హెయిర్ ఫెటిష్ కోసం ముంబై ప్రయాణం - పార్ట్ 3

by - October 04, 2020

 తను ఒక ఫోటో తీసి నా చేతిలో పెట్టింది. చూడగానే అర్ధం అయ్యింది ఇది ఎక్కడో చూసాను అని. సరిగ్గా గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు మనసులో మెదిలింది ఆ ఫోటో ఎవరిది అని "ఏంజెలీనా జోలి". ఏదో సీరియల్ లో పాత్ర కోసం అని చెప్పి అబ్బాయిల లాగా డిప్ప కటింగ్ కొట్టించింది. నాకు అర్ధం అయ్యి వెంటనే తనతో "ఇది ఎక్కడ నుండి తీసుకున్నావో నాకు తెల్సు గా?"

"నెట్ నుండే లే బాబు. కాకపోతే నాకు ఈ హెయిర్ స్టైల్ ఎంతగానో నచ్చింది.  చేయగలవా?"

"సింపుల్ గానే చేసేయొచ్చు. ముందర జుట్టు ని మొత్తం కత్తెరించేసి పైన రెండు ఇంచులు ఉంచి వెనక పక్కన ఒక అర అంగుళం ఉంచితే చాలు. అంతే కదా?"

"పర్ఫెక్ట్. అంతే. కాకపోతే మెడ భాగం మరియు చెవుల వెనుక స్మూత్ గా గియ్యాలి..."

ఆలస్యం ఎందుకు ఇంకా అని చెప్పి కేప్ తీసుకొని ఒక సరి దులిపి కిరణ్ మీద కప్పి మెడ దెగ్గర కట్టేసాను. తన కొప్పుకి పెట్టి ఉన్న క్లిప్ ని తీసి అద్దం ముందర పడేసాను. మూడు అడుగుల పట్టు కుచ్చు లాంటి శిరోజాలు జాలు వారాయి వెనుకకు. మెల్లగా వేళ్ళతో చిక్కులు తీస్తూ దువ్వుతున్నాను. ఈ లోపల షాలిని తెగ కష్టపడుతుంది ఏదో వెతకడానికి. ఏంటా అని చూస్తే లోపల నుండి ఒక మంగలి కత్తి ని బయటకి తీసింది. నాకు ఒక్క నిమిషం ఏమి అర్ధం కాలేదు. "మెడ మీద నున్నగా గొరగలి కదా అందుకని" అని చెప్పింది.

అప్పటి వరకు షాలిని జుట్టు ని దువ్విన దువ్వెన ని తీసుకొని కిరణ్ కి కూడా దువ్వడం మొదలు పెట్టాను. షాలిని జుట్టు ఎంత బావుందో అంతే బావుంది కిరణ్ జుట్టు కూడా కాకపోతే ఇద్దరి హెయిర్ టెక్సచెర్ వేరు కొంచెం. జుట్టు నుదురు భాగం నుండి మెల్లగా దువ్వుకుంటూ నడి నెత్తి మీద భాగం నుండి కిందకి దువ్వుకుంటూ వచ్చాను. నా ఎడమ చేతితో మొత్తాన్ని కలిపి పట్టుకొని కిందకి జాలువారుతున్న జుట్టుకి చిక్కులు తీస్తూ ఉన్నాను దువ్వెన తో. కిరణ్ ప్రశాంతం గా కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తుంది నేను అలా దువ్వుతూ ఉంటే.

"రబ్బర్ బ్యాండ్..." అని అడిగాను.

షాలిని ఒక సరుగు తెరిచి అందులో నుండి రబ్బర్ బ్యాండ్ ల ప్యాకెట్ తీసుకొని అందులో నుండి ఒకటి తీసి నా చేతికి అందించింది. 

"ఏయ్ దొంగ..." అని నవ్వాను తన వంక చూసి.

"కమ్ ఆన్..." అని కన్ను కొట్టింది. 

కుర్చీలో కూర్చున్న కిరణ్ కి ఏమి అర్ధం కావడం లేదు. షాలిని వంక చూస్తూ "ఏంటే అది?"

షాలిని - ఏమి లేదు లేవే. నువ్వు సైలెంట్ గా కూర్చొని ప్రశాంతం గా ఎంజాయ్ చెయ్యి హెయిర్ కట్ ని. నేను తర్వాత చెప్తాను లే.

తన జుట్టు ని "హై పోనీ టైల్..." లాగా వేసాను ఆ రబ్బర్ బ్యాండ్ తో. రబ్బర్ బ్యాండ్ మెలితిప్పుతూ ఉంటే ఆ జుట్టు మొత్తం నా చేతులను ముద్దాడుతూ ఉంటే అది నిజం గా స్వర్గమే అనుకోవచ్చు. తన జుట్టు లో నుండి షాంపూ సువాసన అనేది నన్ను మంత్రం ముగ్ధుడిని చేసింది. ఆ పోనీ టైల్ ని తీసుకొని కొప్పు లాగా చుట్టేసి ముడి వేసాను. ఆ ముడి ని పట్టుకొని తన తల ని కిందకి వంచాను. 

"నీళ్లు?" అని అడిగాను.

షాలిని వాటర్ స్ప్రేయర్ ని నా చేతికి అందించింది. నీటిని నా చేతిలోకి కొట్టుకొని ఆ తడి చేతిని తన చెవుల వెనుక ఉన్న నూనూగు వెంట్రుకలని తడిపాను. అలా అనేసరికి చక్కిలిగిలి పెట్టినట్టు అనిపించింది అనుకుంట. ఒళ్ళు జలదరించి కదిలింది. మీద దెగ్గర ఉన్న నూనూగు వెంట్రుకలని  కూడా తడిపి "అస్త్ర?" అని అడిగాను. 

షాలిని నా చేతికి అందించి అంతే చూస్తూ ఉంది. కిరణ్ కి కొంచెం భయం గానే ఉంది మనసులో. నేను కిరణ్ తో "ఇప్పుడు మాత్రం కదలకుండా ఉండు ప్లీజ్" అని తన తలని ఇంకొంచెం ముందరకి వంచాను. ఒక స్కూల్ పిల్ల వంచుకున్నట్టు వంచుకొని కూర్చుంది. తన చెవులని ముందరకి వంచి మెల్లగా గీయడం మొదలు పెట్టాను. నూనూగు వెంట్రుకలు తెగి అస్త్ర కె అంటుకుంటున్నాయి. మధ్యలో గీకడం ఆపి ఆ అంటుకున్న వెంట్రుకలని తన కొప్పుకి రుద్దాను. కుడి వైపు అయిపోగానే ఎడమ వైపు కూడా అలానే గీకేసాను. అలా గీకుతూ మెడ భాగం లో ఉండే వెంట్రుకలని గొరగడం మొదలు పెట్టగానే కిరణ్ కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తోంది. బాగా నున్నగా గీకేసాక చేతితో అప్పుడే నున్నగా గొరిగిన ప్రదేశాన్ని తడిమాను. 

"ఉమ్... నిజం గా సూపర్ ఉంది వెంకీ".

అస్త్ర కి అంటుకున్న వెంట్రుకలని ఆ కొప్పుకి రుద్దేసి అస్త్ర ని షాలిని చేతికి ఇచ్చేసాను. వెంటనే షాలిని నా చేతిలో ఒక పెట్టె పెట్టి ఏంటో కనిపెట్టు చూద్దాం అనే లుక్ ఇచ్చి "ఓపెన్ చెయ్యి బాబు..."

నేను తెరిచాను. నా ఊహకి అందని విధం గా అందులో ఒక కొత్త కత్తెర (కొంచెం కాస్ట్ ఎక్కువనే అనుకుంట) ఉంది. ఆ కత్తెర మీద వెలుతురూ పాడెపుడు వచ్చే మెరుపుకి నా కళ్ళలో కాంతి మెరిసింది. నా చేతులలోకి తీసుకొని కచక్ కచక్ మనే శబ్దం చేశాను.

షాలిని అది చూసి "బాబు మరి ఊహా లోకాలలోకి వెళ్లకుండా ఈ లోకం లోనే ఉండవా ప్లీజ్..."

"కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికితేనే కష్టం అలాంటిది కొబ్బరి చిప్పల బుట్ట దొరికినట్టు అనిపించింది..." నాకు అయితే. నేను ఇంక కిరణ్ వైపుకి తిరిగి తన కొప్పులాగా ఉన్న జుట్టు ని తీస్తూ "నీకు ఆ ముంగురులు కావాలా ఇప్పుడు?" జుట్టు మెల్లగా జారుతూ ఉంది ఈ లోపల నేను తన గెడ్డం దెగ్గర చెయ్యి పెట్టి ముంగురులు కింద కత్తెర ఆడిస్తూ తను ఏమి చెప్తుందో అని ఎదురు చూస్తూ "కత్తెర నుదురు మీద పెట్టి ముంగురులు "కచక్ కచక్" అని ఆడించాను. అంతే. తన ముంగురులు మొత్తం తెగి తన వడిలో పడ్డాయి. షాలిని అంతే నోరు తెరిచి చూసింది ఒక్క సారి.

కిరణ్ మాత్రం ఏమి మాట్లాడకుండా హాయిగా ఎంజాయ్ చేస్తుంది. నేను వెంటనే తన పోనీటైల్ ని పట్టుకొని కత్తెర పోనీటైల్ దెగ్గర పెట్టి మొదలెడుతున్నా? అని అడిగాను.

షాలిని మరియు కిరణ్ ఇద్దరు - కానివ్వు అన్నట్టు తల ఊపారు. 



నేను ఆ పోనీటైల్ కి ఉన్న రబ్బర్ బ్యాండ్ కి కత్తెరించాను. అంతే అప్పటి వరకు హై పోనీ టైల్ లో ఉన్న జుట్టు మొత్తం కిరణ్ భుజాల మీద పరుచుకుంది. కత్తెర షాలిని కి ఇచ్చి దువ్వెనతో తన జుట్టుని మళ్ళీ దువ్వుతూ రబ్బర్ బ్యాండ్స్ అడిగాను. పాపిట తీసి జుట్టు ని రెండు గా విడదీసి ఒక వైపు వచ్చి జుట్టు ని మొత్తం దువ్వి చెవి పైన ఒక రబ్బర్ బ్యాండ్ తో పోనీ టైల్ వేసాను. అలానే ఇంకొక వైపు కూడా వేసాను. 

"కత్తెర" అని అడిగాను. 

షాలిని నా చేతికి కత్తెర అందించి నా పక్కకి వచ్చి నుంచుంది బాగా కనపడే లాగా. నేను వెంటనే కత్తెర ని తీసుకొని కిరణ్ చెవి మీద ఉన్న ఎడమ వైపు పోనీ టైల్ లోకి దూర్చి మెల్లగా కత్తెరించడం మొదలు పెట్టాను కచక్ కచక్ మంటూ. అంతే నిమిషం లోనే ఆ పోనీటైల్ మొత్తం తన తల నుండి వేరు అయ్యి తెల్లటి కేప్ మీద జారుకుంటూ వడిలో ఆగింది. వెంటనే షాలిని దానిని తీసుకొని కత్తెరించిన భాగాన్ని తీసుకొని బుగ్గగి రుద్దుకొని సిగ్గు పడింది.  కిరణ్ తన ఎడమ చేతిని కేప్ లో నుండి బయటకి తీసి అప్పుడే కత్తెరించిన ప్రదేశం లో రుద్దుకుంది. షాలిని కూడా అదే చేసింది. నేను కూడా వాళ్ళతో పాటు యాడ్ అయ్యాను.

ఇంకొక పక్కకి వెళ్ళాను. షాలిని కిరణ్ జుట్టు ని తన భుజం మీద అలా పెట్టింది. ఏదో చంపిన పామును పెట్టినట్టు నల్లగా పొడవాటి పోనీటైల్ అలా పది ఉంది. రెండొవ పోనీటైల్ ని కూడా దాని దెగ్గరకు చేరుస్తాను ఆగు అంటూ రెండొవ పక్క దానిని కూడా "కచక్ కచక్" మని పించుకుంటూ కత్తెరించేసాను. కిరణ్ మరియు షాలిని ఇద్దరు అది ఎప్పుడు తల నుండి వేరు అవుతుందా అని చూస్తూ ఉన్నారు. నాకు మాత్రం కత్తెర శబ్దం కిక్ ని ఇస్తుంది. 

ఆ పోనీటైల్ కూడా తన తల నుండి వేరు అయిపోయింది. దానిని షాలిని తీసుకొని మెడ కి షాల్ లాగా చుట్టుకుంది. నల్లటి షాల్ భలే అనిపించింది చూడడానికి కూడా. నేను నా ఎడమ చేతితో తన తలని రుద్దాను. జుట్టు మొత్తం పరుచుకుంది ఒక రకమైన బాబ్ కట్ లాగా ఉంది చూడడానికి అయితే ఆ లుక్ మాత్రం.

కిరణ్ - ఇది కాదు బాబు నేను అడిగిన లుక్ అని అనింది. 

ఆగండి మేడం చేస్తున్నాను అని దువ్వెన తీసుకొని చిన్నప్పుడు మంగళోడు ఎలా అయితే జుట్టులో కత్తెర పెట్టి కత్తెరించేవాడో గుర్తు తెచ్చుకొని అలానే కత్తెరించడం మొదలు పెట్టాను. దువ్వెన జుట్టులోకి దూర్చడం కొంత జుట్టు ని కత్తెరతో కత్తెరించడం. ఇది భలే అనిపించింది. నల్లటి వెంట్రుకల వర్షం పడుతున్నట్టు అనిపించింది ఆ కేప్ మీద మొత్తం. చూస్తూ ఉండగానే వెనుక భాగాన్ని పూర్తి చేశాను. చాలా తక్కువ జుట్టు ఉండేలాగా కత్తెరించాను. 

అలానే మొత్తం జుట్టు ని కత్తెరతో కత్తెరించాను. ఒక్క పది నిమిషాలలోనే ఆమె అనుకున్నట్టు జుట్టు ని కత్తెరించాను. అక్కడక్కడా ఎక్కువ ఉన్న జుట్టు ని కూడా చూసుకొని మెల్లగా కత్తెరించేసాను. అలా ఆపేసి అంతే వెనుక నుంచున్నాను. 

షాలిని చూసి - "లవ్లీ... హెయిర్ స్టైలిస్ట్ గా మంచి భవిష్యత్తు ఉండోయ్ నీకు. నేను చెయ్యడానికి పనేమీ మిగల్చలేదు నువ్వు..."

కిరణ్ కూడా - చాలా బాగా చేసావు వెంకీ. ఐ రియల్లీ లవ్డ్ ఇట్.

"థాంక్ యు... థాంక్ యు..." అని చెప్పి కిరణ్ మెడకి ఉన్న కేప్ ని విప్పాను. 

అంతే అప్పటి వరకు తన వడిలో పడి ఉన్న నల్లటి వెంట్రుకల కుప్ప మొత్తం తన కాళ్ళ మీద పడింది. మెల్లగా కిరణ్ లేచింది. 

నేను షాలిని వంక చూసి "నీ వంతు మిత్రమా ఇప్పుడు?"

ఒక చిన్న ఆలోచన ఏదో తన మదిలో మెదులుతున్నట్టు అనిపించింది. గట్టిగా శ్వాస తీసుకొని కుర్చీలో కూర్చుంది. నేను వెంటనే కేప్ ని తన మీద కప్పి మెల్లగా తన మెడ కి చుట్టి మెడ దెగ్గర కట్టాను. కడుతూ లోపల నుండి తన పొడవాటి పోనీ టైల్ ని తీసి బయట పడేసాను. ముడి దెగ్గర నుండి కిందకి ఉన్న ఆరు అంగుళాల జుట్టు ని మెల్లగా దువ్వుతూ ఉన్నాను అనమాట.

కిరణ్ - "వెంకీ నేను దాని పోనీటైల్ ని కత్తెరించవచ్చా?" 

నేను ఏమి తెలీదు అన్నట్టు "నాకు తెలీదు కాకపోతే తననే అడుగు అని" షాలిని మీదకే తోసేసాను. 

షాలిని వెంటనే - "ఒసేయ్ ఇదేమి బాలేదే. నేనేమన్నా నీ జుట్టు ని కత్తెరించానా ఏంటి?"

కిరణ్ - "హలో మేడం. అది నీ తప్పు. నువ్వేమి అడగలేదు కదా?" అని చెప్పి కత్తెరని తీసుకొని ఆ ఆరు అంగుళాల పైన పెట్టి కత్తెరిస్తున్నటు సైగ చేసింది. 

నేను వెంటనే అక్కడ కాదు ఇక్కడ అని మెడ దెగ్గర పెట్టి వేళ్ళతో కత్తెరించే లాగా చూపించాను ఇలా అన్నట్టు.

షాలిని మాత్రం ఏదో బొమ్మ లాగా కూర్చొని చూస్తూ ఉంది. కానీ కిరణ్ తో ఆ ఆరు అంగుళాల వరకు మాత్రమే కత్తెరించు. మిగతాదానికి నాకు వేరే ఆలోచన ఉంది లే అని అనింది. 

కిరణ్ నన్ను చూసి "రబ్బర్ బ్యాండ్ ప్లీజ్..." అని అడిగింది. 

నేనేదో తనకి అసిస్టెంట్ లాగా వెంటనే రబ్బర్ బ్యాండ్ ఇచ్చాను. వెంటనే ఆ ఆరు అంగుళాల వరకు రబ్బర్ బ్యాండ్ వేసి "ఈ నాలుగు సంవత్సరాలలో ఇదే మొదటి సారి దీని జుట్టు ఇంత కత్తెరించడం అని చెప్పింది".

మెల్లగా తానూ రబ్బర్ బ్యాండ్ వేసిన పోనీటైల్ పైకి కత్తెర పెట్టి కచక్ కచక్ మని కత్తెరించడం మొదలు పెట్టింది. ఒకటే నిమిషం లో ఆరు అంగుళలో పోనీటైల్ తన చేతిలోకి వచ్చేసింది. దానిని తీసుకొని ముద్దు పెట్టింది కిరణ్.

కత్తెర నా చేతికి ఇచ్చి కిరణ్ పక్కకి వెళ్ళింది. నేను అలా ముడి లాగా ఉన్న జుట్టు ని విప్పేసాను. ఆరు అంగుళాలు కత్తెరించక కూడా షాలిని జుట్టు పొడవు లో మాత్రం మార్పు కనిపిస్తున్నట్టు అనిపించలేదు. వెంటనే దువ్వెన తో దువ్వేసాను. దువ్వుతూ సో చెప్పండి మేడం ఏమి చెయ్యాలి అనేది...

రెండు పోనీటైల్స్ వేసి కత్తెరించి "సింపుల్ బాబ్ విత్ బ్యాంగ్స్ కావాలా లేక మన కిరణ్ కి లాగా కావాలా?"

షాలిని నవ్వి అక్కడ డ్రా ఓపెన్ చెయ్యి అని చెప్పింది. కిరణ్ ఓపెన్ చేసింది. అందులో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ లాగా ఉంది అనమాట. కిరణ్ అది చూసి "ఇది ఏంటే? నాకు చెప్పనే లేదు?"

షాలిని - "అబ్బా అలా ఏమి లేదే. ఆ కత్తెర నువ్వు కొన్నావు కదా అలానే నేను ఇది తీసుకున్నాను అనమాట"

కిరణ్ - సరే లే మేడం అని చెప్పి ఓపెన్ చెయ్యబోతూ కూడా మళ్ళీ ఏమనుకుందో ఏమో నా చేతికే ఇచ్చింది.

షాలిని వంక ఏమి అర్ధం కానట్టు చూసాను. "అది తెరిచి చూడు..." అని అనింది.

నేను మెల్లగా ఆ పైన గిఫ్ట్ కవర్ చాలా జాగ్రత్త గా తీసి ఆ బాక్స్ ని తెరిచాను. అందులో ఉన్నది చూసి నేను షాక్ అయ్యాను అనమాట..." 

అందులో ఏముంది... ఆ తర్వాత ఏమయ్యింది అనేది తెల్సుకోవాలి అంటే - ఇంకొక పార్ట్ కోసం ఆగాల్సిందే...

చదివిన వారికి ధన్యవాదములు... చదివి మీ అమూల్య మైన కామెంట్స్ ని తెలియ చేయగలరు అని ప్రార్ధన.

You May Also Like

3 Comments

  1. Really enjoying the story, please post the remaining story

    ReplyDelete
  2. కంటిన్యూ చేయండి

    ReplyDelete