పొట్టి జుట్టు లో నిహారిక కొణిదెల - Haircutting of Niharika Konidela

by - December 26, 2019

నిహారిక కొణిదెల - ఈ పేరు తెలియని చిరంజీవి అభిమాని ఉండదు. మెగా బ్రదర్స్ ఫామిలీ లో హీరోయిన్ గా అరంగేట్రమ్ చేసి తన కంటూ ఒకటైన శైలిలో అభినయం చేస్తున్న ఈ భామ జాలువారే జలపాతాల లాంటి కురులతో ఉండేది. కొద్ది రోజుల క్రితమే తనకి ఎంతో ఇష్టమైన తన జుట్టుని కత్తెరించుకొని పొట్టి జుట్టు తో హల్చల్ చేయడం మొదలు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే చిరంజీవి కుమార్తె అయినా సుస్మిత కొణిదెల సాయం తో తన జుట్టు ని కత్తెరించింది అని సమాచారం.

ఈ కింద వీడియో లో ఆమె జుట్టుని కత్తెరించేప్పుడు ఆమె హావభావాలని మీరు చూడొచ్చు. సలోన్ అతను జుట్టు కత్తెరించేప్పుడు తన అర చేతులలో గుండె ని పెట్టుకొని మరి ఒక పక్క ఆశ్చర్యం తో మరొక పక్క భయం తో కూర్చుంది. మొదలు పెట్టె ముందర మనకి సుస్మిత గొంతు వినపడుతుంది. ఇరవై సెకన్లలో ఆమె వెనుక వేలాడిన పిలకని కత్తెరించేసాడు ఆ మంగలి వాడు. కత్తెరించాక తాను ఆ పిలకని దాచాడు. కానీ ఆమెకి తన జుట్టుని చూసుకోవాలనే కుతూహలం తో వెంటనే "చూపించు చూపించి" అని పట్టు పట్టుకొని మరి కూర్చుంది.

మంగలి వాడు తన చేతిలో తన పిలకని పెట్టగానే తన ఊపిరి అయినంత పని అయింది. ఎంతో ప్రేమ గా ఆ జుట్టుకి ముద్దు పెట్టడమే కాకుండా ఆ తర్వాత దానితో ఆడుకోడం కూడా మొదలు పెట్టింది. ఎప్పుడు అయితే తన భుజాలు దిగిన జుట్టుని ముందుకి సరి చేసాడో మొదటి సరి తనని తాను అలా పొట్టి జుట్టు లో చూసుకొని సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యింది. వెంటనే తన చేతులతో తన పొట్టి జుట్టుని తడుముకొని "నోరు మీద చేతులు వేసుకుంది".  మేక్ ఓవర్ మొత్తం అవ్వగానే తనని తాను చూసుకొని "అయ్ అయ్ అయ్ యో..." అనే శబ్దం చేసింది.

కత్తెరించేప్పుడు ఎంత బాధ ఉన్న ఆ తర్వాత మాత్రం ఆ పొట్టి జుట్టు తాను చేసిన హడావిడి అంత ఇంత కాదు. కొత్త ఫోటోషూట్స్ తో పాటు గా తన ఇష్ట ఫీడ్ లో వెరైటీ షార్ట్ హెయిర్ స్టైల్స్ తో కూడా చింపేసింది... 


You May Also Like

0 Comments