ప్రియ హెయిర్ డొనేషన్ - సరోజ హెయిర్ డొనేషన్ - Part 2
అలా ఆ రాత్రి తన గుండు ని రుద్దుకుంటూ నిద్రపోయాము. కొద్ది కాలం గడిచిపోయింది. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి ఈ లోపలనే కరోనా రావడం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లడం జరిగింది. మొదటి కొన్ని రోజులు ఇంట్లోనే ఉండడం సరదాగా వండుకుంటూ టైంపాస్ చెయ్యడం బానే ఉంది కానీ ఏప్రిల్ నెల వచ్చాక తెలిసింది సరోజ గుండు ఎందుకు చేపించింది అని.
ఎండాకాలం పైగా చెన్నై వాతావరణం - అది కూడా రూమ్ లోనే ఉండడం. ఎప్పుడు లూస్ హెయిర్ ఓ లేక ఎలా కావాలి అంటే అలా ఉంచుకునే నా జుట్టుని కాస్త కొప్పుకే అంకితం చెయ్యడం జరిగింది. ఒక రోజు అంతే నేను తలలో గోక్కుంటూ ఉంటె సరోజ చూసి నవ్వడం మొదలు పెట్టింది. నవ్వుతూనే తన బాయ్ కట్ హెయిర్ లో చేతులు పెట్టుకొని హీరో లాగా పోజ్ లు ఇవ్వడం మొదలు పెట్టింది.
నేను - "ఒసేయ్ నాకు అర్ధం అవుతుందే. నువ్వు నన్నే వెక్కిరిస్తున్నావు అని"
సరోజ - "ఒక్క సారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఆ రోజు ఏమి అన్నావో గుర్తు తెచ్చుకోవే. ఆ రోజు ఏమన్నావే అయినా దీనికే గుండు చేపించుకోవాలా అని?"
నేను - "ఒసేయ్ నువ్వేమి ఇప్పుడు గుండు లో లేవు కదా. జుట్టు బాగానే వచ్చింది కదా. అప్పుడు కటింగ్ కూడా ఇలానే చేపించుకుంటే సరిపోతుంది కదా అని అన్నాను. అంతే కదా. సరే లే నీకేంది నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కానివ్వు కానివ్వు..."
అలా ఇంకొక రెండు రోజులు నా కష్టాన్ని చూసాక ఒక రోజు సాయంత్రం టైం లో ఆయిల్ పెట్టమని అడిగాను దానిని. అది ఆయిల్ పెడుతూ "ఒసేయ్ ప్రియ ఎలాగూ లాక్ డౌన్ లోనే ఉన్నాం కాబట్టి నువ్వు కూడా హెయిర్ డొనేషన్ చేయొచ్చు కదా. కొద్ది రోజులు బయటకి వెళ్ళేది కూడా ఉండదు కదా అని చెప్పింది.
నేను - "ఏంటే ఇప్పుడు నేను కూడా నీకు లాగానే గుండు చేపించుకోమంటావా ఏంటి?"
సరోజ - "ఒసేయ్ తల్లి. హెయిర్ డొనేషన్ అంటే గుండు అనే కాదే. హెయిర్ కట్ కూడా చేపించుకోవచ్చు అని కొంచెం కోపం గా నా తల మీద మొట్టింది.
"అవును కదా. సారీ సరోజ. నేను ఇంకా గుండు ఏమో అనుకోని అలా అన్నానే. కానీ ఈ ఐడియా బావుందే. వాళ్ళతో మాట్లాడు నేను కూడా నీ లాగా బాయ్ కట్ చేయించేసుకుంటాను" అని చెప్పను. ఈ లోపల అది నాకు ఆయిల్ దట్టంగా పెట్టేసి నా జుట్టు ని అల్లింది. బుజ్జి జడ వచ్చింది నాకు ఉన్న కొద్దిగా జుట్టు తో.
సరోజ లేచి వెళ్లి చేతులు కడుక్కొని వచ్చి వాళ్లకి కాల్ చేసింది కానీ అతను లిఫ్ట్ చెయ్యలేదు. ఆ తర్వాత మల్లి చేసాము కానీ ఆయన మాత్రం కాల్ లిఫ్ట్ చెయ్యలేదు. సరే లే బిజీ ఉన్నదేమో అని ఆ రోజు గడిపేసాము. తర్వాత రోజు పదకొండు తర్వాత సరోజ స్నానం చేసే టైం తనకి అతని దెగ్గర నుండి కాల్ వచ్చింది. "సరోజ హెయిర్ డొనేషన్ అతను కాల్ చేస్తున్నాడే?"
లోపల నుండి అది డోర్ తెరిచి ఇలానే వచ్చి కాల్ లిఫ్ట్ చేయమంటావా ఏందే? అని అడిగింది.
"అమ్మ బంగారం ఆ ఎక్సపోసింగ్ ఆపేసి నువ్వు స్నానం చెయ్యి నేను మాట్లాడతాను లే వాడితో" అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి "హలో" అన్నాను.
"హలో మేడం. నాకు కాల్ వచ్చింది ఈ నెంబర్ నుండి. ఎవరు మాట్లాడేది?"
"హలో అండి. నేను నా హెయిర్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అండి"
"మీరు ఎక్కడ ఉంటారు?"
"చెన్నై లోనే ఉంటాం అండి"
"చెన్నై లోనే ఎక్కడ ఉంటారు అండి"
"నవళ్లూర్ దెగ్గర అండి"
"మేడం నేను ఇప్పుడు షోలింగనల్లూర్ దెగ్గర ఉన్నాను. నవళ్లూర్ వైపుకే వస్తున్నాను. మీకు ఓకే అంటే నేను వచ్చి మిమ్మల్ని కలిసి డొనేషన్ చేసేద్దాం మేడం. మీ అడ్రస్ లొకేషన్ షేర్ చెయ్యండి..." అని చెప్పి పెట్టేసాడు.
"నేను తనకి వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేసాను వెంటనే..."
ఈ లోగ స్నానం చేసి బయటకి వచ్చిన సరోజ "ఏమే... మాట్లాడావా?"
నేను - హా మాట్లాడానే. తాను ఈ దెగ్గరలోనే ఉన్నాడు అంట. మన లొకేషన్ కె వస్తాను అని చెప్పాడు. సరే అని మన రూమ్ లొకేషన్ షేర్ చేశాను అని చెప్పే లోపలనే కాలింగ్ బెల్ మ్రోగింది.
నేనే వెళ్లి తీసాను ఎదురుగా ఒక యువకుడు ఉన్నాడు అప్పుడే కాలేజీ కంప్లీట్ చేసుకొని ఉన్నట్టు ఉన్నాడు.
"మేడం నేను చెన్నై హెయిర్ డొనేషన్ నుండి. ఇందాక కాల్ చేసారు కదా..."
"హా లోపలకి రండి..." అని లోపలకి పిలిచాను.
లోపలకి రాగానే సరోజ చేసి వీడు ఎవడు అబ్బా అనుకుంది. వెంటనే "వేరే అతను కదా... మీరేంటి?"
అతను - "మా టీం లో మొత్తం మేము తొమ్మిది మంది ఉన్నాము మేడం. ఎవరకి కుదిరితే వాళ్ళం అటెండ్ అవుతూ ఉంటాము. ఈ లాక్ డౌన్ కారణం గా ఎవ్వరు ఇక్కడ లేరు. వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్లిపోయారు. నేను ఒక్కడినే ఉన్నాను. అందుకే ఇంకా అన్ని డొనేషన్స్ నేనే మేనేజ్ చేస్తున్నాను కాకపోతే పూర్తి సేఫ్టీ తోనే..."
సరోజ ఒక సారి వాడిని కింద నుండి పై దాకా చూసింది... మొహానికి మాస్క్, చేతులకి గ్లోవ్స్ తో మరియు కాప్ కూడా మైంటైన్ చేస్తున్నాడు...
అతను - సరోజ హెయిర్ లెంగ్త్ చూసి "మేడం మీ హెయిర్ లెంగ్త్ సరిపోదు మేడం డొనేషన్ కి..." అని అంటాడు.
వెంటనే సరోజ - అయ్యో నేను కాదు అంది డొనేట్ చేసేది ఇదిగో ఇది అని నా వంక చూపించింది. నేను కొంచెం సిగ్గుతో తల దించుకున్నాను. సరే మేడం ఎక్కడ చేద్దామో చెప్తే కంప్లీట్ చేద్దాం మేడం అని చెప్తాడు. బాల్కనీ అయితే కొంచెం స్పేసియస్ గా ఉంటుంది. సో అక్కడే చేద్దాం అని సరోజ చెప్తుంది.
ఆ అబ్బాయి బాల్కనీ లోకి వెళ్ళాడు. వెళ్లి చెక్ చేసుకుంటున్నాడు సెట్ అప్ అంత. ఈ లోపల నేను సరోజ తో "అవునే. నువ్వు ఏదో టోనీ అండ్ గై సలోన్ లో అన్నావు. వీడేమో హోమ్ సర్వీస్ చేస్తున్నాడు... అని అడిగాను.
మేము ఇద్దరం బాల్కనీ లోకి వెళ్ళాము. మేడం ముందర మీ పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుంటాను మేడం.
సరోజ - "హా మాకు ఐడియా ఉంది అండి ప్రాసెస్ మొత్తం... నేను కూడా మీ ఆర్గనైజషన్ నుండే నా హెయిర్ డొనేట్ చేశాను త్రీ మంత్స్ బ్యాక్..."
"వావ్ మేడం..."
ఈ లోపల నన్ను నుంచోమని చెప్పి బ్యాక్ సైడ్ నుండి మరియు ఫ్రంట్ నుండి నా హెయిర్ ని పిక్స్ మరియు వీడియోస్ తీసుకున్నాడు. సరే మేడం ఇంకా మొదలు పెడదామా? అని అడిగాడు.
సరోజ లోపలకి వెళ్లి చైర్ తీసుకొని వస్తూ ఉంది వెంటనే వాడు "చైర్ ఏమి అవసరం లేదు మేడం. కిందనే కూర్చొని కంప్లీట్ చేద్దాం" అని అన్నాడు.
సరోజ నేను ఒకరి మొఖం ఒకటి చూసుకొని సరోజ అతనితో "అదేంటి... హెయిర్ కట్ అయితే కింద కూర్చొని ఎలా చేస్తారు? కష్టం కదా చెయ్యడం"అని అడిగింది.
వాడు షాకింగ్ లుక్ ఒకటి ఇచ్చి " హెయిర్ కట్ ఏంటి మేడం? మీరు షేవ్ కోసం కాదా?"
నేను వెంటనే షాక్ అయ్యి "షేవ్ ఏంటి?" నేను హెయిర్ కట్ కోసం అనే కాల్ చేశాను అండి..."
వచ్చిన వాడికి ఏమి అర్ధం కాలేదు... కాసేపు అలా మెదలకుండా మా మొహాల వంక చూస్తూ ఉన్నాడు. సరోజ ని నేను పక్కకి తీసుకొని వెళ్ళాను.
"ఒసేయ్ వీడేంటే ఇలాంటి ఫిట్టింగ్ పెట్టాడు. నేనేదో నీ లాగానే మంచిగా హెయిర్ కట్ చేపించుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంటే వీడేమో ఇప్పుడు గుండు అన్నాడు"
సరోజ - "ఒసేయ్ గుండు అయితే ఏంటి హెయిర్ కట్ అయితే ఏంటి. మహా అయితే ఇంకొక నెల రోజుల్లో పెరిగిపోతుంది జుట్టు అయితే".
నేను - అలా అంటావా? సరే లే చేపించేస్తాను అని చెప్పి బాల్కనీ లో వాడు కూర్చున్న ప్లేస్ దెగ్గరికి వెళ్ళాము ఇద్దరం.
వాడు చూసి - ఏమి డిసైడ్ అయ్యారు మేడం.
నేను సిగ్గుపడుతూ మొత్తం డొనేట్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను.
సరే ఇలా వచ్చి కింద కూర్చోండి అనగానే నేను కింద కూర్చున్నాను మెల్లగా.
ఈ లోపల సరోజ చూసి "ఏంటి అండి కింద కూర్చోబెడుతున్నారు. చైర్ వేసి అందులో కూర్చోబెట్టి చేయొచ్చు కదా".
వాడు దానికి "లేదు మేడం... ఇలానే బావుంటుంది అండ్ అల్సొ ఈజీ గా కూడా ఉంటుంది".
నేను సరోజ వంక చూసి ఏమి కాదు లేవే అన్నట్టు సైగ చేశాను. వెంటనే వాడు కొప్పులాగా పెట్టిన నా జుట్టు ని ముడి తీసి జుట్టు ని విడ తీసాడు. మెల్లగా నా నడి నెత్తి మీద చెయ్యి వేసి వేళ్ళతో నా తల లోకి దూర్చి మెల్లగా నొక్కుతూ ఉన్నాడు. జుట్టుని పైకి లేపుతూ మెల్లగా వేళ్ళని లోపలకి దూర్చి రుద్దుతూ ఉన్నాడు. నాకు ఇది అంత వింతగా అనిపించింది. ఈ లోపల సరోజ లోపలకి వెళ్లి మగ్గు లో నీరు తీసుకొని ఇచ్చింది.
దోసిటిలోకి నీళ్లు తీసుకొని నా తల మధ్య భాగం లో చిలకరించి మెల్లగా రుద్దుతున్నాడు. కొంచెం కొంచెం నీళ్లు తీసుకొని చిలకరిస్తూ జుట్టుని మొత్తం తడపసాగాడు. ఆ తర్వాత నా పాపిట మధ్య లో నీళ్లు పోసి రెండు చేతులతో పాపిట మధ్యలో పెట్టి జుట్టు ని అదిమాడు. ఆ తర్వాత కొంచెం కొంచెం గా జుట్టు ని పైకి లేపి నీటిని కుదుళ్ళకి పట్టేలాగా మర్దన చేస్తున్నాడు. నా జుట్టు ని మొత్తం కొప్పులాగా చేసి పైకి ఎత్తి మెల్లగా మొత్తం తడిపాడు.
ఇది అంత సరోజ వీడియో తీస్తూ ఉంది. వాడు జేబులో నుండి మంగలి కత్తిని తీసుకొని అందులోకి బ్లేడ్ దూరుస్తున్నాడు ఈ లోపల నాకు రెండు నల్ల రబ్బర్ బ్యాండ్ లు ఇచ్చి రెండు పిలకలు లాగా వేసుకోమన్నాడు. నేను నా తడి జుట్టు ని రెండు భాగాలుగా చేశాను పాపిట నుండి నా వేళ్ళతో. సరిగ్గా రావడం లేదు అని చెప్పి సరోజ ని అడిగి దువ్వెన తీసుకొని పాపిట మధ్యలో పెట్టి రెండు భాగాలుగా బాగా దువ్వేసాను. దువ్వేసి నా ఎడమ వైపున ఉన్న జుట్టు ని ఒక పిలక లాగా పట్టుకొని రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఒక పిలక లాగా వేసుకున్నాను. అలానే రెండొవ వైపు కూడా పిలక లాగా వేసుకున్నాను. బహుశా చాలా రోజుల తర్వాత నేను ఇలా రెండు పిలకలు వేసుకోడం అనుకుంట.
వాడు నా పిలకలని పట్టుకొని రబ్బర్ బ్యాండ్ దెగ్గర కొంచెం బిర్రు చేసి జుట్టుని కాస్త లాగాడు. నాకు ముందర అర్ధం కాలేదు ఎందుకు అలా లాగాడు అని కానీ తర్వాత అర్ధం అయ్యింది పిలకలు ఒత్తుగా కనిపిస్తాయి అని అలా లాగితే. అలా రెండు వైపులా లాగి ఇంకా పక్క లోడ్ చేసిన మంగలి కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. నేను మాత్రం అంతే చూస్తున్నాను.
మంగలి కత్తిని తీసుకొని తన ఎడమ చేతిని నా నడి నెత్తి మీద పాపిట మధ్యలో పెట్టి బ్రోటని వేలి దెగ్గర మంగలి కత్తిని ఆనించి మెల్లగా ముందుకు లాగడం మొదలు పెట్టాడు. తల అంత బాగా తడిసె సరికి మెత్తగా తెగుతుంది అనుకుంట "సరక్ సరక్ సరక్" మని శబ్దం చేసుకుంటూ ఆ మంగలి కత్తి నా తల మీద ఉన్న వెంట్రుకలని తెగ నరుక్కుంటూ పోయింది. మెల్లగా గొరుగుతూ నా కనుబొమ్మల వరకు గొరిగాడు. నాకు కొంచెం భయం వేసింది కొంప తీసి కనుబొమ్మలని ఎమన్నా గీకేస్తాడేమో అని. కానీ గుండెలు గొరగడం బాగానే అలవాటు ఉంది అనుకుంట నున్నగా గొరుగుతూ వెళ్ళాడు ముందర భాగం మొత్తం.
చెంపల మీద కూడా ఉండే నూనూగు వెంట్రుకలని గొరిగేప్పుడు మాత్రం భలే అనిపించింది. ఏదో తెలియని ఒక వింత అనుభూతి కలిగింది. కొంచెం చక్కిలిగింతలు పెట్టాయి బాగా. తలని ఒక పక్కకి తిప్పి గొరిగేప్పుడు మాత్రం తన వేళ్ళు గొరిగిన ప్రదేశం లో తాకుతూ ఉంటె భలే చల్లగా అనిపించింది. అందుకేనేమో సరోజ బాగా ఎంజాయ్ చేసింది గుండు ని.
మెల్లగా తలని బాగా కిందకి వంచి తల మధ్య భాగం నుండి వెనక్కి గొరుగుతూ వెళ్ళాడు. మధ్య మధ్యలో తలని సరి చేస్తూ పాపిట భాగం లోనే గొరిగాడు ముందర. అలా గొరుగుతున్నప్పుడు కొంచెం నొప్పి అనిపించింది వెంటనే "అమ్మ" అని అరిచాను.
"సారీ మేడం. మీకు ఏదో చిన్న బోబ్బా ఉన్నట్టు ఉంది. అదే కొంచెం తెగి రక్తం కారుతుంది"
"వామ్మో రక్తమా? సరోజ చూడవే అని చెప్పాను"
సరోజ - కొంచమే తెగింది లేవే. భయపడేది ఏమి లేదు లే. ఇదే తిరుమల లో గొరుగుడు అయితే ఈ పాటికి నీకు ఒక అయిదు లేక ఆరు గాట్లే పెట్టేవారేనే..."
వాడు - అవును మేడం. అక్కడ అయితే పిచ్చ ఫాస్ట్ గా గొరుగుతారు. అందుకే ఈ మధ్య తిరుమల వెళ్లకుండా కొంతమంది ఇక్కడే చేపించి తిరుమలలో జుట్టు వేస్తున్నారు. తెలుసా?
నేను, సరోజ ఒకరి మొహాలని ఒకరము చూసుకొని అవునా అన్నట్టు అన్నాము.
వాడు - మేడం కొంచెం వెనక్కి తిరగండి.
నేను వెనక్కి తిరిగి కూర్చున్నాను. సరోజ మంచిగా మొత్తం వీడియో తీస్తూ ఉంది. కొంచెం నా తలని వెనక్కి వంచి మిగిలిన జుట్టు ని గొరగడం మొదలు పెట్టేసాడు. నా పోనీ టైల్ వేలాడుతూ ఉంది. ఒక్క క్షణం లో ఆ చివర్ల వేలాడుతున్న జుట్టు ని కూడా గొరిగేసాడు. అంతే అది పరవళ్లు తొక్కుతున్న గంగ లాగా నా వడిలో పడింది. నేను దానిని చేతిలోకి తీసుకొని మొదళ్ళ దెగ్గర పట్టుకొని ఎంత ఒత్తుగా ఉందొ అని చూసుకున్నాను. అలా ఉండగానే రెండొవ పోనీటైల్ కూడా నా తల నుండి వేరు అయ్యి ఒడిలోకి చేరింది.
మొత్తం అయ్యాక మెడ మీద ఉండే నూనూగు వెంట్రుకలని గీస్తూ ఉన్నపుడు మాత్రం ఏదో తెలియని ఒక వింత అనుభవం. అది మాత్రం ప్రతి ఒక్కరు జీవితం లో అనుభవించాలి అని అనిపించింది. ముందరకి తిరగమని చెప్పి నీళ్లు పోసి మొత్తం మల్లి నున్నగా గొరిగేసాడు.
అయిపోయింది మేడం.
నేను వెంటనే నా చేతులని నా తల మీద పెట్టుకొని రుద్దుకుంటూ ఉంటె "అప్పటి వరకు ఉన్న నా జుట్టు ఏమయిపోయింది అని" అనిపించింది. దాని ప్లేస్ లో నున్నగా ఉండే గుండు రావడం అనేది మాత్రం భలే అనిపించింది.
నేను మెల్లగా లేచి నా మెడ మీద పడిన చిన్న చిన్న వెంట్రుకలని దులుపుకుంటూ ఉన్నాను. ఈ లోపల సరోజ నా చేతిలోని రెండు పిలకలని తీసుకొని నా గుండు కి రెండు పక్కల పెట్టి ఆడుకుంటూ ఉంది. వాడేమో తన మంగలి కత్తిలోని బ్లేడ్ ని తీసేసి డెటాల్ తో క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకొక బ్లేడ్ పెడుతున్నాడు అది చూసి వెంటనే నేను వాడితో "ఏంటి అంది మా సరోజ కి కూడా గుండు చేస్తున్నారా ఏంటి?" అని అడిగాను.
దానికి వాడికి ఏమి చెప్పాలో అర్ధం కాక అలానే చూస్తూ ఉన్నాడు సరోజ వంక చూస్తూ. సరోజ నెమో నా వంక వాడి వంక ఒక సరి చూసి "ఒసేయ్ నేనేం అడగలేదే గుండు చెయ్యమని. నీకు అంతగా కావాలి అంటే చెప్పు గొరిగించేసేస్తాను".
నేను - "సరోజ నువ్వు జోకులు భలే వేస్తావే. నేను అడిగితే వెంటనే చేపించేస్తావు అంట. కామెడీ లు చెయ్యకే.
సరోజ కొంచెం కోపం గ చూసి "జోకు ఏంటే. ఇవిగో ఈ పిలకలు పట్టుకో అని చెప్పి నాకు గొరిగేసిన పిలకల్ని నా చేతిలోనే పెట్టి వాడి ముందర బాసపట్టీలు వేసుకొని కూర్చుంది".
కూర్చొని వాడి వంక చూస్తూ "నాకు కూడా దాని కంటే ఇంకా నున్నగా ఉండే లాగా గుండు చెయ్యండి. దాని గుండు కంటే నా గుండు మెరిసిపోవాలి..."
1 Comments
సూపర్ ప్రజ్ఞ గారు.
ReplyDelete