నా బుర్రలో ఒక ఆలోచన తట్టింది (మీ అందరికి తట్టిన ఆలోచననే లెండి). వెంటనే అడిగాను "అన్న నాకు మంగలి పని వచ్చు. నేను కూడా మన కులపు వాడినే. నీకు అభ్యంతరం లేకపోతే నేను మీకు సహాయం చేస్తాను".
"నాకెలాంటి అభ్యంతరం లేదు బాబు. కాకపోతే నువ్వేమో మంచిగా చదువుకొని ఉన్నట్లు ఉన్నావు. ఇక్కడ నేను ఇచ్చే చాలీ చాలని డబ్బులతో ఇబ్బంది నీకెందుకు అని".

అయ్యో అలా ఏమి లేదు అన్న. నేను నీ దెగ్గర పని చేసుకుంటూనే ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకంటూ ఉంటాను అని చెప్పి ఆ తర్వాత రోజు నుండి ఆయన దెగ్గర పనికి వెళ్లడం మొదలు పెట్టాను. మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం వరకు నాకు బ్రేక్ టైం.

అలా మొదలు పెట్టిన మొదట్లో నాకు దేగ్గలు గొరిగే ఛాన్స్ మాత్రమే ఇచ్చారు. కొన్ని రోజులకి చిన్న పిల్లలకి డిప్ప కటింగ్ చేసే అవకాశం దొరికింది. మెల్లగా హెయిర్ కట్స్ కూడా అలవాటు చేసేసుకున్నాను ఒక ఇరవై రోజులలో.  మంచిగానే చేస్తున్నాను అక్కడ అన్న కి కూడా నా పనితనం తో నా మంచితనం కూడా నచ్చింది. ఒక రోజు అన్న కి ఊరు వెళ్లాల్సిన పని పడే సరికి తాళాలు మొత్తం నాకే అప్ప చెప్పి ఊరికి వెళ్ళాడు. ఆ రోజు పొద్దున్న నుండి గిరాకీ కూడా పెద్దగా లేదు. పదకొండు దాటుతుంది సరే లే అని నేను సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నాను. ఈ లోపు ఎవరో వచ్చిన శబ్దం వచ్చింది. నేను తలుపు వైపు చూస్తే ఒక ఆవిడ వాళ్ళ పాప ని తీసుకొని వచ్చింది.
నేను లేచి ఆమె వంక చూసాను. ఆమె నా వంక ఏదో తేడా గ చూసి 'అన్న లేడా?'అని అడిగింది.

"లేడు అంది. ఊరికి వెళ్ళాడు. ఒక రెండు రోజులలో వస్తాడు"

అవునా. కనుక్కొని రావాల్సిందే అని మెల్లగా అనింది.

నేను వెంటనే "నేను చేస్తాను అండి పర్లేదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు".

అంటే పాప కి. కొంచెం మొండి చేస్తుంది.

పర్లేదు అండి. నేను ముందర పిల్లలకే చేసే వాడిని. ఎలాగూ ఎవరు లేరు కూడా. మెల్లగానే చేద్దాం ఎంత సమయం పట్టిన.

మెల్లగా లోపలకి వచ్చి ఆ పాప ని మంగలి కుర్చీలో కూర్చో పెట్టింది. ఆ పాప ఏమో ఒక్క చోట కూర్చోదాయె. నేను తెల్ల గుడ్డ తీసుకుందాం అనుకునే లోపలనే ఆ కుర్చీలో నుండి లేచి ఎదురుగా ఉన్న కత్తెరలని లాక్కోడానికి ట్రై చేసింది. వెంటనే ఆవిడ పట్టుకొని మల్లి కూర్చో పెట్టింది. సరే అని గుడ్డ కట్టి నేను కత్తెర తీసుకునే లోపలనే చేతులు బయటకి తీసుకొని ఆ గుడ్డ ని తీసేస్తుంది. నేను చూసే లోపల ఆ పాప తన తలలో చేతులు పెట్టుకొని తెగ గీరేసుకుంటూ ఉంది. ఆవిడ వచ్చి తన చేతులని తీయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఏదో ఒక లాగా కదులుతూనే ఉంది అనుకోండి. నేను స్ప్రేయర్ తీసుకొని వచ్చాను కానీ తాను మాత్రం కదులుతూనే ఉంది. నాకు కొంచెం ఇబ్బంది గా అనిపిస్తుంది. ఆవిడకి అర్ధం అయ్యి "ఒక్క నిమిషం లాగండి అని చెప్పి పాప మెడ కి ఉన్న గుడ్డ ని తీసేసి తాను కుర్చీలో కూర్చొని" ఆవిడ వడిలో కూర్చోపెట్టుకొని కూర్చుంది.
నాకు అర్ధం కాలేదు. అప్పటి వరకు డిప్ప కటింగ్ లు చేశాను కానీ ఎప్పుడు ఇలా వడిలో కూర్చోపెట్టుకొని మరి చేయించలేదు. ఆవిడ నా వంక చూస్తూ "ఇది మాకు ఎప్పుడు ఉండేదే లే కానీ. అందుకే అన్న ఉన్నాడా" అని అడిగింది.

వెంటనే నేను "హయ్యో నేను చెయ్యగలను అండి". మీరేం భయపడాల్సిన అవసరం లేదు అండి.

నేను మెల్లగా గుడ్డ తీసుకొని ఆ పాప మెడ కి చూడడం అనుకుంటే కత్తెరించిన జుట్టు ఆవిడ వడిలో పడుతుంది కదా అని చెప్పి ఆవిడ వంక చూసాను. ఆవిడ వెంటనే తనకి కట్టమని చెప్పింది. పాప ఏమో విమానం ఆట ఆడుకుంటూ ఉంది చేతిలో ఉన్న పేపర్ రాకెట్ తో.

 నేను తనకి గుడ్డ కట్టి మెల్లగా ఆ పాప కి కూడా కట్టాను. తన వడిలో ఆడుకోడానికి చూస్తుంది లే కానీ పాప ని గట్టిగా పట్టుకుంది. నేను స్ప్రేయర్ తీసుకొని ఆ పాప జుట్టు లో కొట్టి దువ్వెన తో దువ్వుతూ ఉంటే ఆ పాప చిరాకు పడుతుంది.  నేను తన జుట్టులో దువ్వెన పెట్టి పాపిట తీస్తూ ఉంటే తలలో పేల తుట్టె కనపడింది. ఆమె వంక చూసి ఇదిగోండి ఇన్ని పేలు ఉంటే ఆమెకి చిరాకు కాక ఏమొస్తుంది. ఇంతకీ ఎలాంటి కట్ చేయాలో చెప్పనే లేదు.

ఎప్పుడు అయితే బేబీ కటింగ్ చేపించే దానిని అండి. కటింగ్ చేపించి కూడా ఒక ఎనిమిది నెలలు అవుతుంది. అందుకే జుట్టు పెరిగిపోయే సరికి చిరాకు పడుతుంది. డిప్ప కటింగ్ చేపిద్దాం అని అనుకుంటున్నాను అండి.

నేను దువ్వెనతో దువ్వుతూ చూసి వేళ్ళతో ఒక సరి తలలో పెడితే పేలు మరి ఎక్కువ పెరిగాయి అని అర్ధం అయ్యింది. వెంటనే ఆమె వంక చూసి పాప కి పేలు బాగా పెరిగిపోయాయి అండి. ఇప్పుడు డిప్ప కటింగ్ కంటే గుండు చేపించేస్తే ఇబ్బంది ఉండదు అండి పాప కి. నేను చెప్పిన దానికి ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంది ఆవిడ. నేను వెంటనే "మీకు ఇబ్బంది అనుకుంటే వద్దు లెండి డిప్ప కటింగ్ చేస్తాను ఈ సారికి".
ఆవిడ వెంటనే అయ్యో అలా కాదు అండి. కటింగ్ కె కష్టం గా ఉంటుంది ఇది. గుండు అంటే కదలకుండా ఉంటుందా అని. సరే పర్లేదు లెండి నేను జాగ్రత్తగా పట్టుకుంటాను. మీరు గొరగండి అని పాప ని గెడ్డం కింద ఒక చెయ్యి పెట్టి పట్టుకొని కూర్చుంది. నేను వెంటనే మంగలి కత్తి తీసుకొని పాప నడి నెత్తి మీద మెల్లగా ముందుకి లాగాను. మొదట గీసిన గీకుడుకి పాపకి ఏమి అర్ధం కాలేదు కానీ చక్కిలిగింత పెట్టిన్నట్టు ఉంది కొంచెం అలా జర్క్ ఇచ్చింది. మెల్లగా అలా గొరుగుతూ ఉన్నాను. ఆ గొరుగుడికి పేలు ఎక్కువగా ఉన్న ప్రదేశం లో ఎక్కువ గా లాగే సరికి కొంచెం తెగింది. వెంటనే రక్తం రావడం మొదలు అయ్యింది.  పాపకి నొప్పి తగిలి వెంటనే ఏడుపు స్టార్ట్ చేసింది. ఆ ఏడుపుకి ఆవిడ పాప ని మెల్లగా భుజం మీదకి వేసుకుంది.

వెంటనే రక్తం ఆగే లాగా గెడ్డానికి పెట్టేది పెట్టాను. మొదట పాప ఏడ్చినా తర్వాత చల్లగా ఉండే సరికి మెదలకుండా ఉంది. ఆవిడ ఆ పాప ని వొళ్ళో నుంచోపెట్టుకొని ఉంది. ఆ పాప మెల్లగా ఆడుకుంటూ ఉంది. నేను మెల్లగా పాప ఉన్న పక్కకి కాకుండా ఆవిడ వేరే పక్కకి వెళ్లి నుంచున్నాను. ఆవిడ వంక చూసాను "మీరు కానివ్వండి అని ఆవిడ సైగ చేసింది..."మెల్లగా మిగతాది అంత గొరుగుతూ వెళ్తున్నాను. సడన్ గా ఆ పాప కొంచెం కిందకి జరగడం, నా చేతిలో ఉన్న మంగలి కత్తి పక్కకి జారడం, జారిన కత్తి ఆవిడ నడి నెత్తి మీద ఉన్న జుట్టుని గోరడగం అన్ని సెకన్లలో అయిపోయాయి. అంతే ఒక్క సారిగా షాక్ నేను మరియు ఆవిడ.

స్లో మోషన్ లో ఆవిడ అద్దం లో చూసుకుంటూ ఆవిడ చేతితో గొరిగిన ప్రదేశం లో వేలు పెట్టి చూసుకుంది.
ఆవిడకి అర్ధం అయ్యింది. తప్పు ఎవరిది కాదు అని. కాకపోతే ఇప్పుడు చేసేది ఏమి ఉందా అని ఆలోచించాలి కానీ ఏమైంది అనేది ఏమి ఆలోచిస్తాం లే అని నా వంక చూసి "దాని గురుంచి తర్వాత ఆలోచిద్దాం లే కానీ ముందర దానిది అవ్వగొట్టండి అని చెప్పింది". ఇంకా జాగ్రత్తగా మిగిలింది పూర్తి చేశాను. సరే ఆ పాపది అయిపోయింది ఇప్పుడు ఈవిడది చూడాలి అని మనసులో అనుకున్న.

ఆవిడ పాప ని కింద వదిలేసింది. ఆ బుడ్డది నున్నటి బోడి గుండు లో చాలా క్యూట్ గా ఉంది. ఇంక దానిలోకం లో అది ఉంది మమ్మల్ని పట్టించుకోకుండా. నేను మంగలి కత్తి లోని బ్లేడ్ ని తీసేసి డెటాల్ తో కడిగేసాను. ఆవిడ మెల్లగా రెండు చేతులు గుడ్డ లో నుండి తీసి తెగిన ప్రదేశం లో పెట్టుకొని చూసింది. తెగిన జుట్టు ఇంక కింద పడలేదు. ఆవిడది ఒత్తు అయిన జుట్టు పోనీటైల్ లో ఉంది జుట్టు మొత్తం. నేను వెంటనే ఆవిడ వెనకకి వెళ్లి పోనీటైల్ ని విప్పాను బ్యాండ్ తీసేసి. విప్పి మెల్లగా తెగిన ప్రదేశం లోని జుట్టు వరకు లాగాను. అంతే ఒక వెంట్రుకల తుట్ట వచ్చేసింది. నేను కొంచమే గొరిగిందేమో అనుకున్నాను కానీ చాలా ప్రదేశమే ఎగిరిపోయింది.

ఆవిడ ఆ ప్రదేశం చూసుకొని షాక్ అయిపోయింది. చ అదేంటి అండి? అంత జుట్టు తెగింది.

ఏమో అండి. నాకు నిజం గానే తెలియదు ఇంత జుట్టు తెగింది అని.

ఇప్పుడు ఏమి చేద్దాం అండి. ఇది చూస్తే ఎలాంటి హెయిర్ కట్ చేపించినా కూడా కవర్ అయ్యే లాగా అయితే కనపడడం లేదే. ఛ!!! అనవసరం గా వచ్చాను అని మనసులో తిట్టుకుంటూనే అద్దం లో చూసుకుంటూ "ఇంక చేసేది ఏమి లేదు కదా. ఇంక నాకు కూడా గుండే తగలెట్టేయండి" అని అనింది.

మేడం - నిజం గా నేనేం కావాలని చెయ్యలేదు. నా చేతిలో కూడా ఏమి లేదు. మీ పాప కదిలింది తెగుతుందేమో అని నేను మంగలి కత్తిని పక్కకి జరిపాను అది కాస్త మీ తలకి తగులుతుంది మరియు మీ తల మీద వెంట్రుకలు తెగుతాయి అని నేనేమన్నా అనుకుంటాను?
ఆవిడే ఒక రెండు నిముషాలు ఆగి అలోచించి - అది నిజమే లెండి. మీ తప్పేమి లేదు లెండి అని కొంచెం నవ్వుమొహం తెచ్చుకొని (బలవంతము గానే) సరే అండి నాకు కూడా మా పాప లాగా నున్నటి బోడి గుండు చేయండి. ఎలాగూ నాకు కూడా పేల బాధ ఎక్కువగా ఉంది. దాని నుండి నాకు కూడా పాకినట్టు ఉన్నాయి.

నేను వెంటనే స్ప్రే బాటిల్ తీసుకొని ఆవిడ జుట్టుకి స్ప్రే చేయడం మొదలు పెట్టాను. ఆవిడది భుజాల కిందకి దిగే జుట్టే కానీ బాగా ఒత్తు జుట్టు అనుకోండి. బాగా నీళ్లు తల మీద ఉన్నాయి అనుకున్న తర్వాత వెంటనే చేతులతో మసాజ్ చేయడం మొదలు పెట్టాను. మగాడి స్పర్శ తగలగానే తనకి కూడా ఏదో ఒక తెలియని భయం మరియు బెరుకు ఉంది. కానీ నా చేతులతో మసాజ్ చేస్తూ ఉంటే తనకి స్వర్గపు అంచుల దాకా వెళ్ళైన్నట్టు అనిపించింది. ఒక అయిదు నిముషాలు చేసాక నా వేళ్ళని తీసేసి రెండు రబ్బర్ బ్యాండ్ లు తీసుకొని జుట్టుని రెండు భాగాలుగా చేసి రెండు పోనీటైల్స్ లాగా వేసాను.

ఆవిడ అద్దం లో చూసుకొని "ఎప్పుడో స్కూల్ టైం వేసేదానిని అండి ఇలాంటి హెయిర్ స్టైల్. ఆ తర్వాత అంటే మా ఫ్రెండ్ ది స్పిన్స్టర్స్ పార్టీ అంటే అప్పుడే వేసాను ఈ హెయిర్ స్టైల్. ఆ తర్వాత ఎప్పుడు వేయలేదు అండి""

మీకు బాగా నప్పింది అండి ఈ హెయిర్ స్టైల్ అయితే.

థాంక్ యు అండి. అని నేను మంగలి కత్తి ని తీసుకొని పాప కి గుండు కొట్టిన బ్లేడ్ ముక్క లో మిగిలిన సగం బ్లేడ్ ముక్కని తీసుకున్న. దానికి ఉన్న జిల్లెట్ట్ బ్లేడ్ కాగితాన్ని తీసేసి ఆ బ్లేడ్ ముక్కని మంగలి కత్తి లో పెట్టాను. సరిగ్గా ఇరుక్కుందో లేదో అని చెక్ చేసుకున్నాక ఇంక ఆవిడ వెనుకకి వెళ్ళాను. ఆల్రెడీ గొరిగిన ప్రదేశం కనపడుతూనే ఉంది. అక్కడనే మంగలి కత్తి పెట్టి తన ఎడమ చేతి పక్కకి గొరగడం మొదలు పెట్టాను. ఆవిడ నల్లటి కురుల మధ్యన దాగి ఉన్న చందమామ బయటకి వస్తూ ఉంది. ఆవిడ తనకి తెలియకుండానే గుడ్డ లో నుండి మెల్లగా ఎడమ చెయ్యి తీసుకొని గొరిగిన ప్రదేశం లో పెట్టి తాకిన వెంటనే ఏదో షాక్ కొట్టిన్నట్టు అనిపించి చెయ్యి కింద పెట్టేసింది.

నేను దానిని షాక్ "ఆగేనా మేడం?"

ఆవిడ వెంటనే "హయ్యో లేదు అండి". నాకు గుర్తు ఉండి నేను గుండు చేపించింది అంటే నేను మూడవ తరగతి లో ఉన్నప్పుడే అండి. అప్పుడు కూడా నాకేమి గుర్తుకు లేదు అండి. అందుకే మొదటి సారి ఇలా నన్ను నేను చూసుకుంటే భలే వింతగా మరియు ఆశ్చర్యం గా ఉంది.

"ఓ అవునా. మీ బుడ్డదాని గుండు అప్పుడు మీరేమి గుండు చేపించలేదా అండి?"
మా ఇంటి లో ఇలాంటి ఆచారాలు ఏమి లేవు అండి. పాప గుండు అప్పుడు మా వారు చేపించారు కానీ నేనేమి చేపించలేదు అండి. అప్పుడు సగం జుట్టు ఇచ్చేసి వచ్చాను అండి. అప్పటి నుండి ఇంక పోనీ టైల్ హెయిర్ స్టైల్ లోనే వేసుకుంటూ ఉన్నాను అండి.



నేను వింటూ నే ముందర భాగం లో ఉన్న జుట్టు మొత్తం నున్నగా మారిపోయింది. ఆవిడ తనని తానూ చూసి నోరు వెళ్లబెట్టింది. వెంటనే నన్ను ఆపమని సైగ చేసి రెండు చేతులు తీసుకొని గొరగని జుట్టు మీద మరియు గొరిగిన ప్రదేశం లో పెట్టింది చెయ్యి.

"భలే ఉంది అండి. జుట్టు ఉన్నపుడు ఉండే వెచ్చదనం మరియు జుట్టు లేనప్పుడు ఉండే చల్లదనం. అందుకేనేమో అండి గొర్రెలకు బొచ్చు గొరిగాక ఒక పక్క చాలా హాయిగా ఉంటది అంటారు ఇంకొక పక్కనేమో చలికి తట్టుకోలేవు అంటారు.

 "హహహ. అయి ఉండొచ్చు అండి. నాకు వాటితో కూడా పోలుస్తారు అని ఎప్పుడు ఆలోచనే తట్టలేదు అండి".

అది సరే కానీ మీరు ఎప్పుడు గుండు చేపించలేదా మరియు ఎన్ని గుండు లు గొరిగారు ఇప్పటి వరకు?

ఆ ప్రశ్న నేను అనుకోకుండా వచ్చినది ఆమె నోటి నుండి "ఎదురుగా ఉన్న అద్దం లో ఉన్న ఆమె ప్రతిబింబాన్ని చూస్తూ - నాకు ఊహ తెల్సిన అప్పటి నుండి ఎప్పుడు గుండు చేపించలేదు అండి. నేను గొరిగిన మొదటి గుండు మీ బుడ్డదానిదే రెండోది మీదే.

ఆవిడ మొహం లో ఒక తెలియని ఆత్రత మరియు ఆశ్చర్యం రెండు ఒకేసారి కలిగాయి. మొదటి గుండా? అదేంటి మీరు మంగళోల్లె కదా?

"ఓహ్ అలా అడిగారా. నేను చదువుకున్న గ్రాడ్యుయేట్ అండి. ఉద్యోగ ప్రయత్నాల కోసం వచ్చి పొట్టకూటి కోసం ఇక్కడ టైంపాస్ చేసుతున్నాను అని చెప్పి మెల్లగా తన ఎడమ చేతి పక్క వెనుక భాగం లో కూడా మెల్లగా గొరిగేసాను. తడిచిన జుట్టు కనుక మెల్లగా తల నుండి వేరు అయ్యి తెల్లటి గుడ్డ మీద ల్యాండ్ అయ్యింది. ఏదో అదుపు తప్పిన విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది లాగా అనిపించింది ఆవిడకి ఆ జుట్టు తల నుండి రాలిన క్షణం లో. చాలా హాయిగా అనిపించింది. వెంటనే గొరిగిన ప్రదేశాన్ని మొత్తం మంచిగా మరియు నున్న గొరిగేసాను చిన్న చిన్న వెంట్రుకలు కూడా లేకుండా.

అసలు ఘట్టం ఏంటి అంటే - నేను స్ప్రే బాటిల్ తీసుకొని గొరిగిన అర గుండు మీద మరియు మిగిలిన అర జుట్టు మీద కొట్టడం మొదలు పెట్టాను. ఆవిడకి నరాలు జివ్వుమన్నాయి ఒక్క సారిగా అలా కొట్టేసరికి. వెంటనే సీతాకోక చిలుక ముడుచుకు పోయినట్టు ముడుచుకుంది. ఆ చుసిన క్షణం భలే అనిపించింది నాకు. బహుశా ఈమెకి ఇది అంత ఒక తెలియని వింత అనుభూతి లాగా ఉన్నట్టు ఉంది అనుకోని మంచిగా తడిపి గొరిగిన ప్రదేశం లో వేళ్ళతో మర్దన చేశాను. అంతే ఆవిడ కళ్ళు మూసుకొని ఆ అనుభవాన్ని ఆస్వాదించింది.

ఇంక నడి మెత్తి మీద పెట్టి మెల్లగా వెనుక భాగం గొరగడం మొదలు పెట్టాను. ఒక్క చోటు మాత్రం కొంచెం తెగినట్టు అనిపించి "సర్" మనే సరికి ఒక్క సారిగా ఉలిక్కి పడింది.

"సారీ మేడం. పేలు ఎక్కువ గా ఉన్న ప్రదేశం అనమాట అందుకే మీకు అలా కొంచెం మంట అనిపిస్తుంది.

"ఓహ్ అవునా. అదే ఇందాక గొరిగినప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ఇప్పుడు మాత్రమే అలా అనిపించింది లెండి.

నేను మెల్లగా మొత్తం గొరిగేసాను ఒక రెండు నిమిషాలలో అలా. ఆ రెండొవ పోనీ టైల్ కూడా నిర్జీవం గా ఆమె మీద కప్పి ఉన్న గుడ్డ మీద పడిఉన్నాయి. మెల్లగా ఆవిడ తల వంచి మెడ మీద గొరుగుడు మొదలు పెట్టాను. అంతే ఏదో తెలియని చక్కిలిగింతి వలన ఆవిడ మాత్రం భలే ఎంజాయ్ చేసింది అక్కడ గొరిగేప్పుడు. ఆ తరువాత ఆవిడ లేద్దామా అనుకునే సరికి వెంటనే షేవింగ్ ఫోమ్ మరియు షేవింగ్ బ్రష్ తీసుకొని ఆవిడ తల కి రుద్ది మంచిగా మరియు నున్నగా గుండు గొరిగేసాను.

ఆవిడ ఒక నా చేతిలో ఒక అయిదు వందల రూపాయల కాగితం పెట్టి చిల్లర నువ్వే ఉంచుకో అని చెప్పేసి అక్కడ నుండి మెల్లగా వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్లేప్పుడు వాళ్ళ గుండు లలో నుండి వచ్చిన వెలుగుతో మనోడి మధ్యాహ్నం మొదలు అయ్యింది.

అలా నా ప్రస్థానం లో మొదటి గుండు అనే అంఖం ముగిసింది.

You May Also Like

0 Comments