హెయిర్ ఫెటిష్ కోసం ముంబై ప్రయాణం - Part 2

by - September 26, 2020

 "హలో... కొంచెం కాల్ కిరణ్ కి ఇస్తారా?"

"కిరణ్. నేను షాలిని. విను, ఎంత త్వరగా రావడానికి కుదురుతుంది నీకు?"

"ఎందుకు ఏంటే? వెంకీ వచ్చాడు రాత్రి బండికి వెళ్ళిపోవాలి అంట"

"అవునా సూపర్"

"సరే సరే నేను అయితే మాట ఇవ్వలేను" అని ఫోన్ పెట్టేసింది.

 వాచ్ చూసుకున్నాను. టైం ౩ అయ్యింది.  కిరణ్ నా రూమ్ మేట్. తనకి కూడా హెయిర్ కట్స్ అంటే ఇష్టమే. అండ్ నీకొకటి తెలుసా నీ దెగ్గర హెయిర్ కట్ చేపించుకోవాలని ఉంది అంట? నువ్వు ఇవ్వాళ రెండు హెయిర్ కట్స్ చెయ్యబోతున్నావు. 

నేను వింటుంది నిజమేనా అనిపించింది. "జోక్ చెయ్యకు షాలిని. నిజం చెప్పు..." అని ఆశ్చర్యం గా అడిగాను. 

కొంచెం కోపం గా చూస్తూ "నేనెందుకు జోక్ చేస్తాను నీతో? ఇంకొక ౩౦ నిమిషాలలో వచ్చేస్తుంది అప్పుడు నీకే అర్ధం అవుతుంది లే".

షాలిని డోర్ దెగ్గరికి వెళ్లి ఓపెన్ బోర్డు ని క్లోస్డ్ అని పెట్టి లోపల నుండే డోర్ లాక్ చేసింది. 

నేను సారీ చెప్పాను. తను నవ్వుతూ పర్లేదు వెంకీ అని చెప్పి కుర్చీలో కూర్చుంది.

"అవును తలుపు లోపల నుండి లాక్ చేస్తే తను ఎలా వస్తుంది"

"కంగారు పడకు. వెనక డోర్ నుండి వస్తుంది లే. తన దెగ్గర ఇంకొక కీ ఉంది లే"

"మరి ఈ లోపల మనం ఏమి చేద్దాం తను వచ్చే లోగా..." అని కన్ను కొట్టి చూసాను.

"తను వచ్చేంత వరకు అయితే నా జడ లోకి నీ దెగ్గర ఉన్న కత్తెర ని పోనివ్వను లే. తనకి కూడా హెయిర్ కట్స్ అంటే ఇష్టమే మన లాగా. అప్పుడప్పుడు మెరుపు తీయగలాగా వచ్చి నాకు అసిస్టెంట్ లాగా కూడా చేస్తూ ఉంటుంది. అది రాకుండా కానీ జుట్టు కత్తెరించుకుంటే నీతో ఇంకా అంతే సాయంత్రం భోజనం లోకి నన్ను తింటుంది".

"బావుంది గా వినడానికి"

"ఏంటి నన్ను భోజనంలో తినేస్తుంది అనడమా?" 

"కాదు కాదు. తనకి కూడా మన లాగానే హెయిర్ ఫెటిష్ ఉంది అనేది"

"ఓ అదా... ఇంకొక విషయం నువ్వేమి కంగారు పడకు జుట్టు కత్తెరించడానికి. నీకు నచ్చిన విధం గా చెయ్యి. ఒక వేళ ఎక్కడన్నా నీకు ఇబ్బంది అనిపిస్తే నేను చూసుకుంటాను".

"నన్ను నమ్మి అంత చేస్తుంటే నేను ఎందుకు అలా చేస్తాను. చాలా జాగ్రత్తగానే చేస్తాను"

"ఈ క్షణం కోసం ఎప్పటి నుండి ఎదురుచూస్తున్నానో నాకు మాత్రమే తెల్సు. నా ఎనిమిది సంవత్సరాల హెయిర్ ఫెటిష్ జీవితం నమ్మిన ఒకే ఒక మగాడివి నువ్వే".      

నాకు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. కిరణ్ వచ్చే లోపల నీ జుట్టు దువ్వడానికి అయినా ఒప్పుకుంటుందా లేక? నిన్ను ఇలా కుర్చీలో చూస్తూ ఉంటె చాలా టెంప్టింగ్ గా ఉంది నాకు..." 

దువ్వడమే కదా అందులో ఏముంది. 

తన కొప్పుకి ఉన్న దానిని మెల్లగా తీసేసాను. ఒక ఒత్తు అయిన జడ బయట పడింది. అది బ్యాండ్ కోసం అని చెయ్యి చాపింది. నేను తన చేతికి ఇవ్వగానే తను తీసేసి కౌంటర్ మీద పడేస్తూ "కొద్ది రోజుల వరకు దీనితో నాకు ఇంకా అవసరమే ఉండదు కదా..."

ఈ లోపల తాను సైడ్ కి పెట్టిన పక్క పిన్నులను తీసి తన కొప్పుకి పెట్టిన పిన్నులని కూడా తీసేసాను. అప్పటికే ఆ కొప్పు అలా ఉండడానికి పెట్టిన అయిదు పిన్నులని తీసేసాను. మెల్లగా వెతుకుతూ ఉంటె "హమ్మయ్య ఇంకొక పిన్ను కూడా దొరికేసింది" అని తీసేసాను. అవి విసిరి అక్కడ ఉన్న డస్ట్ బిన్ లో పడేసాను. 

"పర్లేదు... ఘటికుడివే...నీ చేతులలో ఏదో తెలియని మ్యాజిక్కు వుందోయ్..." 

"థాంక్ యు" అని చెప్పి ఆ కొప్పుని నొక్కుతున్నాను.

"ఏంటి బాబు. ఆ ముడిని విప్పవా ఏంటి? అలానే చూస్తూ ఉన్నావు?"

ఆ ముడి విప్పేసాను. ఒక పొడవాటి మరియు లావాటి జడ అందులో నుండి బయట పడింది. ఆ పొడవు చూసి నాకే ఆశ్చర్యం వేసింది. బహుశా ఒక 4  అడుగుల పొడవు ఉండచ్చేమో" అని ఒక చిన్న విజిల్ వేసాను.

అది విన్న షాలిని - "సర్ గారు డిసప్పోఇంట్ అవ్వలేదు" అని అర్ధం అయ్యింది. 

"ఆ జడ ని నా చేతికి చుట్టను ఒక నాలుగు చుట్లు అంత చుట్టక కూడా ఇంకొక అరడుగు పైననే కింద వేలాడుతుంది. అది చూసి నాకే ఆశ్చర్యం వేసి నిజం గానే నన్ను ఇంత పొడవాటి జుట్టు ని కత్తెరించడానికి ఒప్పుకుంటున్నావా అని అడిగాను? నాకు ఇంకా నమ్మశక్యం గానే లేదు"

"ఇప్పుడేంటి? గిచ్చమంటావా నిన్ను?"

"ఒక వేళ ఇది కల అయితే మాత్రం ఈ కలలో నుండి బయటకి వచ్చే ఉద్దేశమే లేదు నాకు మాత్రం. అవును నువ్వెందుకు నీ జడ ని అలా కొప్పులాగా పెట్టుకుంటున్నావు?" తన జడ తో ఆడుకుంటూ మధ్య మధ్య లో నొక్కుతూ అడిగాను.

"అదా... నా దెగ్గరికి వచ్చే వాళ్లకి నా జుట్టు ఎంత పొడవు అనేది తెలియకుండా ఉండడానికి. అది నేను వాళ్ళ జుట్టు కత్తెరిస్తూ ఉన్నపుడు కానీ నా జడ ని చూసి టెంప్ట్ అయ్యి వాళ్ళు కత్తెరించుకోకపోతే, ఒక వేళ ఆ ఆలోచనని మానేస్తారేమో అని..."

"నిజం గా అలా కూడా ఉంటారా?"

"హా!!! ఇది అడిగేసరికి నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. నువ్వు కానీ నా జుట్టు ని వదిలేస్తే నీకు ఒకటి చూపిస్తాను..."

నాకు వదలాలని అనిపించకపోయినా తప్పదు కాబట్టి తన జడని వదిలేసాను. ఆమె చైర్ లో నుండి లేచి "రా" అని తీసుకొని వెళ్ళింది తనతో పాటు.

ఇందాక కర్టెన్ వెనక నుండి బ్యాండ్ లు తెచ్చింది కదా ఆ రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది. లోపల అంత చీకటి గా ఉంటె లైట్ మరియు ఫ్యాన్ వేసింది. అందులో ఒక చిన్న గది. మేము నుంచున్నాక కొంచెం ఖాళి ప్రదేశం అది కాకుండా ఒక పెద్ద బల్ల దానికి ఏదో సరుగులు ఉన్నట్టు ఉన్నాయి. ఆ సరుగుని తెరిచి లోపల ఏవో అట్ట పెట్టెలు కనిపించాయి రక రకాల సైజు లలో. అన్నిటికంటే అడుగున ఉన్న సరుగు తెరిచి అందులో నుండి ఒక బాక్స్ బయటకి తీసింది. అది బల్ల మీద పెట్టి ఓపెన్ చేసి చూపించింది. అందులో రెండు కత్తెరించిన జడ లు ఉన్నాయి. నాకేమి అర్ధం కానట్టు షాలిని వంక చూసాను ఎవరివి అన్నట్టు.

"నావే. ఎనిమిది సంవత్సరాల క్రితం వి ఇవే"

"వావ్... ఇప్పటికి కూడా దాచుకున్నావా అవి?"

"హా అవును..."

"మరి మిగతా పెట్టెలు ఏమిటి?"

"అవా... అందులో గత నాలుగు సంవత్సరాలు గా నేను కత్తెరించిన జడ లు లేక పోనీటైల్స్ అన్ని అందులోనే ఉన్నాయి"




వాటిలో నుండి ఇంకొక బాక్స్ తీసి తెరిచింది. మూడు ఒత్తు అయిన జడలు. అవి మూడు బయటకి తీసి బల్ల మీద పరిచింది ఒక దాని పక్కన ఒకటి. ప్రతి జడ కి ఒక టాగ్ తగిలించి ఉంది. ప్రతి టాగ్ మీద తను కత్తెరించిన డేట్ మరియు కస్టమర్ పేరు కూడా రాసుకొని పెట్టుకుంది. చాలా పద్ధతి గా అనిపించింది. 

"నీకేమన్నా కావాలి అంటే తీసుకొని వెళ్ళు పర్లేదు" అని షాలిని అనింది నాతో.

"నేను వెంటనే తన జడ ని తీసుకొని తన మెడ దెగ్గరికి పెట్టి ఇది ఉంచుకుంటాను..."

"కుదరదు అనే అనుకుంటున్నాను. ఇక్కడ ఒక 40  లేక 50 జడ లు ఉంటాయి, ఒక మూడు డజన్ల పోనీటైల్స్ కూడా ఉంటాయి..."

అక్కడ ఉన్న బాక్స్ లు అన్నిటిని తెరిచి చూపించడం మొదలు పెట్టింది. అన్ని లెంగ్త్ ల మరియు లావు ల వారీగా సెట్ చేసి పెట్టింది అనుకుంట. అదేదో అమ్మకానికి పెట్టిన్నప్పుడు అమ్మే వాడికి చూపించినట్టు చూపిస్తుంది. నాకు అవి అన్ని చూస్తూ ఉంటె ebay లో అమ్మకానికి పెట్టిన పోనీటైల్స్  లాగా అనిపించింది. "వీటిని అమ్ముకుంటే బాగానే వస్తాయి గా డబ్బులు..."

"అది నాకు తెల్సు. కానీ నాకు నమ్మకం ఇష్టం లేదు. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి గా నాకు కూడా... అందుకే" అని చెప్పి నవ్వింది. 

నేను ఇంకా తన జడని పట్టుకునే ఉన్నాను. ఇది కూడా చాలా రేట్ పలుకుతుంది అనే అనుకుంటున్నాను. 

"నాకు తెల్సు. ఇప్పుడు నా జడ ని నీతో కత్తెరించుకోకుండా లాంటి ఆలోచనలు పెట్టమాకు..." 

నేను వెంటనే తన జడ ని వదిలేసాను. ఈ లోపల తానే ఒక పొడవాటి జడ ని నా చేతిలో పెట్టింది. ఒత్తుగా మరియు లావు గా అండ్ బారుగా ఉన్న జడ అది. అది కూడా ఒక మూడు అడుగుల వరకు ఉంటుంది అనుకుంట. దాని మీద ఉన్న టాగ్ మీద చూస్తే "12/3 /1997 12 :45 " అని ఉంది.

సరే అని అది పక్కన పెట్టి "కిరణ్ వచ్చే లోపల మనం ఏమి చేద్దామో చెప్పలేదు..."

"అది వచ్చేంత వరకు అయితే జుట్టు కత్తెరించేది మాత్రం లేదు... అది కంఫర్మ్ అనుకో..."

"అట్లీస్ట్ దువ్వే భాగ్యం అయినా కలిగించు నాకు..."

ఒక నిమిషం అలోచించి "సరే లే. నాకు ఏమి ఇబ్బంది లేదు నువ్వు కత్తెరకి దూరం గా ఉన్నంత వరకు..." 

అక్కడ నుండి సలోన్ లోకి వెళ్లి తాను చైర్ లో కూర్చుంది. నేను తన జడని తీసుకొని చైర్ మీద నుండి వెనుకకు వేసాను. నేను కౌంటర్ మీద దువ్వెన కోసం చెయ్యి పెట్టాను పక్కనే కత్తెర ఉండే సరికి కొంచెం టెంప్టింగ్ గా అనిపించింది. 

షాలిని కి అర్ధం అయ్యి "టెంప్టింగ్ గా అనిపిస్తుంది కాదు కత్తెర తీసుకుందాం అని... బట్ ప్లీజ్ వెంకీ నేను కిరణ్ కి ప్రామిస్ చేశాను అది వచ్చేంత వరకు కత్తెర మాత్రం తలలో పెట్టనివ్వను అని..." 

"రిలాక్స్" నేనేదో ఆటపట్టిస్తున్నాను అని చెప్పి తన వెనుకకి వెళ్లి తన జడ ని తీసుకున్నాను. జడ చివర్లో లూస్ గా ఉన్న జుట్టు ని దువ్వడం మొదలు పెట్టాను. అంత పొడవాటి మరియు బరువాతి జడ ని అలా చేయడం అనేది నా జీవితం లో మరచిపోలేని అనుభూతి. మెల్లగా ముందర వైపు పెట్టిన పిన్నులని తీసేసాను. తను కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తుంది. తన జడ చివర ఉన్న ఎలాస్టిక్ బ్యాండ్ ని తీసి కింద పడేసాను. మెల్లగా జడ విప్పడం మొదలు పెట్టాను ఒక పాయ తర్వాత ఇంకొక పాయ ని. జడ మొదలు అయినా భాగం లో నా బ్రోటని వేలిని పెట్టి నొక్కి ఆ పాయాలని విడదీసేసాను. 

"నువ్వు ఎలాంటి షాంపూ లేక హెయిర్ ఆయిల్ ఆడ్ కి మోడల్ లాగా చెయ్యలేదు అంటేనే ఆశ్చర్యం గా ఉంది..." 

"కమ్ ఆన్. ఆ టాపిక్ కాకుండా వేరే టాపిక్ ఎమన్నా ఉంటె మాట్లాడొచ్చు కదా ప్లీజ్".

"ఇంతకీ ఎన్ని సార్లు జుట్టు ని కత్తెరించుకున్నావు ఇప్పటి వరకు?"

"ఒక్కటే. అది కూడా ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగినదే. కాకపోతే ట్రిమ్స్ చేపించుకుంటూ ఉంటాను కిరణ్ చేత అవి లెక్కలోకి రాకుండా అయితే..."

కొంచెం బిడియం గానే "ఎందుకు చూపించావు ఎనిమిది సంవత్సరాల క్రితం?"

చెప్పాలా వద్ద అని అనుకుంటూనే "నేను దానిని అంత బాగా ఎంజాయ్ చెయ్యలేదు కానీ మర్చిపోలేని అనుభవం అది మాత్రం".

"దాని గురుంచి చెప్పొచ్చు కదా అని చెప్పి ఆ జుట్టు కి ఉన్న చిక్కుని వేళ్ళతో తీస్తూ అడిగాను..."

"ఎనిమిది సంవత్సరాల క్రితం, అప్పుడు నాకు 17  సంవత్సరాల వయసు. అప్పటి వరకు నాకు హెయిర్ కట్ లు నన్ను ఎక్సైట్ చేస్తాయి అనేదే తెలియదు. నా ఇంటర్ పరీక్షలు దెగ్గరికి వస్తున్నా రోజులు అవి. నేను కూడా బాగా కష్టపడి చదువుతున్నాను. మా అమ్మ కూడా నాకు అన్ని జాగ్రత్తగా చూసుకుందాం అని అనుకుంటుంది (ఎప్పుడు అంతే అనుకోండి). ఒక రోజు మా అమ్మ నా దెగ్గరికి వచ్చి మనం సలోన్ కి వెళ్తున్నాం అని చెప్పింది. నాకు ఏదో తేడా కొట్టింది కానీ అమ్మ ఎప్పుడు వెళ్లే సలోన్ కె కదా అని ఏమి ఆలోచించకుండా వెళ్ళాను. మేము వెళ్లే సరికి అక్కడ సలోన్ లో కుర్చీలో ఒక అమ్మాయి ఆల్రెడీ కూర్చొని ఉంది. తన జుట్టు మొత్తం అప్పటికే చిక్కులు తీసి వెనక పరచుకొని ఉంది. బ్యూటిషన్ ఆ జుట్టు ని మొత్తం ఒక పోనీటైల్ లాగా వేసి కత్తెర తీసుకొని కత్తెరించడం మొదలు పెట్టింది. నేను అలా చూడడం అదే మొదటి సారి. నాకు తెలియకుండానే నాలో ఏదో స్పందన మొదలు అయ్యింది. నేను మాత్రం అంతే చూస్తూ ఉన్నాను ఆమె జుట్టు ని ఎలా కత్తెరిస్తుందో మరియు తెగిపడుతున్న వెంట్రుకలని మొత్తం చూసాను. అబ్బాయిలకి చేసే విధం గా చేసేసింది ఆ పాప కి. నాకు మాత్రం చాలా ఎక్ససిటింగ్ గా అనిపించింది అది అంతా. 

ఈ లోపల నేను మెల్లగా జుట్టు ని దువ్వుతూ చిక్కుల్ని తీస్తూ ఉన్నాను. 

"ఆ తర్వాత మా అమ్మ నన్ను వెళ్లి కుర్చీలో కూర్చోమని చెప్పింది హెయిర్ కట్ కోసం అని. నేను షాక్ అయ్యాను. అస్సలు నేనెప్పుడూ ఊహించని లేదు అలా జరుగుతుంది అని. మా అమ్మ మొహం లో చూసాను... అర్ధం అయింది తనకి ఎదురు చెప్తే ఇప్పుడు కష్టం అని. సరే అమ్మ ఏది చెప్పిన నాకోసమే కదా అని చైర్ ఎక్కి కూర్చున్నాను. ఆ బ్యూటిషన్ కేప్ వేసి నా మెడ చుట్టూరా చుట్టింది. ఆ రోజు నేను రెండు జడలు వేసుకొని ఉన్నాను. ఉదయాన్నే అమ్మనే బాగా ఆయిల్ పోసి మర్దన చేసాక రెండు జడలు వేసింది. ఆమె మా అమ్మ ఆర్డర్స్ కోసం చూస్తూ ఉంది. నాకేమో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మా అమ్మ ఏమి చెప్తుందో అని, ఎంత కత్తెరించమని చెప్తుందో అని. 



మా అమ్మ వెంటనే "ఇందాకటి అమ్మాయి కి చేసిన లాగానే చేసేయండి" అని చెప్పింది. మా అమ్మ నాకు ఏమి చెప్పిందో అర్ధం అయ్యే లోపలనే బ్యూటిషన్ కత్తెర తీసుకొని తన చేతిలో ఉన్న ఒక జడ మొదలు దెగ్గర పెట్టి కచక్ కచక్ మని కత్తెరించేసింది. ఆ కత్తెర శబ్దం మాత్రం నాలో ఏదో తెలియని ఒక మాయ ని క్రియేట్ చేసింది. నా జీవితం లో ఎప్పుడు అలంటి అనుభూతి పొందలేదు నేను అయితే. నేను మాత్రం కళ్ళు మూసుకొని రిలాక్స్ అయ్యాను. కొద్ది క్షణాలలోనే ఒక వైపు ఉన్న జడ తన చేతిలోకి వచ్చేసింది. రెండొవ జడ ని పట్టుకొని పైకి లేపి కత్తెర పెట్టి కత్తెరించడం మొదలు పెట్టింది. 

ఈ లోపల నేను షాలిని జడ ని విప్పేసాను మొత్తం.

షాలిని - "ఇది జరిగాక నేను డిసైడ్ అయ్యింది ఏంటి అంటే. ఇంకా జీవితం లో హెయిర్ డ్రెస్సేర్ దెగ్గరికి వెళ్ళకూడదు అని. బ్యూటిషన్ రెండొవ జడ కూడా కత్తెరించేసాక ఆ అమ్మాయికి చేసిన విధం లాగానే నాకు కూడా చేసేసింది. చూస్తూ ఉండగానే నా మీద ఉన్న గుడ్డ మొత్తం కత్తెరించిన నా జుట్టు తోనే నిండిపోయి ఉంది. కానీ అది అంత నా మైండ్ లో ఇప్పటికి కూడా మెదులుతూనే ఉంది. ఆ సంఘటన నన్ను బ్యూటిషన్ కోర్స్ చెయ్యడానికి ప్రేరేపించింది. ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఒక యుద్ధమే చేశాను అనుకో. నా గోల్ నాకు గుర్తుండడానికి ఆ రెండు జడలని జాగ్రత్తగా నా దెగ్గారనే దాచిపెట్టుకున్నాను".

తన జుట్టుని దువ్వుతూ మెల్లగా తన జుట్టుని మొత్తం నా పిడికిలితో బంధించాను. దువ్వెనతో మిగతా జుట్టు ని మొత్తం దువ్వడం మొదలు పెట్టాను. తను కళ్ళు మూసుకొని బాగా ఎంజాయ్ చేస్తుంది నేను అలా చెయ్యడం. నాకు ఉండే ఆ భయం మరియు బిడియం అన్ని పోయాయి. జీవితం లో మొదటి సారి అలా ఒక అమ్మాయి నా ఎదురుగ మంగలి కుర్చీలో కూర్చొని ఉండడం. మెల్లగా దువ్వుతూ ఈ సారి దువ్వెన ని తన మెడ దెగ్గరికి పెట్టి ఆపాను అంతే. 

ఆమె వెంటనే కళ్ళు తెరిచి నా వంక చూసి కళ్ళతోనే ఏమిటి అన్నట్టు అడిగింది.

"నెక్స్ట్ టైం ఆ దువ్వెన మీద కత్తెర ఉంటుంది..."

"ప్రతి సారి చెప్పకు..."

నేను దువ్వడం మొదలు పెట్టి మెల్లగా వాచ్ వంక చూసాను. తను కాల్ చేసి ఒక అరగంట పైననే అవుతుంది. ఎప్పటికి వస్తుందో ఆ కిరణ్ అని మనసులో అనుకున్నాను. 

నేను దువ్వుతున్నప్పుడు మధ్యలో సడన్ గా "ఆ" అని అరిచింది. చిక్కు తీసేప్పుడు కొంచెం గట్టిగా లాగినట్టు ఉన్నాను. 

"అందుకే జుట్టు కత్తెరించుకుందాం అనేది... ఇంతకీ నీ ఖర్చు తగ్గ ఆనందం దొరుకుతుందా?"

"అంతకు మించి..." అని వాచ్ లో చూస్తే ౩:౩౦ అయింది. ఈ లోపల వెనక డోర్ ని ఎవరో ఓపెన్ చేస్తున్నట్టు శబ్దం వినపడింది.

"ఆడ పులి వచ్చింది..." అని షాలిని అరిచింది.

నేను వెనక్కి తిరిగి చూస్తే ఒక అమ్మాయి ఆ కర్టెన్ వెనక నుండి వచ్చింది..."

రావడం తోనే "షాలిని... మాట ఇచ్చావు కదే?" 

"ఒసేయ్ కిరణ్. అతను జుట్టు ని చిక్కులు లేకుండా దువ్వుతున్నాడే. అంతే..."

"ఊరికినే సరదాకి అంటున్నానే" అని నా వంక తిరిగి. "హాయ్ వెంకీ. నా గురుంచి తను చెప్పింది అనే అనుకుంటున్నాను"

నేను తనకి హాయ్ చెప్పను ఒక చేతితో రెండొవ చేతిలో మాత్రం షాలిని జుట్టు అంతే పట్టుకొని ఉన్నాను. చూడడానికి అంత గొప్ప అంత గత్తె కాకపోయినా బావుంది అమ్మాయి మాత్రం. తన చేతిలో కెమెరా బ్యాగ్ ఉంది దానిని తీసుకొని పక్కన పెట్టింది.

"ఒసేయ్ షాలిని. ఆ కుర్చీలో నుండి లెగువు ముందర...."

షాలిని - "ఓవర్ ఆక్షన్ చెయ్యకే. వెంకీ నాకు ఫ్రెండ్. సో ముందర నాకు హెయిర్ కట్ చెయ్యాలి..."

"నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని గెలుద్దాం అనే నా?"

షాలిని - "ఒసేయ్ నేను గెలవలెను అని నీకు కూడా తెలుసు. అయినా నీ వల్లనే కదా నేను ఇంకా ముంబై లో ఉంటున్నాను. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే వాళ్ళా" అనుకుంటూ కుర్చీలో నుండి లేచి కిందకి దిగింది. 

ఒక్క నిమిషం అని చెప్పి నేను తన జుట్టు ని పోనీటైల్ లో లాగా వేసాను. షాలిని లేచింది కిరణ్ వచ్చి కుర్చీలో కూర్చుంది. తను కూడా తన జుట్టు ని కొప్పులాగా పెట్టుకొని ఉంది. తన మెడ కనిపించే లాగా ఉంది తన కొప్పు. ఆ కొప్పు నిలవడానికి ఒక పెద్ద క్లచ్ పెట్టి ఉంది. బ్యాంగ్స్ కూడా ఉన్నాయి తన కనుబొమ్మల మీద పడేలాగా.

కిరణ్ - "నేను హెయిర్ కట్ కి రెడీ అని చెప్పింది"

నేను షాలిని వంక చూసాను. షాలిని నవ్వుతు కానివ్వు అన్నారు సైగ చేసింది. 

"సో ఎలాంటి హెయిర్ కట్ అనుకుంటున్నారు. మనసులో ఏమైనా ఉందా ఆల్రెడీ?"

You May Also Like

3 Comments

  1. సహజముగా ఉన్న సన్నివేశము లో ఇద్దరు జుట్టు ప్రేమికుల మనసు బాగా చూపించావు.

    ReplyDelete
  2. సహజముగా ఉన్న సన్నివేశము లో ఇద్దరు జుట్టు ప్రేమికుల మనసు బాగా చూపించావు.

    ReplyDelete
  3. సహజముగా ఉన్న సన్నివేశము లో ఇద్దరు జుట్టు ప్రేమికుల మనసు బాగా చూపించావు.

    ReplyDelete