సరోజ హెయిర్ డొనేషన్

by - September 01, 2020

 నా పేరు ప్రియ. నేను నా చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో ఉన్నాను. నాకు నా పదవ తరగతి వరకు పిరుదుల వరకు ఉండే జుట్టు ఉండేది. పడవ తరగతి పూర్తి అయినా తరువాత తిరుమల లో అయిదు గుప్పెడులు ఇచ్చేసి వచ్చాను మొక్కు ఉంది కాబట్టి. ఆ తర్వాత ఇంటర్ లో చేరాక మల్లి జుట్టు బాగానే పెరిగింది ఇంకా నేను అంతే పెంచాను. కాకపోతే బి. టెక్ జాయిన్ అయ్యాక మొదటి సంవత్సరం మొత్తం అంతే పొడవాటి జడ లోనే కాలేజీ కి వెళ్లే దానిని. రెండొవ సంవత్సరం లో నాకు కూడా అందరి లాగా మంచి హెయిర్ స్టైల్స్ మెయిన్ టైన్ చేద్దాం అనే కోరిక పుట్టింది. ఆ కోరికకి తగ్గట్టే నా రూమ్ లో ఉండే సరోజ కూడా నాతో పాటు తన జుట్టు ని కత్తెరించుకోడానికి ముందుకు వచ్చింది. ఇద్దరం వెళ్లి నేను లాంగ్ లేయర్స్ అదేమో ఫెథర్ కట్ చేయించుకొని వచ్చాము. 

అప్పటి నుండి లూస్ హెయిర్ తోనే కాలేజీ కి వెళ్లడం అలవాటు అయిపోయింది. ఇంక జుట్టు పెంచడం కూడా తగ్గించేసాను. ఎప్పటికప్పుడు పార్లర్ కి వెళ్ళినప్పుడు ఏదైనా హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం అనిపిస్తే అది ట్రై చేసేదానిని. అలా బారెడు జడ నుండి మూరెడు పిలకకు మారిపోయింది నా జుట్టు. కానీ ఒక్కటే అదృష్టం ఏంటి అంటే ఒత్తు గా ఉండేది మాత్రం తగ్గనే లేదు. ఉద్యోగ ప్రయత్నాలకు అని చెన్నై లో నా ఫ్రెండ్ సరోజ రూమ్ కి వెళ్ళాను. నేను వెళ్లే సరికి అది నున్నటి బోడి గుండు అవతారం లో ఉండింది. నేను షాక్ దానిని చూసి. 

"ఒసేయ్ ఇదేంటి? గుండు అవతారం? నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి?"

"అది దాని నున్నటి గుండు ని రుద్దుకుంటూ - నవ్వుతూ - అదా? ఏమి లేదే... ఈ చెన్నై వాతావరణానికి జుట్టు ఊడడం మొదలు అయ్యింది"

ఊడుతుంటే - ఊడకుండా ఉండడానికి ఏది అయినా చెయ్యాలి కానీ నువ్వెంటే ఇలా గుండు చేపించావు. 

సరోజ - "నేను చెప్పేది ఏది పూర్తిగా వినవే నువ్వు ఎప్పుడు?"

నేను - సరే చెప్పు. వింటాను.

సరోజ - ఎలాగూ జుట్టు ఊడుతుంది కదా బాగా షార్ట్ గా బాబ్ లాగా చేపిద్దాం అనుకున్నానే. సరే ఈ వారం లో చేపిద్దాం అని అనుకుంటూ ఉండగా ఇన్స్టా లో "చెన్నై హెయిర్ డొనేషన్" అని పేజీ కనపడిందే. అయితే అందులో మన హెయిర్ ని డొనేట్ చేయొచ్చు అని ఉంది. అందులో పెట్టిన పోస్టులని మొత్తం చూసాను. నడుము కిందకి ఉండే జుట్టు వాళ్ళు పిక్సీ లాగా కూడా చేయించుకున్నారు. అలా పొడవాటి కురులు ఉన్న అమ్మాయిలు అందరు జుట్టు ని డొనేట్ చేస్తున్నారు. ఎలాగూ కత్తెరించి పడేద్దాం అనుకున్నాను కదా అదేదో డొనేట్ చేస్తే వీళ్ళకి కూడా ఉపయోగ పడుతుంది కదా అనిపించి వెంటనే వాళ్లకి మెసేజ్ చేశాను. వాళ్ళు ఇవ్వాళ నాకు "టోనీ అండ్ గయ్" సలోన్ లో అప్పాయింట్మెంట్ ఇచ్చారు. 

నేను ఆపుకోలేక - నువ్వు హెయిర్ కట్ కె కదా వెళ్ళింది మరి ఈ నున్నటి బోడి గుండు అవతారం ఏంటో?

సరోజ - "ఒసేయ్ తల్లి అక్కడికే వస్తున్నాను. కాస్త నువ్వు ఆగవే. నన్ను చెప్పనివ్వు..."

నేను - "సరే సరే... కానివ్వు"

సరోజ - "సరే అని పొద్దునే వెళ్లనే అక్కడికి. కొంచెం రష్ గా ఉంది మరియు ఆ చెన్నై హెయిర్ డొనేషన్ పేజీ వాళ్ళు రావడానికి ఒక అరగంట టైం పడుతుంది అన్నారు. సరే అని అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ లోపల ఆ హెయిర్ డొనేషన్ పేజీ కి సంబందించిన అతను వచ్చి నన్ను సలోన్ లో ఉన్న హెయిర్ స్టైలిస్ట్ కి పరిచయం చేసాడు. నాకు షాంపూ చేసి తీసుకొని వచ్చి చైర్ లో కుర్చోపెట్టాక ఇంక హెయిర్ స్టైలిస్ట్ అడగడం మొదలు పెట్టాడు "ఎలాంటి హెయిర్ స్టైల్ చేద్దాం మేడం అని" 

ఈ లోపల డొనేషన్ పేజీ అతను నాతో "మేడం మినిమం పన్నెండు ఇంచెస్ హెయిర్" ఇవ్వాలి మేడం ప్రొసీజర్ ప్రకారం. మీకు ఉన్న లెంగ్త్ కి బాయ్ కట్ లేదా బాబ్ కట్ లాగా అయిపోతుంది మీ జుట్టు. 

నేను - సరే అన్నట్టు తలా ఊపాను. 

తను చెప్పుకుంటూ మీరు ఇంకా కావాలి అంటే బాల్డ్ బ్యూటీ లాగా కూడా అవ్వొచ్చు మేడం. 

నాకు ఒక్క నిమిషం అర్ధం కాలేదు వెంటనే ఆయనని "బాల్డ్ బ్యూటీ" ఏంటి? అని అడిగాను.

"నిన్న మీకు ఎవరు చెప్పలేదు అనుకుంట మేడం. జుట్టు కత్తెరించుకోడమే కాకుండా ఇంకా కాన్సర్ తో పోరాడే వాళ్లకి తోడుగా మేము ఉన్నాం అంటూ స్ఫూర్తి దాయకం కూడా ఉండొచ్చు మేడం మీరు" అని చెప్పి రీసెంట్ గా డొనేట్ చేసి అమ్మాయి పిక్ చూపించాడు. ఆమె కూడా ఇదే సలోన్ లో గుండు చేపించుకున్నట్టు ఉంది. 

నేను ఒక రెండు నిమిషాలు ఆలోచించుకొని "ఐ వాన్నా గో బాల్డ్..." అని చెప్పాను.

సరోజ వంక అంతే చూస్తున్న నేను వెంటనే తనని ఆపేసి "అంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చిందే నీకు?" అని అడిగాను.

సరోజ దానికి 'ధైర్యంగా పాడా? జుట్టు బాగా ఊడుతుంది కదే. గుండు చేపిస్తే వాళ్ళ పేరు చెప్పుకొని మనం కూడా కొన్ని రోజులు ఈ దువ్వడాలు షాంపూ చేసుకోడలు ఉండవు అని సరే చెప్పేసాను. అది కాక ఇక్కడికి వచ్చాక డాండ్రఫ్ కూడా బాగా వచ్చిందే. ఎక్కడో వీడియో కూడా చూసాను డాండ్రఫ్ పోవాలి అంటే కుదుళ్ళ నుండి పోగొట్టాలి అంటే నున్నగా గుండు గొరిగించి ఆ తర్వాత నుండి మంచిగా హెయిర్ కేర్ తీసుకొని జుట్టు మంచిగా మరియు ఒత్తుగా వస్తుంది అని. కానీ మనకి అంత ధైర్యం లేదు మరియు ఇంట్లో వాళ్ళు అడిగితే ఏమి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. అందుకని ఎప్పుడు ఆలోచన రాలేదు. కానీ అతను ఆ అమ్మాయి పిక్ చూపించాక "అరె ఇదేదో మంచి ఐడియా నే కదా. మనం కూడా నున్నగా గుండు చేపించేస్తే ఈ చెన్నై ఎండలకు మరియు పొల్యూషన్ కి మరియు డాండ్రఫ్ కి కొద్ది రోజుల పాటు స్వస్తి చెప్పొచ్చు అని అలా అనేశాను బేబీ' అని నా వంక చూసి కన్ను కొట్టి గుండు ని రుద్దుకుంటూ ఆనందిస్తుంది.        

సరోజ ఇంకా మెల్లగా మిగిలింది చెప్పడం మొదలు పెట్టింది. నేను బాల్డ్ అని చెప్పాక ఆ డొనేషన్ అతను నాతో "మేడం అలా అయితే మీ హెయిర్ డ్రై చేసే లోపల ఇంకొక మేడం ది కూడా షేవ్ ఉంది. ఆవిడ రాగానే ఇద్దరినీ కలిపి పిక్స్ తీసి మిగతా అంత కంప్లీట్ చేస్తాం మేడం. ప్లీజ్ డోంట్ మైండ్" అని చెప్పాడు. 

ఎలాగూ మనకి పనా పాట ఏమి లేదు కనుక హాయిగా వాడు హెయిర్ డ్రై చేస్తూ ఉంటె రిలాక్స్ అయ్యాను. ఈ లోపల ఆ ఇంకొక అమ్మాయి రానే వచ్చింది. ఇద్దరినీ కలిపి కొన్ని పిక్స్ తీసాక మా చేత కొన్ని వీడియోస్ హెయిర్ డొనేషన్ గురుంచి చెప్పించి ఇంక మొదలు పెడదామా మేడం అని అడిగాడు. నేను సరే అన్నాను. వెంటనే నన్ను చైర్ లోకి ఎక్కించి నా మీద కేప్ కప్పేశారు. ఈ లోపల డొనేషన్ అతను హెయిర్ స్టైలిస్ట్ తో ఏదో మాట్లాడాడు. వాడు వెళ్లి వేరే అమ్మాయిని పిలుచుకొని వచ్చి ఇంకొక అమ్మాయికి షాంపూ చెయ్యడానికి వెళ్ళాడు. 

వచ్చిన ఆమె నా వెనుకకు వచ్చి నా జుట్టుని రెండు భాగాలు గా విడదీసి రెండు రబ్బర్ బాండ్స్ తీసుకొని నాకు రెండు పోనీస్ లాగా వేసింది. ఎప్పుడో స్కూల్ కి వెళ్లే టైం లో వేసుకున్న రెండు జడలు గుర్తుకు వచ్చాయి. ఈ లోపల ఆ అమ్మాయిని తీసుకొని పక్కనే ఖాళీ గా ఉన్న చైర్ లో కూర్చోపెట్టి డ్రై చెయ్యడం మొదలు పెట్టారు. ఆమె ముందర డ్రా లో నుండి గుండు గొరిగేది మరియు బ్లెడ్స్ సెట్ తీసుకుంది. నేను అంతే చూస్తూ ఉన్నాను. ఆమె బ్లెడ్స్ ని మార్చి నా ఎడమ పక్కకి వచ్చి "మేడం మొదలు పెట్టేనా? ఆలోచించుకునేది ఎమన్నా ఉంటె ఇప్పుడే ఆలోచించుకోండి ఆ తర్వాత కష్టం అని చెప్పింది..."

ఇది అంతా వీడియో వెనుక నుండి తీస్తున్నాడు ఆ హెయిర్ డొనేషన్ సైడ్ నుండి వచ్చిన అతను.  అద్దం లో చూసాడు నేనేమన్నా డ్రాప్ ఐపోతానేమో అని. కానీ నేను నవ్వుతూ ఆమెతో "కానివ్వండి. మంచి పని కోసమే కదా..." అని చెప్పాను. ఆమె అంతే నా పాపిట మధ్యలో నుదుటి భాగం దెగ్గర పెట్టి మెల్లగా లాగింది. జుట్టు ఆరిపోయి ఉంది కదా అందుకనే ఏమో జుట్టు తెగలేదు సరిగ్గా. కొంచెం గట్టిగా అదిమి పెట్టి చెంప వైపు కిందకి లాగింది. అంతే నా నుదురు భాగం లో ఉన్న నల్లటి వెంట్రుకలు కాస్త తెగాయి. కొంచెం తెల్లటి ప్రదేశం బయట పడింది. అలా లాగుతూ మెల్లగా పాపిట నుండి ఎడమ భాగాన్ని గొరుగుతూ వెళ్తుంది. ఆవిడకి దానిని వాడడం అలవాటు లేదు అనుకుంట గుండు మాత్రం నున్నగా రావడం లేదు. 

ఈ లోపు నాకు హెయిర్ డ్రై చేసిన హెయిర్ స్టైలిస్ట్ అతను ఆవిడ గొరుగుతున్న వైనం చూసి డ్రై చెయ్యడం ఆపేసి ఆమెతో నేను ఇది చేస్తాను ఆమె హెయిర్ డ్రై చెయ్యి అని చెప్పాడు. వెంటనే ఆమె అతని చేతిలో అది పెట్టి మెల్లగా ఆ హెయిర్ డ్రైయర్ తీసుకొని ఆమె జుట్టు ని డ్రై చెయ్యడానికి వెళ్ళింది. 

ఈ లోపు ప్రియ కి కుతూహలం ఆగలేక సరోజ ని మధ్యలో ఆపేసి "అవునే ఇందాకటి నుండి అది ఇది అంటున్నావు కానీ ఇంతకీ దాని పేరేంటో చెప్పవే?"

సరోజ వెంటనే "అందుకేనే మనం ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. నీకొచ్చిన డౌట్ ఏ నాకు వచ్చింది అనమాట. అందుకనే ఆ హెయిర్ స్టైలిస్ట్ ని అడిగేసాను గా. 

సరోజ ఇంక చెప్పడం మొదలు పెట్టింది "హెయిర్ స్టైలిస్ట్ వచ్చి దానిని చేతిలోకి తీసుకున్నాడు. నేను వెంటనే తనని దీనిని ఏమి అంటారు అసలు?" అని అడిగాను.

అతను నవ్వి "మంగలి కత్తి అంటారు వాడుక భాష లో అయితే. అసలు అయితే అస్త్ర అంటారు..."

సరోజ దానికి "ఒహ్హో మీ చేతిలో ఉండే అస్త్రం ఇదే కాబట్టి దీనికి అస్త్ర అని పేరు పెట్టి ఉంటారు"

హెయిర్ స్టైలిస్ట్ నా ఎడమ పక్క ఆమె గొరిగిన ప్రదేశాన్ని ఒక సారి చేతితో రుద్దాడు వెంటనే నాకు చక్కిలి గిలి వేసి కొంచెం కదిలాను. అది అర్ధం అయ్యి వాడు ఇంకొక సారి మల్లి అలానే అని మెల్లగా పాపిట మధ్యలో నుదురు భాగం లో ఎక్కడ అయితే ఆ అమ్మాయి మొదలు పెట్టిందో అక్కడే మొదలు పెట్టి సప సప మని గీసేస్తున్నాడు. అప్పటి వరకు కలుపు మొక్కల లాగా ఉన్న ఆ గరుకు గుండు కాస్త నున్నగా కనిపిస్తుంది. నా తల నుండి వేరు అయిన వెంట్రుకలు మొత్తం మెల్లగా కిందకి అలా జాలు వారుతున్నాయి. నా తల నుండి వేరు అయిన వెంట్రుకలు నా చెంప మీద ఆగి ముద్దాడుతున్నట్టు అనిపించాయి. అలా గొరుగుతూ చెంప దెగ్గరికి వెళ్లేసరికి నాకు అయితే భలే చక్కిలిగింతలు పుట్టాయి. వాడు నా వంక చూసి "మేడం కొంచెం కదలకుండా ఉండండి ప్లీజ్ లేకపోతే గాట్లు పడే అవకాశం ఉంది" అని చెప్పాడు.

అయినా సరే మన చేతిలో లేనిది కాబట్టి నేను మాత్రం నా వంతు ప్రయత్నం చేశాను కదలకుండా ఉండడానికి. వాడికి అలవాటు అయిన పని కాబట్టి చాకిచక్యం తో ఎడమ భాగం మొత్తం పూర్తి చేసాడు. నా ఎడమ వైపు ఉన్న పోనీటైల్ నా వడిలో పడింది. నేను మెల్లగా ఆ జుట్టు ని చేతిలోకి తీసుకొని జుట్టు మొదళ్ళని చూసుకుంటే అర్ధం అయ్యింది ఎంత డాండ్రఫ్ ఉందో అని. నేను నా జుట్టుని చూసుకునే సమయం లో ఏదో చల్లటి ది తల మీద పడినట్టు అనిపించింది. వెంటనే చూస్తే స్ప్రే బాటిల్ తీసుకొని నీళ్లు కొడుతున్నాడు సగం గొరిగిన గుండు మీద ఆ హెయిర్ స్టైలిస్ట్. నాకు ఒక పక్క వింతగా ఇంకొక పక్క ఆశ్చర్యం గా అనిపించింది. 

అప్పుడే ఒక క్వశ్చన్ తట్టింది "అయినా వీడెంటి నీళ్లు ఇప్పుడు చల్లుతున్నాడు? గుండు చెయ్యబోయే ముందర కదా చల్లేది?" అని. కాకపోతే ఏమి అడుగుతాం లే అని మెదలకుండా కూర్చొని వాడు గొరుగుతూ ఉంటె నేను రిలాక్స్ అవుతున్నాను. 

ఈ లోగ పక్కన హెయిర్ డ్రై చెయ్యడం అయిపోయింది ఆ అమ్మాయిది. నాకు గొరిగేసాక వెనక నుండి నా మీదకి చుట్టిన కేప్ కి తీశారు. నాకేమి అర్ధం కాలేదు ఏంటా అని. అప్పుడు ఆ డొనేషన్ అతను వచ్చి "మేడం మేము హాఫ్ బ్లడ్ ఛాలెంజ్" చేస్తున్నాం మేడం. అందుకే మీకు సగమే గుండు గొరిగాడు. మీకు ఎడమ భాగం మొత్తం గొరిగాడు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి కుడిభాగం గొరిగేసాక మీరు 'హాఫ్ బ్లడ్ ఛాలెంజ్' మా నెక్స్ట్ వచ్చే డోనార్స్ కి ఇస్తారు అనమాట. 

నాకు ఒక్క నిమిషం ఏమి అర్ధం కాలేదు కానీ ఇంత అరగుండు లో ఇంకొంత సేపు ఉండాలని మాత్రం అర్ధం అయ్యింది. నేను అలా పక్కన నుంచున్నాను ఈ లోగ ఆ రెండొవ అమ్మాయి వచ్చి కుర్చీలో కూర్చోడం తన మీదకి కేప్ చుట్టడం అయ్యింది. ఆ అమ్మాయి లైవ్ ఆన్ చేసి మరి అక్కడ పెట్టేసింది. చాలా ఉత్సాహం ఉంది తను మాత్రం. గుండు అని ఫిక్స్ అయ్యే వచ్చింది అనుకుంట అందుకే అంత ఆనందం. ఈ లోగ ఆ సలోన్ కి వచ్చి వెళ్లే వాళ్ళందరూ నన్ను అంతే చూస్తూ ఉన్నారు "ఇదేందీ ఇలా అరగుండు లో నుంచొని ఉంది ఇంకొకతీ ఏమో కుర్చీలో కూర్చొని గుండు గొరిగించుకుంటుంది అని..."

అలా ఆ అమ్మాయికి కూడా అరగుండు అయ్యాక ఇద్దరినీ కూర్చోబెట్టి కొన్ని పిక్స్ మరియు అలానే నుంచోబెట్టి కూడా కొన్ని పిక్స్ అండ్ తనకి కావాల్సిన బాల్డ్ ఛాలెంజ్ వీడియోస్ కూడా తీసుకున్నాక మిగతాది చూసేద్దామా అని అడిగాడు. 

అయితే ఆ అమ్మాయి ఒక్క నిమిషం అని చెప్పి నా దెగ్గరికి వచ్చి "మేడం ఎలాగూ గుండె కాబట్టి నాకొక ఐడియా వచ్చింది అలా చేద్దామా అని అడిగింది. పోయే దానికి ఎలా అయితేనేమి అని నేను ఓకే చెప్పాను.    

ఇద్దరం పక్కన పక్కననే కూర్చున్నాం. ఒదులుగా ఉన్న మా ఇద్దరి జుట్టు ని కలిపి జడ లాగా అల్లింది ఆ పార్లర్ అమ్మాయి. రెండు అరగుండు ల మధ్యలో పూర్తి జడ లాగా ఉంది ఆ జడ. నాకేమో ఆ హెయిర్ స్టైలిస్ట్ గొరగడం మొదలు పెట్టి నాకొక కొంచెం అయిపోయాక ఆ అమ్మాయి వైపుకి కూడా వెళ్లి మిగతా సగం గొరుగుతూ మెల్లగా ఆ జడ మా ఇద్దరి తల నుండి వేరు అయ్యింది. సగం మిల మిల మెరిసే గుండు లతో మిగతా సగం బరక బరక గా ఉన్న చిన్ని చిన్ని వెంట్రుకలతో ఉంది మా ఇద్దరి గుండులు. మిగతా అంత నున్నగా గొరిగేసి షేవింగ్ క్రీం రాసి మరి నున్నగా గొరిగేసాడు అస్త్ర తో. ఆ తర్వాత అక్కడ నుండి సర్టిఫికెట్ తీసుకొని ఇంటికి వచ్చేసానే. 

"ఇదమ్మా జరిగింది ప్రియ" అని అద్దం లో తన గుండు ని చూసుకొని మురుసుకుంటూ చెప్పింది సరోజ.

సరిపోయింది పో. అయినా డాండ్రఫ్ అని చెప్పి పొట్టిగా చేపిద్దాం అని వెళ్లి గుండు చూపించడం ఏంటో? అని అన్నాను.

సరోజ - ఇప్పుడే కదే వచ్చింది. కొద్ది రోజుల తర్వాత ఆ మాట చెప్పు అప్పుడు వింటాను. 

అలా ఏవేవో ముచ్చట్ల మధ్యన దాని గుండు ని రుద్దే అవకాశం కూడా వచ్చింది.    



You May Also Like

4 Comments

  1. అప్పుడెప్పుడో కళ్ళతో చూసిన దానికంటే గొప్పగా చూపించావు మెదడు తో.

    ReplyDelete
  2. అప్పుడెప్పుడో కళ్ళతో చూసిన దానికంటే గొప్పగా చూపించావు మెదడు తో.

    ReplyDelete
  3. అప్పుడెప్పుడో కళ్ళతో చూసిన దానికంటే గొప్పగా చూపించావు మెదడు తో.

    ReplyDelete
  4. రెండు అరగుండులను కలిపి జాడ అల్లి షేవ్ చేయడం, వాహ్ సూపర్ ప్రజ్ఞ గారు.

    ReplyDelete