వలపు వల - గుండు పగ Part 1

by - August 05, 2020

అవి నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు.రెండవ సంవత్సరం లో అడుగుపెట్టాము.అప్పుడు సినిమా లో హీరోస్ అందరూ పొడవుగా జుత్తు పెంచుకొని స్టైల్స్ కొడుతున్న రోజులు.ఒకరిద్దరు హీరో లు పొడవు జుత్తుని పిలకలా వేసుకుని  దర్శనం ఇచ్చిన రోజులు.అసలే జుత్తు సంబంధ ఇష్టము తో పుట్టిన వాడిని.అంతకు ముందు నున్నటి గుండు ని చాలాసార్లు ఇష్టం తో గియుంచుకుని సరదా తీర్చుకున్నవాడిని.అందుకనే ఏమోఈ సారి జుత్తు పెంచడం మొదలెట్టాను. మెడ వరకూ పెరిగి జులపాల జుట్టు గాలికి ఊగుతూ ఉండేది.అప్పటికే నా క్లాస్మేట్స్ అయిన అమ్మాయిలు ఒకరిద్దరు  ముఖ్యముగా ఇందిర ఏమిటి శ్రీ నువ్ మాలో కలిసి కూర్చుంటావా త్వరలో అని నా జుట్టు పట్టుకుని లాగుతూ ఆట పట్టించేవారు.వారికేమి తెలుసు పెంచిన జుత్తుని నున్నగా గోరిగించే రోజు కూడా వొస్తాది అని.ఆ మాటకొస్తే నాకు కూడా తెలియదు అనుకోండి ఆ రోజు ఎప్పుడు వొస్తుందో.  ఎలా జరుగుద్దో.

చదువులోను మరియు ఇతర ఆక్టివిటీస్ లో చురుకుగా ఉండే నేను మొదటి వరుస లొనే కూర్చునేవాడిని. క్లాస్సెస్ ప్రారంభం అయిన కొన్ని రోజులకి ఒక రోజు లెక్చర్ జరుగుతుండగా గేట్ దగ్గర excuse me sir అని ఒక కోయిల ధ్వని.

అందరూ అటు వైపు చూసారు. గేట్ లో ఒక ultramodern గా ఉన్న అమ్మాయి. 

పాపిడి లేకుండా పయికి దువ్విన వొత్తు అయిన జుట్టు కి ఒక చిన్నక్లిప్ పెట్టుకుని కింది జుట్టు అంతా గాలికి వొదిలేసి నట్టుంది.తన జుత్తు రెండు వైపులా ఆలల్లా ఊగుతుంది.అసలే ఫెతిషేర్ అయిన నాలో అలజడి మొదలు అయింది.సర్ దగ్గరికి వెళ్లి  టేబుల్ ముందు నిలబడి పేపర్స్ చూపిస్తుంది. తన వెనుక భాగం మా వైపుకి ఉంది. న్యూ అడ్మిషన్ లాటరల్ ఎంట్రీ లో జాయిన్ అయినట్టు చెపుతుంది. తన వొత్తు జుట్టు ఆ రోజే షాంపూ చేసినట్లుంది.మెరుస్తూ ఉంది.ఫ్లాట్ గా కత్తిరించిన చివర్లు నడుము కిందికి వేలాడుతూ తన వీపు మొత్తం కమ్మేశాయి. నా లోని జుత్తు ప్రేమికుడు విలవిల ఆడుతున్నాడు.

సర్ ok చెప్పాక నా ముందు నుండి అమ్మాయిల వైపు బెంచెస్ దగ్గరకు వెళుతూ ఒకసారి నా జుత్తు వైపు ఒక చూపు వేసింది.అసలే మైకం లో ఉన్న నాకు ఆ లుక్ భలే కిక్ ఇచ్చింది.ఈ కిక్ ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి మరి.

మేము అయిదుగురుం ఒక గ్యాంగ్ లా ఉంటాము.ఇద్దరు అమ్మాయిలూ ఇందిరా, రమ్య లు.ముగ్గురు అబ్బాయిలం.అందరం మొదటి సంవత్సరం నుండీ ఒకే జట్టుగా కూడాము. నాలో అలజడి లేపిన ఈ కొత్త అమ్మాయి పేరు ప్రియాంక.చేరిన రెండో రోజు నుంచే మా గ్యాంగ్ లోకి దూరిపోయింది.కొత్త అనే ఫీలింగ్ లేకుండా ముందు నుంచే ఉన్నదానిల చాలా త్వరగా కలిసిపోయింది.  ప్రియాంక అంతకు ముందు పోలీటెక్నీక్ లో చదివేటప్పుడు కాలేజ్ లో కల్చరల్ లీడర్ అంట.అసలే అందగత్తె ఆ పై మంచి   మాటకారి. ఇంకేముంది స్టేజి పైన యాంకరింగ్ అంతా తనదే.అందుకే అన్ని స్టైల్స్ పండిస్తాది అని అర్ధం అయింది. త్వరలోనే నాలో ఒక అనుమానం మొలకెత్తింది తాను కూడా నా గూటి పక్షే నెమో అని. ఎందుకంటారా తాను మా గ్యాంగ్ లో చేరిన కొద్దిరోజులకే ఆడిగేసింది ఏయ్ శ్రీ నీ జులపాల జుట్టు ఫాషన్ కోసం పెంచావా లేక ఏదన్నా గుండు ప్రోగ్రాం ఉందా అని.నేను నవ్వేసి ఊరికే పెంచాలే. బాగాలేదా అని అడిగా.బావుందిలే అని నవ్వేసింది.రోజులు గడిచే కొద్దీ పెరుగుతున్న నా జుట్టుకి ఒకరోజు క్లాస్ రూమ్ లొనే దువ్వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి రాంచరణ్ పిలకరా ఇది గేలి చేశారు మా గ్యాంగ్ గాళ్స్.అది ప్రియాంక ప్రోత్సాహమే అని అర్ధం అయింది.

అలా మొదలు అయి   నా జులపాల జుట్టు ప్రియాంకి కి ఒక కాలక్షేపం లా మారింది.నేను కూడా కొంచెం చొరవ తీసుకుని తన జుత్తుని టచ్ చేయడం నుంచి వేళ్ళతో కెలకడం వరకూ వెళ్ళా.

ఒక వీకెండ్ కి దగ్గరలోనే ఉన్న చిన్న తిరుపతికి ప్రోగ్రాం పెట్టారు మా గ్యాంగ్.

ఉదయమే బయలుదేరి బైక్స్ మీద వెళ్ళాము.కొండమీదికి వెళ్ళాక నా ఫ్రెండ్ అన్నాడు ఇప్పుడు కళ్యాణకట్టకి కదా వెళ్ళాలి అని నవ్వుతున్నాడు.నాలోని జుట్టు సఖుడు మేలుకున్నాడు.ఓహో అయితే కొన్ని గుండు గీతలు చూడొచ్చు అని సంబరపడుతూ పదండి అన్నాను.

అంతే వాళ్ళు నా పక్కన చేరి సెల్ఫీలు తీస్కొడం మొదలెట్టారు.అరె సెల్ఫీ లు ఇప్పుడు ఏమిటిరా అన్నాను.అరేయ్ శ్రీ నువ్ జులపాల జుత్తుతో ఉండేది ఇంకాసేపే కదా అందుకే చివరి selfies నీ జుత్తుతో అని నవ్వుతున్నారు.

నా జుట్టుకి చివరి రోజు ఏమిటిరా అని ఖంగు తిన్నా.ప్రియాంక అంతా చెప్పిందిరా.నువ్ గుండు కొట్టించుకోడానికి మమ్మలిని కూడా తీసుకొచ్చావు లే.వీకెండ్ లో ఇలా ప్రోగ్రాం పెట్టించావు ప్రియాంకతో.నీవు ఒక్కడివే వెళ్లి   సడన్ గా గుండు కొట్టించి    కాలేజ్ కి వొస్తే   మేము టీజ్ చేస్తాము అని ఇలా అందరి సమక్షం లో జుట్టుకి మోక్షం మంగలి కత్తితో ఇప్పించి నున్నటి బోడి గుండు దర్శనం ఇస్తావు అన్నమాట అని నా జుత్తు పట్టి లాగింది గ్యాంగ్ మేట్ ఇందిర.

అలా అందరమూ కళ్యాణకట్టకి చేరుకున్నాము.ప్రియాంక కౌంటర్ కి వెళ్లి టోకెన్స్ తీసుకుంది. టోకెన్స్ ఎన్నో తెలియట్లేదు కానీ ఒకే బ్లేడ్ ముక్క మాత్రం ఉంది తన చేతిలో.ఈ లోపు ఇందిర వొచ్చి నన్ను లాక్కెళ్ళింది టాప్ దగ్గరకీ జుత్తు తడుపుకో శ్రీ అని.గుండు ప్రియుడిని అయిన నాకే ఇదంతా వింతగా ఉంది. ఇదేదో గ్యాంగ్ గుండు గోరుగుడు   లా ఉంది అని నవ్వుకున్నా లోపల.ఇంతలో ప్రియాంక.ఇందిర జుత్తు విప్పి మంగలి తో 3 కత్తెరలు తీయించుకున్నారు.

తర్వాత 5 గురూ కలిసి నా చుట్టూ చేరి నా జుట్టులో వేళ్ళు పెట్టి కెలుకుతూ గుంపుగా సెల్ఫీ లు తీస్తున్నారు.ఇంతలో ప్రియాంక బ్లేడ్ ముక్క నా చెతిలో ఉంచింది తీస్కొరా అంటూ.నీ కొత్త రూపం కోసం ఎదురు చూస్తున్నా అంటూ కన్ను గీటుతు నవ్వుంది.మనసులో అనుకున్నా అమ్మ ప్రియాంక ఏమి ప్లాన్ చేసావే నా గుండు కొట్టించడానికి అని.

సరే ఇదేదో కొత్త అనుభవం బావుందే అనుకుంటూ మంగలి ముందు కూర్చున్నా.

మొత్తానికి మా గ్యాంగ్ అందరూ చుట్టూ  చేరి నా  నెత్తిన మంగలి కత్తి  తో పాటు వారి  చేతులతో ఆడుకుంటూ నా జులపాల జుత్తు మొత్తం నున్నగా గొరిగించెసారు. మీసం కూడా గీసేయాలి అని చెప్పి మూసి ముసి నవ్వులు నవ్వింది ప్రియాంక.

గుండు కొట్టించదములో కొత్త అనుభవం బావుందిలే అనుకున్నా.

తిరుగు ప్రయణములో నా బైక్ మీదకి చేరింది ప్రియ.నా వెనుక కూర్చుని నున్నటి నా బోడి గుండుని రెండు చేతులతో తడమడం మొదలెట్టింది.పలుచని మెత్తని తన వేళ్ళు నా గుండుని తాకుతుంటే విద్యుత్ ప్రవాహం ల తగులుతున్నాయి.

సారి బాస్. నీ జులపాల జుత్తుని నున్నగా గుండు కొట్టించేసా.మొదటి రోజు చూసినప్పుడు అనుకున్నా వీడు జుత్తు మొత్తం దగ్గర ఉండి నున్నగా గుండు గీయించే రోజు త్వరలోనే ఉంది అని.ఆ రోజె ఈ రోజు అంటూ ఒక్కసారిగా నా నున్నటి గుండు ని వెనకనుండి తన రెండు పెదవులు    తో వేడి వేడిగా ముద్దులతో ముంచెత్తింది.

అలా తన వలపు నా మీద మొదలు అయింది.

దానితో పాటె నాలో వలపు పగ కూడా మొలకెత్తింది.ఒసేయ్ ప్రియా ఇలాగే వలపుతో నీకు కూడా అందరి ముందూ నున్నగా గుండు గీయిస్తానే.ఆ రోజు కూడా త్వరలోనే వొస్తుంది అని నా మనసులో అనుకున్నాను.అలా మొదలు అయిన మా ఇద్దరి వలపు వగలు, నా లో పుట్టిన వలపు పగా జంటగానే పెరిగి ఏమి జరిగింది అనేది త్వరలో…

You May Also Like

0 Comments