actress haircutbollywood actress haircutradhika apte hairradhika apte haircutradhika apte short hairtelugu gundu kathalutelugu headshave stories
బాలీవుడ్ యాక్ట్రెస్ రాధికా ఆప్టే సొంత హెయిర్ కట్
రాధికా ఆప్టే - సినీ ప్రపంచం లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రక్త చరిత్ర సినిమా తో తెలుగు వారికి పరిచయం ఆ ఆరణాల తెలుగు భామ తరువాత తనదైన శైలిలో బోల్డ్ గా మూవీస్ చేస్తూ సెక్స్ బాంబు గా మారింది అనే చెప్పుకోవచ్చు. బ్రా స్ట్రాప్ లెంగ్త్ లో ఎప్పుడు జుట్టు ఉంచుకునే ఈ భామ గత ఏడాది లాంగ్ బాబ్ హెయిర్ కట్ లో దర్శనం ఇచ్చింది.
కరోనా పుణ్యమా అని చాలా మంది ఆడవాళ్ళూ ఇళ్లలోనే జుట్టు కత్తెరించుకుంటూ కనిపిస్తున్నారు. కొందరు అయితే వాళ్ళ పిల్లలకి మరియు మొగుడికి క్రాఫ్ అని మొదలు పెట్టి గుండు గొరిగేస్తున్నారు. వాళ్లకి తీసిపోకుండా సినిమా హీరోయిన్స్ కూడా వాళ్ళదైనా శైలిలో సొంత గా హెయిర్ కట్ చేసుకుంటున్నారు. ఆ కోవకి చెందినదే మన రాధికా ఆప్టే కూడా. ఇటీవలే ఆమె లండన్ లోని తన భర్త దెగ్గరికి చేరుకుంది.
కొద్ది రోజులుగా లాక్ డౌన్ కారణం గా డైలీ మైంటైన్ చేసేది ఉండడం లేనందున తన జుట్టు కూడా బాగానే పెరిగింది. పెరగడమే కాకుండా తనకి దానిని కత్తెరించే సమయం అయ్యింది అని ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీనే అనిపించింది ఏమో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది "టైం టు చాప్ ఇట్ ఆఫ్" అని. సరదాకి ఏమో అనుకున్నాం కానీ తానూ అది నిజాన్ని చేసింది నిన్న. ఉదయాన్నే ఒక పోస్ట్ లో తాను ఇలా రాసింది "చేతిలోకి కత్తెర తీసుకొని జుట్టు భారాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది. నా జుట్టు చాలా ఒత్తుగా మరియు బాగా పెరిగింది దానిని నేను ఇష్టపడుతున్నాను కానీ బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చింది".
అది పెట్టిన కొద్ది సమయం లోనే పొట్టి జుట్టు లో అవతారం ఎత్తింది. జుట్టు కత్తెరించుకున్నాను అనే ఆనందం తన కళ్ళలోనే కాకుండా తన హావభావాల్లో కూడా కనిపించే లాగా పొట్టి జుట్టు తో ఆనందం గా వీడియోస్ కూడా తీసి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన జుట్టుకి సంబంధించిన వీడియో మీరు కింద చూడొచ్చు. అలానే తన పొడవు మరియు పొట్టి జుట్టు ని కూడా ఇక్కడ చూడొచ్చు.
ఈ పోస్ట్ కనుకున్న మీకు నచ్చినట్లు అయితే షేర్ చెయ్యండి. ఇలాంటి మరెన్నో పోస్ట్లు కనుక కావాలనుకుంటే కామెంట్ చెయ్యండి.
0 Comments